ఖుర్ఆన్ యొక్క ప్రాముఖ్యతలు

బుధ, 05/25/2022 - 18:25

ఒక ఆయత్ మరియు ఒక హదీస్ ద్వార ఖుర్ఆన్ యొక్క ప్రాముఖ్యత గురించి సంక్షిప్త వివరణ...

ఖుర్ఆన్ యొక్క ప్రాముఖ్యతలు

ఖుర్ఆన్; సత్యఅసత్యాలను వేరు చేసేది-గీటురాయి.
ఆయత్: సమస్త లోకవాసులను హెచ్చరించేవానిగా ఉండటానికిగాను తన దాసునిపై గీటురాయి(ఫుర్ఖాన్)ని అవతరింపజేసిన అల్లాహ్ గొప్ప శుభకరుడు.[సూరయె ఫుర్ఖాన్, ఆయత్1][1]
వివరణ: ఖుర్ఆన్ యొక్క పేర్లలో ఒకటి “ఫుర్ఖాన్”. ఫుర్ఖాన్ అనగా గీటురాయి, సత్యఅసత్యాలను వేరు చేసేది అని అర్ధం. ఖుర్ఆన్ సత్యవంతుల ప్రత్యేకతలను వివరించి వారి యొక్క సంకేతాలను సూచించి అందరి పట్ల ఉన్న తన కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంది. ఈ ఆయత్ లో “ఆలమీన్” పదం ద్వార మనకు ఖుర్ఆన్ యొక్క పిలుపు సమస్త లోకవాసులకు మరియు ఈ పవిత్ర గ్రంథం ఒక కాలానికి పరిమితం కానిది అని కూడా సూచిస్తుంది.
హదీస్:
హజ్రత్ ఇమామ్ అలీ(అ.స) ఉల్లేఖనం: దైవప్రవక్త(స.అ) చెబుతుండగా విన్నాను; జిబ్రహీయీల్ నా వద్దకు వచ్చి ఈ వార్తను అందించారు: మీ ఉమ్మత్ పెద్ద ద్రోహానికి గురి అవుతారు. నేను ఇలా అడిగాను: దాని నుండి బయటపడడానికి దారేది? వారిలా అన్నారు: “అల్లాహ్ గ్రంథం”.[2]  

రిఫరెన్స్
1. تَبَارَكَ الَّذِی نَزَّلَ الْفُرْقَانَ عَلَى عَبْدِهِ لِیكُونَ لِلْعَالَمِینَ نَذِیرًا
2. తఫ్సీరె అయాషీ, భాగం1, పేజీ3, హదీస్2.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 11 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10