నిజమైన దాసోహం ఏమిటి అన్న విషయం పై ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) యొక్క హదీస్ వివరణ...

ఇస్లాం పరిభాషలో చెప్పాలంటే దాసోహం అనగా దైవగుణాలతో తనను తాను అలంకరించుకోవడం. తన ఉనికిని దైవం యొక్క ఉనికి యొక్క అద్ధంలో చూడడం. అల్లాహ్ ఆయన నియమించిన ప్రముఖుల విధేయత తప్ప మరొకరిని తన ప్రభువుగా నిర్ధారించుకోకుండా ఉండడం.
అల్లాహ్ యొక్క తౌహీద్ మరియు ఆయన యొక్క విలాయత్ ఒక నాణానికి రెండు వైపుల మాదిరి, అల్లాహ్ పరిపూర్ణ గుణాలతో పూర్తిగా తనను తాను అలంకరించుకున్న దాసుడను అనగా పరిపూర్ణ స్థితిలో విధేయత కలిగి వుంటే అల్లాహ్ కూడా అతడి పట్ల ఎక్కువగా బాధ్యత కలిగి ఉంటాడు. అనగా అతడు కూడా అల్లాహ్ యొక్క వలీ అయి ఉంటాడు. మరో విధంగా చెప్పాలంటే అతడు వలీయుల్లాహ్.
రావీ ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ను నిజమైన దాసోహం గురించి ప్రశ్నించినప్పుడు వారు నిజమైన దాసోహం మూడు విషయాలు..
1. అల్లాహ్ నీకు ప్రసాదించిన వాటిని నువ్వు యజమాని అని భావించకు ఎందుకంటే దాసుడికి సొంతం అనేది ఏదీ ఉండదు. అతడు తనను అల్లాహ్ సొత్తుగా భావించాలి మరియు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టాలి.
2. దాసుడు తన భవిష్యత్తు కోసం ఏదీ ఆలోచించుకోకూడదు. (అనగా అల్లాహ్ ఏది నిర్ణయిస్తే దాని పట్ల ఓర్పుగా ఉండాలి).
3. దాసుడు తన ప్రభువు చెప్పిన ఆదేశాలన్నింటిని పాటించాలి మరియు నిషేదించబడిన వాటి నుండి దూరంగా ఉండాలి. (1)
రిఫరెన్స్
1. బిహారుల్ అన్వార్, భాగం1, పేజీ224, కితాబుల్ ఇల్మ్, బాబ్.. ఆదాబు తలబిల్ ఇల్మి వ అహ్కామిహి.
قُلتُ: یا أَبا عَبْدِاللهِ؛ ما حَقِیقَةُ الْعُبُودِیَّةِ؟ قالَ: ثَلاَثَةُ أَشْیاءٍ: أَنْ لا یَرَی الْعَبْدُ لِنَفْسِهِ فِیما خَوَّلَهُ اللهُ مِلْکاً، لأنَّ الْعَبِیدَ لا یَکُونُ لَهُمْ مِلْکٌ، یَرَوْنَ الْمالَ مالَ اللهِ، یَضَعُونَهُ حَیْثُ أَمَرَهُمُ اللهُ بِهِ؛ وَ لاَ یُدَبِّرُ الْعَبْدُ لِنَفْسِهِ تَدْبِیراً؛ وَ جُمْلَةُ اشْتِغالِهِ فِیما أَمَرَهُ تَعالی بِهِ وَ نَهاهُ عَنْهُ...
వ్యాఖ్యానించండి