తల్హా యొక్క ఆత్మీయుడు, స్నేహితుడు మరియు సోదరుడు అయిన జుబైర్ ఇబ్నె అల్ అవామ్ గురించి సంక్షిప్త వివరణ...
“తల్హా” మరియు “జుబైర్”లు అమీరుల్ మొమినీల్ అలీ(అ.స)కు వ్యతిరేకంగా ద్వజాన్ని ఎత్తడానికి గల కారణాలు; అలీ(అ.స) సమానత్వాన్ని తీసుకొచ్చి అందరిని సమానంగా పంచడం, మరియు వారు కోరిన అధికారాన్ని ఇవ్వకపోవడం. అంతేకాకుండా బీదవారిలో పంచబెట్టడానికై వారి నుండి వారు సంగ్రహించుకున్న ఆ సొమ్మును తీసుకున్నారు.
“జుబైర్”
కు, అలీ(అ.స) ఇక నాకు “బస్రా” గవర్నర్
గా నియమించరు, మరియు అలాగే ఇతరుల పై నన్ను ప్రాధాన్యత ఇవ్వరు, అని నమ్మకం కలిగినప్పుడూ, అంతేకాదు అతను తేరగా పోగు చేసుకున్న సొమ్ము గురించి విచారణ కూడా జరుగుతుందని తెలిసినప్పుడు, అతను తన మిత్రుడు “తల్హా”తో కలిసి హజ్రత్ అలీ(అ.స) వద్దకు వచ్చి “ఉమ్రా” చేసేందుకు (మక్కా) వెళ్ళడానికి అనుమతి కోరారు. అలీ(అ.స) కూడా వారి ఉద్దేశాన్ని గ్రహించి ఇలా అన్నారు: “అల్లాహ్ సాక్షిగా మీలో ఉమ్రా ఉద్దేశం లేదు, యుద్ధ ఉద్దేశం ఉంది”
అబూబక్ర్ కుమార్తె “ఆయిషా”తో కలిసిన రెండవ వ్యక్తి, జుబైర్. అలా ఎందుకు కాకూడదు, ఆమె “జుబైర్” భార్య యొక్క చెల్లెలు. అలా తల్హా మరియు జుబైర్ ఆమెను “బస్రా” తీసుకుని వచ్చారు. ఆయిషా పై “హౌఅబ్ చెలమ” కుక్కలు అరిచినప్పుడు ఆమె తిరిగి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నప్పుడు ఆయిషాను అల్లాహ్ మరియు తన భర్త ఆదేశాన్ని అమలు పరచకుండా వారితో పాటు “బస్రా”కు రావాలని వారు 50 మంది ద్వార తప్పుడు సాక్ష్యాన్ని చెప్పించారు. ఎందుకంటే ప్రజల పై ఆయిషా ప్రభావం మనకన్న ఎక్కువగా ఉంది అని వారికి బాగా తెలుసు. అంతేకాకుండా 25 సంవత్సరాలు కష్టపడి ప్రజలలో దైవప్రవక్త(స.అ)కు “అతిఇష్టమైన భార్య ఆయిషా” అని మరియు “అబూబక్ర్ సిద్దీఖ్ యొక్క కుమార్తె హుమైరా వద్దే సగం దీన్ ఉంది” అని నమ్మకం కలిగించారు. “జుబైర్”” కథలో వింత విషయమేమిటంటే ఇతను కూడా ఉస్మాన్ చావుకు ప్రతీకారం కోసం బయలుదేరారు. నిజానికి మంచి సహాబీయులు ఇతనే ఉస్మాన్ చావుకు కారణంగా నిర్ధారించారు.
అందుకే యుద్ధం సమయంలో అతను హజ్రత్ అలీ(అ.స)తో కలిసినప్పుడు అలీ(అ.స) అన్నారు: నీవు నాతో ఉస్మాన్ చావుకు ప్రతీకారం తీర్చుకుంటావా!. వాస్తవానికి నువ్వే స్వయంగా అతనిని చంపావు.[1]
“మస్ఊది” ఇలా లిఖించారు: అతను(అలీ(అ.స)) జుబైర్
తో ఇలా అన్నారు: “ఓ జుబైర్! అల్లాహ్ నిన్ను నాశనం చేయుగాక!, ఏ విషయం నిన్ను ఇలా యుద్ధం పై బలవంతం చేసింది?” జుబైర్ ఇలా అన్నారు: “ఉస్మాన్ చావుకు ప్రతీకారం”. అలీ(అ.స) ఇలా అన్నారు: “అల్లాహ్ మనలో ముందుగా ఎవరైతే ఉస్మాన్
ను చంపారో అతనిని చంపుగాక!”.
“హాకిమ్” తన “ముస్తద్రక్”
లో ఇలా వ్రాశారు: “తల్హా” మరియు “జుబైర్”లు “బస్రా” చేరినప్పుడు, అక్కడి ప్రజలు వారితో “మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు?” అని అడిగారు. వారు ఇలా అన్నారు: “మేము ఉస్మాన్ చావుకు ప్రతీకారం కోసం వచ్చాము”. హుసైన్ వారితో ఇలా అన్నారు: “సుబ్హానల్లాహ్, జనానికి బుద్ధిలేదా! వారేమే మీరే అతనిని చంపారు అని అంటున్నారు”.
నిస్సందేహముగా “జుబైర్” కుడా తన మిత్రుడు “తల్హా” వలే ఉస్మాన్
ను మోసం చేశారు. మరియు ప్రజలను అతనిని చంపమని పురికొల్పారు. ఆ తరువాత హజ్రత్ అలీ(అ.స)తో ఇష్టానుసారంగా బైఅత్ చేశారు. మరియు ఆ తరువాత దానిని ఉల్లంఘించారు. ఆ తరువాత ఉస్మాన్ చావుకు ప్రతీకారం కోసం “బస్రా” చేరుకున్నారు.
“బస్రా” చేరిన తరువాత స్వయంగా ఆ అపరాధములలో పాలుగొన్నారు. మరియు 70 కన్న ఎక్కువ “బైతుల్ మాల్” భటులను చంపారు. బైతుల్ మాల్
ను నాశనం చేశారు. చరిత్రకారుల ప్రవచనం ప్రకారం; వారు “బస్రా” యొక్క గవర్నర్ అయిన “ఉస్మాన్ ఇబ్నె హనీఫ్”
కు ఒక ఫేక్ ఉత్తరాన్ని వ్రాశారు, మరియు మేము అలీ(అ.స) బస్రాకు వచ్చేంత వరకు అన్ని విధాలుగా కాపాడతాము, అని మాటిచ్చారు. తరువాత ఆ మాటను అమలు పరచలేదు. “ఉస్మాన్ ఇబ్నె హనీఫ్”
ను ఇషాఁ నమాజ్ చదువుతుండగా దాడి చేశారు, ఆ తరువాత అతడి మిత్రులలో కొందరిని చంపారు, మరి కొందరిని బందీలుగా చేసుకున్నారు. “ఉస్మాన్ ఇబ్నె హనీఫ్”ను కూడా చంపేయాలని అనుకున్నారు. కాని మదీనా గవర్నర్ అయిన అతని సొదరుడు “సుహైల్ ఇబ్నె హనీఫ్”తో భయపడ్డారు. ఒకవేళ అతడికి తెలిస్తే అతడు మా కుటుంబీకులతో ప్రతీకారం తీర్చుకుంటారు, అని ఆలోచించి అతడిని చాలా హింశించి, అతడి మీసాలు మరియు గెడ్డాన్ని పికేశారు. “బైతుల్ మాల్”పై దాడి చేసి నలభైం భటులను నరికి చంపారు.
“తాహా హుసైన్”, “తల్హా” మరియు “జుబైర్”
ల అన్యాయం మరియు వారి పన్నాగాల గురించి ఇలా లిఖించారు: వారు బైఅత్ ఉల్లంఘనతో ఆగకుండా “ఉస్మాన్ ఇబ్నె హనీఫ్”
తో సంధి చేసుకున్న ఆ ఒప్పందాన్ని కూడా వ్యతిరేకించారు. మరియు చాలా మందిని చంపారు, మరియు బస్రా వాసులలో “ఉస్మాన్ ఇబ్నె హనీఫ్”కు వ్రాయబడ్డ ఆ ఫేక్ పత్రాన్ని వ్యతిరేకించిన మరియు బైతుల్ మాల్
ను దోచుకోకుండా ఆపినవారిని చంపేశారు.[2]
అంతేకాకుండా అలీ(అ.స) బస్రా చేరినప్పుడు ఆ (అవిధేయుల)తో యుద్ధం చేయకుండా వారిని అల్లాహ్ గ్రంథం వైపుకు రండి, అని ఆహ్వానించారు. వారు నిరాకరించారు. ఖురాన్ వైపుకు ఆహ్మానిస్తున్న వారిని చంపడం మొదలు పెట్టారు. అయిన్నప్పటికీ ఇమామ్, జుబైర్
ను ఉద్దేశించి, పిలిచి తల్హాతో చెప్పినట్లే చెప్పారు: “ఓ జుబైర్! నేను నీకు ఆరోజును గుర్తుచేయిస్తున్నాను ఏరోజైతే నేను దైవప్రవక్త(స.అ)తో పాటు ‘బనీ గనమ్’ నుండి వెళ్తుండగా అతను నా వైపు చూసి చిన్నగా నవ్వారు నేను కూడా నవ్వాను. నీవు ‘ఓ అబూతాలిబ్ కమారా! గర్వపడకు’ అని అన్నావు. అందుకు దైవప్రవక్త(స.అ) “నువ్వు మాట్లాడకు, ఇతను గర్వించడు. మరియు నీవు ఇతని(అలీ(అ.స))తో యుద్ధం చేస్తావు మరియు ఇతని పై అన్యాయం చేసినవారిలో నిర్ధారించబడతావు”.[3]
రిఫరెన్స్
1. తారీఖె తబరీ, భాగం5, పేజీ204. తారీఖె కామిల్, భాగం3, పేజీ102.
2. ఫిత్నతుల్ కుబ్రా. తాహా హుసేన్, భాగం2, పేజీ465.
3. తారీఖె తబరీ, భాగ4, పేజీ502, జమల్ యుద్ధం సంఘటన క్రమంలో. తారీఖె మస్ఊదీ, భాగం2, పేజీ368. తారీఖె అఅసమ్, భాగ2, పేజీ310. మొ॥
వ్యాఖ్యానించండి