సలవాత్

ఆది, 05/29/2022 - 18:38

సలవాత్ యొక్క ప్రాముఖ్యత మరియు దాని ప్రభావం గురించి సంక్షిప్తంగా...

సలవాత్

నాలుగు చోట్లలో సలవాత్ చదవడం వాజిబ్ గా నిర్ధరించబడి ఉంది:
1. రోజువారి వాజిబ్ నమాజుల మొదటి మరియు రెండవ తషహ్హుద్ లో
2. నమాజె ఆయాత్ తషహ్హుద్ లో
3. నమాజె తవాఫ్ తషహ్హుద్ లో
4. నమాజె మయ్యత్ యొక్క రెండవ తక్బీర్ తరువాత
పై చెప్పబడిన నాలుగు చోట్ల తప్ప మిగత సందర్భాలలో దైవప్రవక్త(స.అ) పేరు వచ్చినప్పుడు సలవాత్ చదవడాన్ని తాకీదు చేయబడినది; చివరికి నమాజ్ చదువుతుండగా దైవప్రవక్త(స.అ) పేరు వినబడితే చదువుతున్న ఖిరాఅత్ లేదా జిక్ర్ ను ఆపి సలవాత్ చదివి మరలా ఆపిన ఖిరాఅత్ లేదా జిక్ర్ ను పూర్తి చేయాలి.

సలవాత్ యొక్క లాభాలు
ఒక్క సలవాత్ చదివి క్రింద చెప్పబడే ఆరాధనలను చేస్తున్నాము:
1. అల్లాహుమ్మ అని చెప్పి అల్లాహ్ యొక్క తౌహీద్ అంగీకారాన్ని వ్యక్తం చేస్తున్నాము.
2. ముహమ్మద్ అని చెప్పి వారి దౌత్యాన్ని అంగీకరిస్తున్నామని వ్యక్తం చేస్తున్నాము.
3. ఆలె ముహమ్మద్ అని చెప్పి దైవప్రవక్త(స.అ) సంతానం యొక్క ఇమామత్ అంగీకారాన్ని వ్యక్తం చేస్తున్నాము.
4. దైవప్రవక్త(స.అ) పై దురూద్ పంపమని అల్లాహ్ ను కోరుకుంటున్నాము, అనగా పరలోకంలో వారి స్థానాన్ని పెంచమని కోరుతున్నాము; అంటే పరలోకం మరియు ప్రళయదినం పై నమ్మకం ఉంది అని వ్యక్తం చేస్తున్నాము.
5. సలవాత్ అనగా దుఆ, దుఆ చేయడం కూడా ఒక రకంగా ఆరాధన అవుతుంది. దైవప్రవక్త(స.అ) ఇలా ప్రవచించారు.. దుఆ అనేది ఆరాధన యొక్క మెదడు.[1]
6. సలవాత్ చదివి మేము ఇలా ప్రకటిస్తాము; మేము దైవప్రవక్త(స.అ) విషయంలో అతికి గురి కాము; మేము వారిని అల్లాహ్ తరపు నుంచి పంపబడిన ప్రవక్తగా భావిస్తాము అంతే గాని క్రైస్తవులు హజ్రత్ ఈసా(అ.స) విషయంలో అతికి గురి అయ్యి వారిని తమ ప్రభువు లేదా ప్రభువు కుమారుడు అని నమ్మే విధంగా వారిని అల్లాహ్ యొక్క కుమారు అని నమ్మము అని వ్యక్తం చేస్తున్నాము.
7. సలవాత్ చదివి దైవప్రవక్త(స.అ) మన పై చేసిన ఉపకారాలకు ప్రతిగా వారి కోసం దుఆ చేసి వారి స్థానాన్ని పెంచమని కోరుతున్నాము.
8. సలవాత్ ద్వార కృతజ్ఞత తెలుపుతున్నాము., ఎందుకంటే దైవప్రవక్త(స.అ) యొక్క ఉనికి మరియు వారి అవతరణ మాకోసం అల్లాహ్ తరపు నుండి గొప్ప అనుగ్రహం. వారి మరియు వారి సంతానం పై సలవాత్ పంపడం మనం కృతజ్ఞత తెలుపుతున్నాము అన్న విషయానికి నిదర్శనం.
9. సలవాత్ చదవడం ద్వార మేము మన కోసం కూడా దుఆ చేసుకుంటున్నట్లే, ఎందుకంటే దైవప్రవక్త(స.అ) మరియు వారి సంతానం కోసం దుఆ చేయడం మన మగ్ఫిరత్ కు కారణం కూడా అవుతుంది.
10. సలవాత్ చదవడం దైవప్రవక్త(స.అ) మరియు వారి సంతానం యొక్క సంతోషానికి కారణం మరియు విశ్వాసిని సంతోషపరచడం కూడా ఆరాథనతో సమానం.
పై చెప్పబడిన సలవాత్ యొక్క పది లాభాలు ఉలమాలు వివరిస్తూ ఉంటారు[2].

సలవాత్ చదవడం వల్ల ఉనికిలో ఉన్న చీకటిని తుంచి వెలుగును నింపుతుంది. అలాగే దైవప్రవక్త(స.అ) మరియు వారి సంతానం పై సలవాత్ చదవడం వల్ల నాలుగు ప్రభావాలు చూడవచ్చు:
1. సృష్టిలో పవిత్రత 2. ఆత్మ పవిత్రత మరియు అశుభ్రత నుండి దూరం 3. అల్ప లక్షణాల నుండి విముక్తి మరియు పాపముల నుండి దూరం 4. మనిషి లోతు నుండి పాపముల ప్రభావాన్ని అంతం చేయడం.[3]

ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఇలా ప్రవచించారు: దైవప్రవక్త(స.అ) పై సలవాత్ పంపినవాడిపై అల్లాహ్ వేయ్యి సలవాత్ లు వేయ్యి వరసల దైవదూతల ద్వార పంపుతాడు.
దైవప్రవక్త(స.అ) పేరు వచ్చినప్పుడు, వారి పై అతిగా సలవాత్ పంపండి.

నమాజ్ చదివిన తరువాత సలవాత్ చదవడం ఒక మంచి సున్నత్ గా మన మధ్య ఉంది. అహ్జాబ్ సూరహ్ యొక్క 56వ ఆయత్ చదువుతారు “ఇన్నల్లాహ వ మలాయికతహు యుసల్లూన అలన్నబీ యా అయ్యుహల్లజీన ఆమనూ సల్లూ అలైహి వ సల్లిమూ తస్లీమా”[4]

రిఫరెన్స్
1. బిహారుల్ అన్వార్, భాగం93, పేజీ341., మీజానుల్ హిక్మహ్, భాగం3, హదీస్5519.
2. సిర్రుస్సఆదహ్, మర్హూమ్ సయ్యద్ అహ్మద్ రూహీనీ(ర.అ).
3. طِیباً لِخَلْقِنا، طَهارَةً لِاَنْفُسِنا، تَزکیةً لَنا، کَفّارَةً لِذُنُوبِنا
4. إِنَّ اللهَ وَ مَلائِكَتَهُ یصَلُّونَ عَلَى النَّبِی یا أَیهَا الَّذِینَ آمَنُوا صَلُّوا عَلَیهِ وَ سَلِّمُوا تَسْلِیماً

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15