పలావు తిను

ఆది, 05/22/2022 - 17:12

ప్రాముఖ్యత ఇవ్వాల్సింది బట్టలకు కాదు వ్యక్తికి అని చెప్పిన ముల్లా నసీరుద్దీన్...

పులావు తిను

ఒక రోజు ముల్లా నసీరుద్దీన్ తన పాత బట్టలతో ఒక వేడుకలో హజరయ్యారు. అతన్ని కొట్టి ఆ ఇంట్లో నుంచి బయటకు తరిమేశారు. ముల్లా నసీరుద్దీన్ తిరిగి ఇంటికి వెళ్లి; తన మిత్రుడి నుండి కొత్త బట్టలు తీసుకొని అవి వేసుకొని తిరిగి ఆ వేడుకకు వెళ్లారు. ఈ సారి వెళ్ళినప్పుడు వారిని ఆహ్వానించి వేడుకలో ప్రముఖుల కోసం కేటాయించిన చోటు కూర్చోబెట్టారు.
వారి కోసం భోజనం తీసుకొని వచ్చారు. ముల్లా నసీరుద్దీన్ ఏమి తినకుండా తాను వేసుకున్న చొక్కా చేయిని ఆ భోజనం ఉన్న పళ్లానికి దగ్గరగా పెట్టి “కొత్త చొక్కా తినూ, పులావు తిను” అని అన్నారు.
అతడి ప్రక్కలో ఉన్నవాడు ఆశ్చర్యంగా అతన్ని ఇలా ప్రశ్నించాడు: “ఎందుకని ఇలా చేస్తున్నారు?” దానికి సమాధానంగా ముల్లా ఇలా అన్నారు: “ఇంతకు ముందు పాత చొక్కా వేసుకొని వచ్చాను అప్పుడు నన్ను తన్ని తరిమేశారు; అయితే ఈ ఆహార పదార్థాలు నాకోసం కావు నా ఈ కొత్త చొక్కా కోసమనే కదా అర్థం!”

రిఫరెన్స్
1. నస్రె సాదె-ఎ-ఫార్సీ, మహ్మూద్ ఫాజెలీ, తహ్రాన్, 1398, పేజీ96.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 11 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 4