జుబైర్ ఇబ్నె అల్ అవామ్-3

మంగళ, 05/31/2022 - 11:21

తల్హా యొక్క ఆత్మీయుడు, స్నేహితుడు మరియు సోదరుడు అయిన జుబైర్ ఇబ్నె అల్ అవామ్ గురించి సంక్షిప్త వివరణ...

జుబైర్ ఇబ్నె అల్ అవామ్-3

 “ఇబ్నె అబిల్ హదీద్”, హజ్రత్ అలీ(అ.స) ఇబ్నె అబీతాలిబ్ యొక్క ఒక ఉపన్యాసాన్ని ఉల్లేఖించారు. అందులో అతను ఇలా ప్రవచించారు: “ఓ అల్లాహ్! వీళ్ళిద్దరూ నా హక్కులను పట్టించుకోలేదు. నాపై దౌర్జన్యం చేశారు. నా బైఅత్
ను ఉల్లంఘించారు. మరియు నా పట్ల జనాన్ని పురికొల్పారు. అందుకని వారు సృష్టించిన సమస్యలను పరిష్కరించు, మరియు వారి పన్నాగాలను విఫలం చేయి. మరియు వారికి వారి చేష్టల రుచి చూపించు. నేను వారిని యుద్ధం మొదలు పెట్టకముందే ఆపివేయాలని అనుకున్నాను. మరియు యుద్ధానికి ముందు వారిని మేలుకొలుపుతూనే ఉన్నాను, కాని వారు ఈ అనుగ్రహాన్ని తెలుసుకోలేకపోయారు. మరియు సౌఖ్యాన్ని తన్నుకుపోయారు.”[1]

యుద్ధానికి ముందు వారికి వ్రాసిన లేఖనంలో ఇలా ఉంది: పూజ్యులైనవారా! మీ చేస్తున్న ఈ చేష్టలను ఆపండి ఎందుకంటే ఇప్పుడు మీ ముందు కేవలం అగౌరవం, అప్రతిష్టత యొక్క పెద్ద మెట్టుంది దీని తరువాత ఈ అగౌరవం, అప్రతిష్టతతో పాటు నిప్పు కూడా వచ్చి చేరుతుంది. వస్సలాం.[2]

ఇదీ చేదు యదార్ధం మరియు జుబైర్ యొక్క చివరిక్షణాలు. వాస్తవానికి చరిత్రకారులలో కొందరు ఇలా చెప్పి మమ్మల్ని సంతృప్తి పరచాలని అను కుంటారు “జబైర్
కు అలీ(అ.స), దైవప్రవక్త(స.అ) హదీస్
ను గుర్తు చేసినప్పుడు అతనికి గుర్తొచ్చి అతను తౌబా చేశారు, తిరిగి వస్తుండగా ‘వాదియ్యుస్సబఅ’లో ‘ఇబ్నె జర్
మూ
జ్’ అతనిని చంపేశాడు”. కాని చరిత్రకారుల ఈ వచనం దైవప్రవక్త(స.అ) వార్తతో అనుకూలముగా లేదు, ఎందుకంటే దైవప్రవక్త(స.అ), త్వరలోనే నీవు అలీ(అ.స)తో యుద్ధం చేస్తావు మరియు అతని పై అన్యాయం చేసిన వాడివిగా నిర్ధారించబడతావు, అని అన్నారు.

కొంతమంది చరిత్రకారులు ఇలా అంటారు: “అలీ(అ.స), జుబైర్
కు దైవప్రవక్త(స.అ) హదీస్
ను గుర్తుచేసినప్పుడు అతను యుద్ధం నుండి తిరిగి వెళ్ళిపోవాలని అనుకున్నారు కాని అతని కుమారుడు “అబ్దుల్లాహ్” అతని ఈ ఆలోచనను పిరికితనం అని అన్నాడు. అంతే అతని పై మానము, మర్యాదలు కమ్ముకొచ్చాయి మరియు అతను తిరిగి వచ్చి యుద్ధం చేస్తూ చనిపోయారు”.

ఈ వచనం యదార్థానికి దగ్గరగా ఉంది. మరియు తరువాత జరిగే వాటిని సూచిస్తూ చెప్పబడిన ఆ హదీస్ సూచనకూ దగ్గరగా ఉంది. ఆ హదీస్ కూడా తన ఆత్మకోరికతో ఏది చెప్పనటువంటి వారి హదీస్.

ఆ తరువాత ఒకవేళ “జుబైర్” తౌబా చేసినట్లైతే, తాను చేసిన వాటికి పశ్చాత్తాపడినట్లైతే, మార్గభ్రష్టత మరియు చీకటి నుండి విముక్తి చెందినట్లైతే అతను దైవప్రవక్త(స.అ) యొక్క ఈ ప్రవచనం: “من کنت مولاہ فعلی مولاہ اللھم وال من والاہ و عاد من عاداہ وانصر من نصرہ و اخذل من خذله” పై ఎందుకు అమలు చేయనట్లు?

హజ్రత్ అలీ(అ.స)కు ఎందుకు సహాయం చేయలేదు. అతనిని ఎందుకు ఇష్టపడలేదు? ఇలా చేయడం అతనికి సాధ్యం కాదు అని అనుకుందాం, అయితే అతనితో పాటు యుద్ధం చేస్తున్నవారి మధ్య ఉపన్యసం ఇచ్చి “నేను యదార్థాన్ని తెలుసుకున్నాను” అని ఎందుకు చెప్పలేదు. వారు మరిచిపోయిన హదీస్
ను ఎందుకు గుర్తు చేయించలేదు. ముస్లిముల రక్తం చిందించిన ఆ యుద్ధం నుండి వారిని ఎందుకు ఆపలేదు?.

కాని అతను ఎటువంటి ప్రయత్నం చేయలేదు అందుకుని మేము, “యుద్ధం నుండి పక్కకు తప్పుకోవడం” అన్న ఆ సంఘటనను ప్రజలు సృష్టించుకున్నది, అని అర్ధం చేసుకున్నాము. వీళ్ళు యదార్థాన్ని మరియు జుబైర్ మిథ్యాన్ని దాచిపెట్టడంలో ఎటువంటి లోటు ఉంచలేదు. వాస్తవానికి “జుబైర్” మిత్రుడు “తల్హా”ను “మర్వాన్ ఇబ్నె హకమ్” చంపాడు. కాని వీళ్ళు “తల్హా” మరియు “జుబైర్”
ల చేష్టలను కప్పిపెట్టడానికై వారిని “ఇబ్నె జర్
మూజ్” మోసగించి చంపేశాడు, అని అన్నారు. వారు(అహ్లెసున్నత్
లు) ఇతన్ని స్వర్గప్రవేశానికి అర్హులు అని భావిస్తారు, ఇదీ నిజమే వాళ్ళు స్వర్గాన్ని తమ ఆస్తి అని అనుకున్నంత కాలం ఎవరిని పడితే వారిని ప్రవేశపెడతారు, మరియు ఎవరిని పడితే వారిని ప్రవేసించకుండా ఆపుతారు.

ఈ రివాయత్ తప్పుడు రివాయత్ అనడానికి హజ్రత్ అలీ(అ.స) తల్హా మరియు జుబైర్ల
కు యుద్ధం నుండి మరలిపోండని ఆదేశిస్తూ వ్రాసిన ఉత్తరమే చాలు. అలీ(అ.స) ప్రవచనం: “فان الآن اعظم امرکما العار من قبل ان یجمع العار و النّار  అనువాదం: నిస్సందేహముగా మీ ముందు ఇప్పుడు అగౌరవం యొక్క పెద్ద మెట్టుంది మరియు తరువాత అగౌరవంతో పాటు నిప్పు(నరకం) కూడా (దాని ప్రక్కన) చేరుతుంది”.

ఏ ఒక్కరు కూడా, అలీ(అ.స) ఆహ్వానానికి తల్హా మరియు జుబైర్ అంగీకరించినట్లు, మరియు అతని ఆజ్ఞను పాటించినట్లు, మరియు అతని ఉత్తరానికి జవాబు ఇచ్చినట్లు, చెప్పలేదు.

ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటేయ; ఇమామ్ యుద్ధానికి ముందు వారిని అల్లాహ్ గ్రంథం వైపుకు ఆహ్మానించారు. కాని వాళ్ళు అతని ఆహ్వానాన్ని అంగీకరించలేదు. మరియు ఖుర్ఆన్ వాళ్ళ వద్దకు తీసుకొచ్చిన యువకుడిని చంపేశారు. ఆపై హజ్రత్ అలీ(అ.స) వాళ్ళతో యుద్ధం చేయడం సరైనదిగా నిర్ధారించారు.

రిఫరెన్స్
1. షర్హె నెహ్జుల్ బలాగహ్, ముహమ్మద్ అబ్దొహ్, పేజీ306.
2. షర్హె నెహ్జుల్ బలాగహ్, ముహమ్మద్ అబ్దొహ్, పేజీ626.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12