తల్హా ఇబ్నె ఉబైదుల్లాహ్-1

మంగళ, 05/24/2022 - 18:41

దైవప్రవక్త(స.అ) యొక్క సహాబీ అయిన తల్హా ఇబ్నె ఉబైదుల్లాహ్  యొక్క సున్నత్ వ్యతిరేకతను నిదర్శిస్తున్న కొన్ని సంఘటనలు...

తల్హా ఇబ్నె ఉబైదుల్లాహ్-1

ఇతను ప్రముఖ మరియు పెద్ద సహాబీయులలో ఒకరు. హజ్రత్ ఉమర్, ఖలీఫా ఎన్నిక కోసమని ఆరుగురు వ్యక్తుల కమిటీని ఏర్పరిచారు, అందులో ఒక కార్యకర్త కూడాను. ఉమర్ ఇతని గురించే ఇలా అన్నారు: “ఇతను సంతోషంగా ఉన్నప్పుడు మొమిన్, కోపంగా ఉంటే కాఫిర్. ఒకరోజు మనిషి మరో రోజు షైతాన్”. అహ్లెసున్నత్ వల్ జమాఅత్
లు ఇతనిని “అష్రయే ముబష్షిరహ్”లోని ఒకరుగా భావిస్తారు.

మేము ఈ వ్యక్తి గురించి చరిత్రలో చదివినప్పుడు ఇతను ప్రపంచానికి దాసుడు, ప్రపంచాన్ని పొందేందుకు ధర్మాన్ని అమ్మేసి నష్టములో ఉన్నవారి నుండి ఒకరు. అతని ఈ వ్యాపారం అతనికి లాభాన్ని ఇవ్వలేదు. అతను ప్రళయం నాడు పశ్చాత్తాపానికి గురి అవుతారు. అని తెలుస్తుంది. 

“ఒకవేళ దైవప్రవక్త(స.అ) చనిపోతే ఆయిషాను వివాహమడతాను, ఆమె నా పినతండ్రి కుమార్తే” అని దైవప్రవక్త(స.అ)కు కష్టపెట్టిన “తల్హా” ఇతనే. అలా అలా ఈ మాట దైవప్రవక్త(స.అ) వద్దకు చేరింది అప్పుడు దైవప్రవక్త(స.అ) చాలా మనోవ్యథ చేందారు.

మరియు హిజాబ్(పరదా) ఆయత్ అవతరించబడినప్పుడు, దైవప్రవక్త(స.అ) భార్యలు పరదా చేయడం మొదలు పెట్టారు. అప్పుడు తల్హా ఇలా అన్నారు: అంటే ఇక ఇప్పుడు దైవప్రవక్త(స.అ) మన పినతండ్రి కుమార్తెలను మా నుండి పరదా చేయిస్తారా? మా తరువాత మా స్త్రీలను వివాహమాడతారా? ఒకవేళ ఏదైనా జరిగితే(అంటే దైవప్రవక్త(స.అ) గనక మరణిస్తే) మేము అతని(దైవప్రవక్త(స.అ)) తరువాత అతని భార్యలతో వివాహమాడుతాము.[1]

దైవప్రవక్త(స.అ) ఆ మాటతో మనోవ్యథ చెందినప్పుడు ఈ ఆయత్ అవతరించబడింది.

وَمَا كَانَ لَكُمۡ أَن تُؤۡذُواْ رَسُولَ ٱللَّهِ وَلَآ أَن تَنكِحُوٓاْ أَزۡوَٰجَهُۥ مِنۢ بَعۡدِهِۦٓ أَبَدًاۚ إِنَّ ذَٰلِكُمۡ كَانَ عِندَ ٱللَّهِ عَظِيمًا

అనువాదం: దైవప్రవక్తకు మనస్తాపం కలిగించటంగానీ, అతని తదనంతరం అతని భార్యలను వివాహమాడటంగానీ ఎన్నటికీ మీకు ధర్మ సమ్మతం కాదు. అల్లాహ్ దృష్టిలో ఇది మహా పాతకం (అని తెలుసుకోండి)[ అహ్జాబ్ సూరా:33, ఆయత్53]

అబూబక్ర్ మరణానికి ముందు అతను ఉమర్ కోసమని ఖిలాఫత్ పదవిలేఖనాన్ని వ్రాసినప్పుడు అతని వద్దకు వెళ్ళి “మీరు మా పై ఒక కఠోర స్వభావముగల వ్యక్తిని నిర్ధించారు. దానికి మీరు అల్లాహ్
కు ఏమని జవాబు ఇస్తారు?” అని ప్రశ్నించిన “తల్హా” ఇతనే. అప్పడు అబూబక్ర్ అతనిని చాలా చెడుగా దూషించారు.[2]

కాని తరువాత మేము అతని మౌనాన్ని, మరియు కొత్త ఖలీఫాతో రాజీ పడడాన్ని చూస్తాము. అతను వారి మద్దత్తుదారులలో కనిపిస్తారు. ధనాన్ని సేకరించే బాధ్యతను తీసుకున్నారు. ముఖ్యంగా ఉమర్ అతనిని ఆ ఖలీఫా ఎన్నిక కమిటిలో కార్యకర్తగా నియమించినప్పటి నుండి ఇంకా శ్రేయోభిలాషి అయ్యారు. మరియు అతనికి కూడా ఖిలాఫత్ ఆశ మొదలయ్యింది.

అలీ(అ.స)ను స్వల్పముగా భావించి ఉస్మాన్ పక్షపాతులలో చేరిన “తల్హా” ఇతనే. ఎందుకంటే అతనికి తెలుసు ఖిలాఫత్ ఉస్మాన్ కె దక్కుతుంది. ఒకవేళ అలీ(అ.స)కు ఖిలాఫత్ దక్కినా అతని ఆశలు, కోరికలు పూర్తి కాలేవు. అందుకనే హజ్రత్ అలీ(అ.స) వాళ్ళ గురించి ఇలా అన్నారు: “వాళ్ళలో ఒకడు ద్వేషం మరియు స్పర్ధ వల్ల అటు వ్రంగాడు. మరియు రెండవవాడు అల్లుడు కాబట్టి మరియు మిగతవారు కొన్ని చెప్పలేని కారణాల వల్ల అటు వెళ్ళి పోయారు...”

రిఫరెన్స్
1. తఫ్సీరె ఇబ్నె కసీర్, భాగం3, పేజీ513. తఫ్సీరె ఖుర్తుబీ, భాగం14, పేజీ228. తఫ్సీరె ఆలూసీ, భాగం22, పేజీ72. మరియు మరి కొందరు ఈ ఆయత్ క్రమంలో వ్రాశారు; ماکان ان توذوا رسول اللہ ولا تنکحوا ازواجہ بعدہ  (అహ్జాబ్ సూరా, ఆయత్53).
2. అల్ ఇమామతు వస్సియాసత్, ఇబ్నె ఖుతైబహ్, ఫిబాబి వఫాతి అబీబక్ర్ వ ఇస్తిఖ్లాతి ఉమర్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 19