తల్హా యొక్క ఆత్మీయుడు, స్నేహితుడు మరియు సోదరుడు అయిన జుబైర్ ఇబ్నె అల్ అవామ్ గురించి సంక్షిప్త వివరణ...
మీరు చరిత్రకారులు వ్రాసిన కొన్ని పరిహాసపు మాటలు, సంఘటనలు చదివితే మీకు తెలుస్తుంది వారిలో కొందరికి యదార్థ జ్ఞానమే లేదని, మరియు అర్ధం చేసుకొనే శక్తి కూడా లేదిని. వారిలో కొందరు ఇలా అంటారు: జుబైర్
కు “అలీ(అ.స) సైన్యంలో అమ్మారె యాసిర్ కూడా ఉన్నారు” అని తెలిసినప్పుడు అతని శరీరంలో వణుకు పుట్టుకొచ్చింది అతను తన ఆయుధాన్ని వేరే అతనికి ఇచ్చేశారు. అప్పుడు మిత్రుడు ఇలా అన్నాడు: నా తల్లి నాపై శోకించుగాక! నేను నా చావూ మరియు బ్రతుకూ ఎవరితో అని భావించానో ఆ జుబైర్ ఇతనేనా?. ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆయన సాక్షిగా! జుబైర్ మామూలుగా ఇలా చేయలేదు ఖచ్చితంగా అతను దీని గురించి దైవప్రవక్త(స.అ)తో విని లేక చూసి ఉంటారు.[1]
ఇలాంటి తప్పుడు రివాయత్
లను తయారు చేయడానికి గల కారణమేమిటంటే “జుబైర్
కు దైవప్రవక్త(స.అ) ఈ హదీస్ గుర్తొచ్చింది” అని చెప్పడం. దైవప్రవక్త(స.అ) ఇలా ప్రవచించారు: “అల్లాహ్ అమ్మార్ పై శాంతి కురిపించుగాక!, అతనిని విద్రోహ సమూహం చంపుతుంది”.
ఆ (హదీస్ అతనికి గుర్తు వచ్చిన) తరువాత మేము విద్రోహ సమూహం నుండి అని అతనిలో నిరాశ కమ్ముకొచ్చింది, శరీరంలో వణుకు పుట్టుకొచ్చింది మరియు ఆ భయంతో శరీరంలో అవయవాలు పతనమయ్యాయి.
యదార్ధం ఎమిటంటే ఇలాంటి రివాయత్
లు తయారు చేసేవారు మన వివేకాన్ని హేళన చేయాలని అనుకుంటారు. మరియు మనతో పరాచకం చేస్తారు. కాని అల్లాహ్
కు కృతజ్ఞత మా బుద్ధి సంపూర్ణంగా మరియు సరిగా ఉంది. మేము వారి మాటలను అంగీకరించలేము. జుబైర్
కు భయం చుట్టుముట్టింది మరియు “అమ్మార్
ను ఒక విద్రోహ సమూహం చంపుతుంది” అన్న దైవప్రవక్త(స.అ) హదీస్ పై వణుకు పుట్టుకొచ్చింది కాని, దైవప్రవక్త(స.అ) హజ్రత్ అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స) గురించి చెప్పిన హదీసులతో భయం పుట్టుకురాలేదా?! అంటే జుబైర్ దృష్టిలో అమ్మార్, అలీ(అ.స) కన్న ప్రతిష్టగలవారా? అంటే జుబైర్, దైవప్రవక్త(స.అ) యొక్క ఈ వచనాన్ని “ఓ అలీ(అ.స) విశ్వాసి నిన్ను ఇష్టపడతాడు మరియు కపటవర్తకుడు ద్వేషిస్తాడు” వినలేదా? అలాగే దైవప్రవక్త(స.అ) ఈ వచనాన్ని “అలీ(అ.స) సత్యంతో పాటు మరియు సత్యం అలీ(అ.స)తో పాటు ఉంటారు మరియు అతను ఎక్కడున్న సరే సత్యం అతని ఆజ్ఞానువర్తిగా ఉంటుంది” వినలేదా? దైవప్రవక్త(స.అ) ఇలా ప్రవచించారు: “నేను ఎవరి స్వామినో అలీ(అ.స) వారికి స్వామి, ఓ అల్లాహ్! ఇతన్ని ఇష్టపడిన వారిని ఇష్టపడు మరియు ఇతన్ని ద్వేషించే వారిని ద్వేషించు, ఇతన్ని సహకరించే వారిని సహకరించు మరియు ఇతన్ని అవమానించిన వారిని అవమానానికి గురిచేయి” దైవప్రవక్త(స.అ) ఇలా కూడా ప్రవచించారు: “ఓ అలీ(అ.స)! మీరు యుద్ధం చేసిన వారితో నా యుద్ధం మరియు మీరు సంధి చేసిన వారుతో నా సంధి” దైవప్రవక్త(స.అ) ఇలా ప్రవచించారు: “నేను తప్పకుండా నా ద్వజాన్ని అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను ఇష్టపడేవారికి మరియు అల్లాహ్ మరియు దైవప్రవక్త(స.అ) చేత ఇష్టపడేవారికి ఇస్తాను” దైవప్రవక్త(స.అ): “నేను ఖుర్ఆన్ అవతరణ పై వాళ్ళతో యుద్ధం చేశాను మరియు అలీ(అ.స)! నువ్వు ఖుర్ఆన్ యొక్క అసత్యవాదము పై వాళ్ళతో యుద్ధం చేస్తావు” దైవప్రవక్త(స.అ) ఇలా ప్రవచించారు: “ఓ అలీ(అ.స)! నీవు నాకిసీన్[2], ఖాసితీన్[3] మరియు మారిఖీన్[4]లతో యుద్ధం చేయి, ఇదే నీకు నా వసియ్యత్(వీలు)”.
ఇలాంటి చాలా హదీసులు ఉన్నాయి. వాటిలో ఒకటి స్వయంగా జుబైర్
తో చెప్పిన హదీస్. అదేమిటంటే “త్వరలోనే నీవు అలీ(అ.స)తో యుద్ధం చేస్తావు మరియు అతని పట్ల అన్యాయం చేసినవాడివిగా నిర్ధారించబడతావు” జుబైర్ ఈ యదార్ధాలను ఎలా మరిచిపోయారు? ఇవి ఎటువంటి సంబంధంలేనటువంటి వారికి కూడా తెలుసు, మరి అతనికేమయ్యింది?, అతను దైవప్రవక్త(స.అ) మరియు అలీ(అ.స)ల సోదరుడు(కజిన్ బ్రదర్).
చరిత్ర యొక్క ఈ సంఘటనలలో మరియు వాటి యదార్థాలలో తేడా చేయలేనటువంటి వారి బుద్ధీ, వివేకం గట్టిపడిపోయింది మరియు స్పర్శరహితానికి గురి అయ్యింది. వారు జనానికి మోసగించడానికి మరియు వారిని తల్హా మరియు జుబైర్
లు స్వర్గశుభవార్త ఇవ్వబడ్డవారు, అని ఏదైనా సాకు దొరుకుతుందేమో అని వ్యర్థప్రయత్నం చేస్తున్నారు.
تِلۡكَ أَمَانِيُّهُمۡۗ قُلۡ هَاتُواْ بُرۡهَٰنَكُمۡ إِن كُنتُمۡ صَٰدِقِينَ
అనువాదం: ఇవి వారి ఆశలు, ఆకాంక్షలు మాత్రమే. వారితో ఇలా చెప్పండి: మీరు (మీ వాదనలో) సత్యవంతులైతే దాని నిదర్శనాలేమిటో సమర్పించండి.[బఖరా సూరా:2, ఆయత్:111]
إِنَّ ٱلَّذِينَ كَذَّبُواْ بَِٔايَٰتِنَا وَٱسۡتَكۡبَرُواْ عَنۡهَا لَا تُفَتَّحُ لَهُمۡ أَبۡوَٰبُ ٱلسَّمَآءِ وَلَا يَدۡخُلُونَ ٱلۡجَنَّةَ حَتَّىٰ يَلِجَ ٱلۡجَمَلُ فِي سَمِّ ٱلۡخِيَاطِۚ وَكَذَٰلِكَ نَجۡزِي ٱلۡمُجۡرِمِينَ
అనువాదం: ఎవరు మా ఆయతులను అసత్యాలని ధిక్కరించి, వాటి పట్ల గర్వతిశయంతో విర్రవీగారో వారి కోసం ఆకాశ ద్వారాలు తెరువబవు. ఒంటె సూది రంధ్రంలో నుంచి దూరిపోనంత వరకూ వారు స్వర్గంలో ప్రవేశింలేరు. అపరాధులను మేము ఈ విధంగానే శిక్షిస్తాం.[ఆరాఫ్ సూరా:7, ఆయత్:40]
రిఫరెన్స్
1. తారీఖె తబరీ, భాగం5, పేజీ205.
2. బైఅత్ చేసి దాని నుండి మరలిపోయిన వారు, తల్హా మరియు జుబైర్ మరియు వాళ్ళ అనుచరులు. వీళ్ళను “అస్హాబె జమల్” అని కూడా అంటారు.
3. ముఆవీయా ద్వార షామ్(సిరియా దేశం) మరియు దాని చుట్టుప్రక్కల నుండి ఎన్నుకొని పంపబడ్డ దుర్మార్గులు, దుష్టుల సైన్యం.
4. ఎవరైతే మొత్తానికి ఇస్లాం విశ్వాసం నుండి మరలి పోయారో వారు.
వ్యాఖ్యానించండి