జుబైర్ ఇబ్నె అల్ అవామ్-1

సోమ, 05/30/2022 - 17:59

తల్హా యొక్క ఆత్మీయుడు, స్నేహితుడు మరియు సోదరుడు అయిన జుబైర్ ఇబ్నె అల్ అవామ్ గురించి సంక్షిప్త వివరణ...

జుబైర్ ఇబ్నె అల్ అవామ్-1

ఇతను కూడా పెద్ద సహాబీ. ముహాజిరీనులలో మొదటి వారు. దైవప్రవక్త(స.అ) కు చాలా దగ్గర బంధుత్వం గల వారు. ఇతను “సఫియా బింతె అబ్దుల్ ముతల్లిబ్” అనగా దైవప్రవక్త(స.అ) అత్త కుమారుడు.
మరియు “అస్మా బింతె అబీబక్ర్” అనగా ఆయిషా తోబుట్టువుతో వివాహం చేసుకున్నారు. మరియు ఖలీఫా ఎన్నిక కొరకు “ఉమర్ ఇబ్నె ఖత్తాబ్” ఏర్పర్చిన ఆరుగురి సలహా మండలిలో ఒక కార్యదర్శి కూడానూ.[1] అహ్లెసున్నత్ వాళ్ళ దృష్టిలో ఇతను కూడా స్వర్గ శుభవార్త ఇవ్వబడ్డ ఆ పదిమందిలో ఒకరు.
ఒకవేళ ఇతను అన్ని చోట్లలో “తల్హా”తో పాటు కనిపిస్తే ఆశ్చర్యపడనవసరం లేదు. తల్హా గురించి చెప్పినప్పుడల్లా “జుబైర్” ప్రస్తావన కూడా అతనితో తప్పకుండా వస్తుంది. మరి అలాగే “జుబైర్” గురించి చెప్పినప్పుడల్లా “తల్హా” ప్రస్తావన కూడా తప్పకుండా అతనితో పాటు వస్తుంది.
ఇతను కూడా ఈలోకాన్ని పొందేందుకు వ్యతిరేకానికి దిగి దాని ద్వార కడుపు నింపు కున్న వాళ్ళలో ఒకరు. “తబరీ” రివాయత్ ప్రకారంగా “జుబైర్ ఇబ్నె అల్ అవామ్” విడిచిన ఆస్తి యాభై వేల దీనారులు, వెయ్యి గుర్రాలు మరియు వెయ్యి బానిసలు. మరియు బస్రా, కూఫా, మరియు ఈజిప్టులలో చాలా ఆస్థి.
ఈ క్రమంలోనే “తాహా హుసైన్” ఇలా అన్నారు: జుబైర్ వారసులలో పంచబడ్డ అతని ఆస్తి గురించి పలు రకాలుగా చెబుతారు. తక్కువ ఆస్తి అని చెప్పే వారు వారసులలో పంచబడ్డ ఆస్తి 35 మిలియన్లు, అని అంటారు. ఎక్కువ అని నమ్మేవారు వారసుల మధ్య 52 మిలియన్లు పంచబడ్డాయి, అని అంటారు. నియంత్రణ గల వారు 40 మిలియన్లు పంచబడ్డాయి అని అంటారు.

ఇందులో ఆశ్చర్యపడనవసరం లేదు ఎందుకంటే “ఫస్తాత్”
లో, “ఇస్కందరియా”లో, “బస్రా”లో మరియు “కూఫా”లో కూడా “జుబైర్”కు భూములు ఉండేవి. మరియు కేవలం మదీనాలో అతనికి 12 ఇళ్ళు ఉండేవి. ఇవే కాకుండా మరెన్నీంటినో విడిచి వెళ్ళారు.[2]
కాని “బుఖారీ” యొక్క రివాయత్ ఇలా ఉంది: “జుబైర్ రెండు లక్షల యాభై మిలియన్లు విడిచారు”.[3]
దీని ద్వార సహాబీయుల పరీక్షణ ఉద్దేశం ఏమాత్రం కాదు, వాళ్ళు మిక్కిలి కష్టంలో ఆ ఆస్తిని మరియు సొమ్ముని కూడబెట్టుకున్నారు, అది వాళ్ళది పూర్తి ఆస్తి న్యాయసమ్మతమైనది. కాని మాకు ఈ ఇద్దరు తల్హా మరియు జుబైర్ ఈలోకం పై అత్యాశ గలవారిలా కనిపిస్తున్నారు. అలీ(అ.స), ఉస్మాన్ ముస్లిముల “బైతుల్ మాల్” నుండి (తమకు నచ్చిన వాళ్ళకు) ఇచ్చేసినటువంటి సొమ్మును తిరిగి తీసుకోవాలని నిర్ణయించుకున్నారని, వీళ్ళిద్దరూ అమీరుల్ మొమినీన్ అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స) యొక్క బైఅత్
ను ఉల్లంఘించారు, అని మాకు తెలుసు. ఇలాంటి సమయంలో వీళ్ళిద్దరి బైఅత్ ఉల్లంఘన మనకు ఇంకా సందేహంలో పడేస్తుంది.

హజ్రత్ అలీ(అ.స) ఖిలాఫత్ పదవిపై కూర్చున్నప్పుడు అతను ప్రజలను దైవప్రవక్త(స.అ) సున్నత్ తరపు మరలించడంలో ఏమాత్రం ఆలశ్యం చేయలేదు. అన్నింటి కన్నా ముందు “బైతుల్ మాల్”ను పంచారు. మరియు ప్రతీ ముస్లిముకు మూడేసి దీనారులు ఇచ్చారు, అతడు అరేబీయుడు కానివ్వడి లేదా పరదేశస్తుడు కానివ్వండి. ఇది  దైవప్రవక్త(స.అ) తన పూర్తి జీవితంలో చేసినటు వంటి పని, అతను జీవితాంతం ఇలా పంచుతూనే ఉన్నారు. అలాగే అలీ(అ.స), ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ యొక్క “అరేబీయులు, పరదేశీయుల పై ప్రతిష్టగల వారు, అరేబీయలకు పరదేశీల కన్న రెండింతలు ఎక్కవ ఇవ్వాలి” అన్నటువంటి బిద్అత్
లను కూడా అంతం చేశారు.
అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స), దైవప్రవక్త(స.అ) సున్నత్ వైపుకు ప్రజలను తీసుకొని రావాలి అని ప్రయత్నిస్తూనే ఉన్నారు. చివరికి ఉమర్ బిద్అత్
లను ఇష్టపడే సహాబీయులు అతనికి విరుద్ధులయ్యారు.
ఇదే ఉమర్ పై ఖురైషీయులకు ఉన్న ప్రేమ మరియు నమ్మకం యొక్క అసలు రహస్యం, దాని పట్ల మేము అశ్రద్ధగా ఉన్నాము. ఉమర్, ముస్లిములపై ఖురైషీయులను ప్రతిష్టతను ప్రసాదించి వారిలో జాతి, సమూహ మరియు తరగతి పరమైన అహంకారానికి ప్రాణం పోశారు.
కనుక 25 సంవత్సరాల తరువాత ఖురైషీలను దైవప్రవక్త(స.అ) కాలంలో సమానంగా బైతుల్ మాల్ పంచబడేటువంటి ఆ స్థానానికి తిరిగి ఎలా తీసుకోని రాగలరు. అప్పుడు “బిలాల్
”కు దైవప్రవక్త(స.అ) పినతండ్రి అబ్బాసులిద్దరికీ సమానంగా భాగం లభించేది. మరియు ఖురైషీయులు ఆ సమానత్వం పై దైవప్రవక్త(స.అ) పై అభ్యంతరం వ్యక్తం చేసేవారు. దీనిని మేము సీరత్ పుస్తకాలలో చూస్తూ ఉంటాము, వారు ఎల్లప్పుడు దైవప్రవక్త(స.అ)తో పంపకం విషయంలో జగడం చేసేవారని.

రిఫరెన్స్
1. నిస్సందేహముగా ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ ఈ ఆలోచన యొక్క ఆవిష్కర్త. ఈ ఆవిష్కరణ చాలా తెలివిగా చేసినది, అలీ(అ.స)కు వ్యతిరేకులు మరియు పగవాళ్ళను సృష్టించాలి అని చేసిన పని ఎందుకంటే సహాబీయులందరికీ బాగా తెలుసు ఖిలాఫత్ పదవి అలీ(అ.స) యొక్క హక్కు, దానిని ఖురైషీయులు అన్యాయంగా తీసుకున్నారు అని. మరి ఫాతెమా(అ.స) అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు వారు “మీ భర్త ముందుగా మా వద్దకు వచ్చి ఉంటే మేము అతని ఎవ్వరి పై ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళం కాదు” అని అన్నారు. ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ ఖిలాఫత్ “షరా” పరంగా హక్కుదారుడి వద్దకు చేరాలి, అన్న విషయం ఇష్టం ఉండేది కాదు. అందుకని అతను పోటీ కోసం ఒక కమిటీ ఏర్పర్చారు, దాంతో ప్రతీ ఒక్కరి మనసులో ఖిలాఫత్ పదవి ఆశ పుట్టుకొచ్చింది, వాళ్ళ మనసులో నాయకుడు అవ్వలనే ఆశలు మేలుకున్నాయి, అలా వాళ్ళు తమ ధర్మాన్ని ఈలోకానికి బదులు అమ్ముకున్నారు. మరి ఈ వ్యాపారం వాళ్ళకు ఎటువంటి లాభాన్ని తెచ్చిపెట్టలేదు.
2. అల్ ఫిత్నతుల్ కుబ్రా, భాగం1, పేజీ147.
3. సహీబుఖారీ, భాగం4, పేజీ53, باب فرض الخمس باب برکه الغازی فی ماله حیّاً و میتاً

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
18 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15