ఆయతుల్లాహ్ ఫాతెమీ నియా(ర.అ)

మంగళ, 05/17/2022 - 17:58

ఆయతుల్లాహ్ ఫాతెమీ నియా(ర.అ) సుదీర్ఘ అనారోగ్యం తరువాత 16/05/2022 సోమవారం రోజు ఉదయం ఈలోకాన్ని విడిచారు. వారి గురించి సంక్షిప్తంగా తెలుసుకుందా...

ఆయతుల్లాహ్ ఫాతెమీ నియా(ర.అ)

ఆయతుల్లాహ్ ఫాతెమీ నియా(ర.అ) సుదీర్ఘ అనారోగ్యం తరువాత 16/05/2022 మంగళవారం రోజు ఉదయం ఈలోకాన్ని విడిచారు. వారి గురించి సంక్షిప్తంగా తెలుసుకుందా:

ఆయతుల్లాహ్ ఫాతెమీ నియా(ర.అ), క్రీ.శ 1946లో ఇరాన్ దేశానికి చెందిన తబ్రేజ్ పట్టణంలో జన్మించారు. వారి తండ్రి పేరు మీర్ ఇస్మాయీల్, వారు తబ్రేజ్ పట్టణా గొప్ప ఉలమాలలో ఒకరు, వారు ఆయతుల్లాహ్ ఫాతెమీ నియా(ర.అ) ను చిన్నప్పటి నుండే తన ప్రత్యేక శిక్షణ మరియు శ్రద్ధతో పెంచారు. కొంత కాలం గడిచిన తరువాత విద్యాభ్యాసం మరియు శిక్షణ కోసం ఆయతుల్లాహ్ ముస్తఫవీ తబ్రేజీ (ఆయతుల్లాహ్ సయ్యద్ అలీ ఖాజీ యొక్క శిష్యులు మరియు గొప్ప ఆరిఫ్) కు అప్పగించారు, ఆ గొప్ప వ్యక్తి దాదాపు 30 సంవత్సరాల వరకు అన్ని విధాలుగా ఆయతుల్లాహ్ ఫాతెమీ నియా(ర.అ)ను శిక్షణ ఇచ్చి ఒక్క గొప్ప ఉనిగి గల ఆలిమ్ గా తీర్చిదిద్దారు.
ఆయతుల్లాహ్ ఫాతెమీ నియా(ర.అ), ఆయతుల్లాహ్ ముస్తఫవీ తబ్రేజీ కాకుండా అల్ మీజాన్ రచయిత అయిన అల్లామా మొహమ్మద్ హుసైన్ తబాతబాయి, ఆయతుల్లాహ్ ఇలాహీ తబ్రేజీ (అల్లామా మొహమ్మద్ హుసైన్ తబాతబాయి సోదరులు), ఆయతుల్లాహ్ మొహమ్మద్ తఖ్లీ ఆములీ, ఆయతుల్లాహ్ సయ్యద్ రిజా బాహావుద్దీనీ, ఆయతుల్లాహ్ బెహ్జత్ మరియు ఇతర గొప్ప గొప్ప ఉలమాలతో కలిశారు(విద్యను పొందారు).

ఆయతుల్లాహ్ ఫాతెమీ నియా(ర.అ) ఇస్లామీయ యునీవర్సిటీలలో విద్యాబోధనలో, పరిశోధనలలో నిమగ్నమై ఉండేవారు. వారు రేడియో మరియు టీవీ ప్రోగ్రాములలో కూడా ఉపన్యాసాలు ఇచ్చేవారు. వారు ఉత్తమ ఉపన్యాసి. పెద్ద పెద్ద సభలలో వారు ఆహ్వానించబడే వారు. వారు రిజాల్ మరియు ఇర్ఫాన్ విద్యలలో నైపుణ్యం కలిగి ఉన్నప్పటికీ వారు నిత్యం ఉపన్యాసాలు ఇవ్వడంతో వారిని ఒక గొప్ప ఉపన్యాసిగానే ప్రఖ్యాతి చెందారు. ప్రజలకు వారి విజ్ఞానం మరియు నైపుణ్యత గురించి అంతగా తెలియదు. వారు సహీఫయె సజ్జాదియహ్ మరియు నెహ్జుల్ బలాగహ్ యొక్క గొప్ప వ్యాఖ్యాత.

2019వ సంవత్సరం ఫిబ్రవరి లో డాక్టర్ల నిర్ధారణ ప్రకారం ఆయతుల్లాహ్ ఫాతెమీ నియా(ర.అ) క్యాన్సర్ వ్యాధికి గురి అయ్యారు. చికిత్స ద్వార వారి ఆరోగ్యం కొంత మెరుగు పడింది కాని కాలం గడవడతో పాటు మరలా వారి అనారోగ్యం పెరిగింది. చివరికి 16/05/2022 సోమవారం రోజు ఉదయం ఈలోకాన్ని విడిచారు.

వారు రచించిన కొన్ని రచనలు:
1. షర్హ్ వ తఫ్సీరె జియారతె జామె కబీరహ్.
2. మజాలిహె ఉస్తాదె ఫాతెమీ నియా.
3. సఖాఫతె ఇంతెజార్.
4. ఫర్జామె ఇష్ఖ్.
5. హజారోఁ మె ఎక్ నుక్తా.
6. అర్మగానె గదీర్ (గదీర్ గురించి షియా మరియు అహ్లె సున్నత్ యొక్క మూల గ్రంథాల నుండి నలభై హదీసులు).
7. నగ్మ-ఎ-ఆషిఖీ.   

రిఫరెన్స్
1. ఈమ్నా న్యూస్ ఏజెన్సీ, న్యూస్ కోడ్575388.
2. ఫార్సీ వికీ పీడియా, జిందగీ నామె ఉస్తాద్ ఫాతెమీ నియా.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16