తల్హా ఇబ్నె ఉబైదుల్లాహ్-3

గురు, 05/26/2022 - 15:53

చరిత్రకారులనుసారం అలీ(అ.స), తల్హాను కూఫా
కు గవర్నర్
గా నియమించేదుకు నిరాకరించారు. అందుకని అతడు వారి బైఅత్
ను ఉల్లంఘించాడు...

తల్హా ఇబ్నె ఉబైదుల్లాహ్-3

ఉస్మాన్ తరువాత “తల్హా”ను అందరి కన్న ముందు అలీ(అ.స)తో బైఅత్ చేస్తుండగా చూశాము. ఆ తరువాత బైఅత్
ను ఉల్లంఘించి మక్కాలో ఉంటున్న తన పినతండ్రి కుమార్తె ఆయిషాతో వెళ్ళి కలిసిపోయారు. మరియు అనుకోకుండా ఉస్మాన్ రక్తముల్యాన్ని కోరుతారు, సుబ్హానల్లాహ్!,ఇంతకు మించి ఎదైనా అపవాదం ఉందా?!
చరిత్రకారులలో కొందరు వాటి కారణాలు ఈ విధంగా చెప్పారు: అలీ(అ.స), అతనిని కూఫా
కు గవర్నర్
గా నియమించేదుకు నిరాకరించారు. అందుకని అతని బైఅత్
ను ఉల్లంఘించారు, మరి నిన్న ఏ ఇమామ్
తో అయితే బైఅత్ చేశారో అతనితో యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు.
ఇదీ, తల నుండి కాళ్ళ వరకు ప్రాపంచక వ్యామోహంలో మునిగిపోయి పరలోకాన్ని అమ్మేసినటువంటి వ్యక్తి పరిస్థితి. మరి ఇలాంటి వాడు పదవీ, హోదాల కోసం అన్ని విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు. “తాహా హుసైన్” ఇలా అన్నారు: “తల్హా యొక్క యుద్ధానికి ఒక ప్రత్యకత ఉంది. అతని కోరిక మెరకు అతనికి ధనం మరియు పదవి దొరికినంతకాలం సంతోషంగా ఉన్నారు ఎప్పుడైతే ఆశ ఎక్కువయ్యిందో అప్పుడు యుద్ధానికి సిద్ధమయ్యారు. చివరికి అతను కూడా చనిపోయారు మరియు ఇతరుల చావుకు కారణమయ్యారు”.[1]
నిన్న అలీ(అ.స)తో బైఅత్ చేసి కొన్ని రోజుల తరువాత ఆ బైఅత్
ను ఉల్లంఘించి దైవప్రవక్త(స.అ) భార్యను బస్రా పట్టణాని తీసుకొని వెళ్ళిన “తల్హా” ఇతనే. దాని వల్ల మంచివాళ్ళ చావు, సంపత్తులు నాశనం మరియు ప్రజల హృదయాలలో భయం పుట్టుకొచ్చింది. చివరికి అలీ(అ.స) అనుచరులలో విరుద్ధం ఏర్పడింది. మరియు సిగ్గులేకుండా తామే స్వయంగా బైఅత్ చేసి అతని అనుచరణ హారాన్ని తమ మెడలో వేసుకున్న తమ కాలపు ఇమామ్
తోనే యుద్ధం చేశారు.
యుద్ధం మొదలవ్వక ముందే ఇమామ్ అలీ(అ.స) అతని వద్దకు ఒకతనిని పంపించారు అతనితో యుద్ధరంగంలో కలిశారు. అప్పుడు ఇమామ్ ఇలా ప్రశ్నించారు: “నీవు నాతో బైఅత్ చేయలేదా? తల్హా! ఏ విషయం నిన్ను ఇలా తిరుగుబాటు పై బలవంతం చేసింది?”
తల్హా: ఉస్మాన్ చావు ప్రతీకారం.
అలీ(అ.స): మనలో ఎవరైతే ఉస్మాన్ చావుకి కారణమయ్యారో అల్లాహ్ వారికి చావు ప్రసాదించుగాక!.
“ఇబ్నె అసాకిర్” రివాయత్ ప్రకారం అలీ(అ.స) అతనితో ఇలా అన్నారు: “తల్హా! నేను నీకు అల్లాహ్
ను సాక్షిని చేసి అడుగుతున్నాను నీవు దైవప్రవక్త(స.అ) ఇలా ప్రవచిస్తుండగా వినలేదా?: “من کنت مولاہ فعلی مولاہ، اللھم وال من والاہ و عاد من عاداہ అనువాదం: నేను ఏవరికి స్వామినో అలీ(అ.స) కూడా వారికి స్వామి, అల్లాహ్ అతని మిత్రుడిన ఇష్టపడు మరియు అతని శత్రువుని ద్వేషించు”.
తల్హా: అవును.
ఇమామ్ అలీ(అ.స): అయితే నీవు నాతో ఎందుకు యుద్ధం చేస్తున్నావు? తల్హా దానికి బదులు “ఉస్మాన్ చావు ప్రతీకారం” అని ఇచ్చారు. అందుకు ఇమామ్ అలీ(అ.స) “అల్లాహ్ మనలో ముందు ఉస్మాన్
ను చంపిన వాడిని చంపాలి” అని చెప్పి అతని మాటను నిరాకరించారు. అల్లాహ్, అలీ(అ.స) దుఆను అంగీకరించాడు. మరియు తల్హా అదే రోజు చనిపోయారు. తల్హాతో పాటు అలీ(అ.స)తో యుద్ధం చేయడానికి వచ్చిన “మర్వాన్ ఇబ్నె హకమ్” తల్హాను చంపాడు.
“తల్హా” అపరాధాలను మరియు అపవాదములను రెచ్చగొట్టేవారు. యదార్థాలను తారుమారు చేసేవారు అందులో ఏమాత్రం విచారించే వారు కాదు. మాటపై నిలబడేవారు కాదు. సత్యాన్ని ఏమాత్రం ఒప్పుకునేవారు కాదు. అలీ(అ.స) అతనికి (దైవప్రవక్త(స.అ) హదీస్
ను) గుర్తుచేశారు మరియు సాక్ష్యాన్ని ప్రదర్శించారు. కాని అతను తన మొండితనం పైనే ఉన్నారు. అందుకని అతను తన మార్గభ్రష్టత పై ఉండిపోయారు. మార్గభ్రష్టులయ్యారు ఇతరులను మార్గభ్రష్టతకు గురి చేశారు. తన అపరాధం వల్ల ఉస్మాన్ చావుకు ఎటువంటి సంబంధంలేనటువంటి మంచి వారు, వారికి అతని వయసు కూడా తెలియదు మరియు వారు బస్రా పట్టణం నుండి బయటికి వెళ్ళనటువంటి వారు తమ ప్రాణాలు కోల్పోయారు.
“ఇబ్నె అబిల్ హదీద్” ఉల్లేఖనం: “తల్హా” బస్రా పట్టణానికి చేరినప్పుడు “అబ్దుల్లాహ్ ఇబ్నె అల్ హకీమె తమీమి” అతను(తల్హా) ఇతనికి వ్రాసినటువంటి ఉత్తరములు తీసుకొని వచ్చి తల్హాతో ఇలా అన్నారు: ఓ అబూ మొహమ్మద్! ఇవి మీ ఉత్తరములేనా? అతను అవును అని అన్నారు.
“అబ్దుల్లాహ్” ఇలా అన్నారు: నిన్నటి వరకు నీవు ఉస్మాన్
ను ఖిలాఫత్ పదవి నుండి తొలగించు మరియు అతనిని చంపు అని వ్రాశావు. చివరికి అతనిని చంపేశావు ఇక ఇప్పుడు అతని చావు ప్రతీకారం కావాలి అని అంటున్నావు, నీ ఈ పద్ధతేమిటి? నీవు కేవలం ప్రపంచ దాసుడవుగా కనిపిస్తున్నావు. ఒకవేళ నీ అభిప్రాయం ఇదే అయి ఉంటే మరి అలీ(అ.స)తో ఎందుకు బైఅత్ చేశావు, మరి ఇప్పుడు ఎందుకు దానిని ఉల్లంఘించావు? ఇక ఇప్పుడు నీ అపరాధంలో మమ్మల్ని ఇరికించడానికి వచ్చావు.[2]
అవును! అహ్లెసున్నత్ వల్ జమాఅత్ యొక్క “సునన్” మరియు “చరిత్ర గ్రంథాల” ప్రస్తావన ప్రకారం ఇదే “తల్హా ఇబ్నె ఉబైదుల్లాహ్” యొక్క స్పష్టమైన యదార్థం. కాని ఇదంతా ఇలా ఉన్నప్పటికీ “తల్హా”ను స్వర్గ శుభవార్త ఇవ్వబడ్డ ఆ పది మందిలో ఒకరుగా భావిస్తారు.
వారు స్వర్గాన్ని కోటీశ్వరులు, పెద్ద పెద్ద దళారీలు, కంట్రాక్టుదారులతో నిండే, మరియు హతమార్చిన హతమార్చబడిన వారు, అన్యాయం చేసిన చేయబడిన వారు మరియు విశ్వాసులు, అపరాధులు, మంచివారు, చేడ్డవారు ఒకరినోకరు కలిసేటువంటి “హిల్టెన్ హోటెల్” అనుకుంటున్నారు.
أَيَطۡمَعُ كُلُّ ٱمۡرِيٕٖ مِّنۡهُمۡ أَن يُدۡخَلَ جَنَّةَ نَعِيمٖ
అనువాదం: ఏమిటి, వారిలోని ప్రతి ఒక్కడూ సుఖ సౌఖ్యాలతో నిండిన స్వర్గంలో తాను కూడా ప్రవేశింపజేయబడాని ఆశపడ్తున్నాడా?[మఆరిజ్ సూరా:70, ఆయత్:38.] 

أَمۡ نَجۡعَلُ ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ كَٱلۡمُفۡسِدِينَ فِي ٱلۡأَرۡضِ أَمۡ نَجۡعَلُ ٱلۡمُتَّقِينَ كَٱلۡفُجَّارِ
అనువాదం: ఏమిటి? మేము విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారిని భూమిలో(నిత్యం) కల్లోలం రేకెత్తించే వారితో సమానులుగా చేసేస్తామా? లేక భయభక్తులు గలవారిని పాపాత్ములతో సమానంగా చేస్తామా?.[సాద్ సూరా:38, ఆయత్:28.]

أَفَمَن كَانَ مُؤۡمِنٗا كَمَن كَانَ فَاسِقٗاۚ لَّا يَسۡتَوُۥنَ
అనువాదం: ఏమిటి, విశ్వసించిన వ్యక్తిని అవిధేయునితో సరిపోల్చటం తగునా? వారిద్దరు ఎన్నటికీ సమానులు కాగలరు.[సజ్దహ్ సూరా:32, ఆయత్:18.]

أَمَّا ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ فَلَهُمۡ جَنَّٰتُ ٱلۡمَأۡوَىٰ نُزُلَۢا بِمَا كَانُواْ يَعۡمَلُونَ  وَأَمَّا ٱلَّذِينَ فَسَقُواْ فَمَأۡوَىٰهُمُ ٱلنَّارُۖ كُلَّمَآ أَرَادُوٓاْ أَن يَخۡرُجُواْ مِنۡهَآ أُعِيدُواْ فِيهَا وَقِيلَ لَهُمۡ ذُوقُواْ عَذَابَ ٱلنَّارِ ٱلَّذِي كُنتُم بِهِۦ تُكَذِّبُونَ
అనువాదం: ఎవరు విశ్వసించి, సత్కార్యాలు కూడా చేశారో వారు చేసుకున్న కర్మలకు బదులుగా వారికి శాశ్వతమైన స్వర్గనివాసం ఆతిథ్యంగా లభిస్తుంది. విద్రోహవైఖరిని అవలంబించిన వారి నివాసం నరకం. వారు దాని నుండి బయటపజదలచినపుడల్లా అందులోనే నెట్టబడతారు. వారితో, “మీరు తిరస్కరిస్తూ ఉండే అగ్ని బాధను ఇపుడు రుచిచూడండి” అని అనబడు తుంది.[సాద్ సూరా:38, ఆయత్:19-20]

రిఫరెన్స్
1. అల్ ఫిత్నతుల్ కుబ్రా, తాహా హుసైన్, భాగం1, పేజీ150.
2. షర్హె ఇబ్నె అబిల్ హదీద్, భాగం2, పేజీ500.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
14 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13