దైవప్రవక్త(స.అ) యొక్క సహాబీ అయిన సఅద్ ఇబ్నె అబీ వఖ్ఖాస్ గురించి చరిత్ర గ్రంథాల పరంగా సంక్షిప్త వివరణ...

ఇతను కూడా ముందుగా ఇస్లాం స్వీకరించిన మరియు పెద్ద సహాబీయులలో ఒకరు. బద్ర్ యుద్ధంలో పాలుగొన్న మొదటి ముహాజిరీన్లలో ఇతనొకరు. ఖలీఫాను ఎన్నుకునేందుకు ఉమర్ ఏర్పర్చిన ఆరుగురి సలహామండలిలో ఒక కార్యకర్త కూడానూ. అహ్లెసున్నత్ వల్ జమాఅత్ ప్రకారం స్వర్గశుభవార్త ఇవ్వబడ్డ ఆ పది మందిలో ఇతను కూడా ఉన్నారు.
మరియు ఇతను “ఉమర్ ఇబ్నె ఖత్తాబ్” ఖిలాఫత్ కాలంలో, “ఖాదిసియ్యహ్” యుద్ధానికి ముఖ్యపాత్రధారుడు కూడాను. సహాబీయులలో కొందరికి అతని వంశావళిలో సందేహం ఉండేది, అని చెబూతూ ఉంటారు. ఆ క్రమంలోనే అతన్ని ఎత్తిపొడిచేవారు, అతన్ని కష్టపెట్టే వారు. దైవప్రవక్త(స.అ) అతని వంశావళిని నిరూపించారు మరియు అతను “బనీ జొహ్రహ్”తో సంబంధం ఉన్న వారు, అని రివాయత్ కూడా ఉల్లేఖించారు.
“ఇబ్నె ఖుతైబహ్”, తన పుస్తకం “అల్ ఇమామతు వస్సియాసతు”లో ఇలా లిఖించారు: దైవప్రవక్త(స.అ) మరణాంతరం “బనీ జొహ్రహ్”, “సఅద్ ఇబ్నె అబీ వఖ్ఖాస్” మరియు “అబ్దుల్ రహ్మాన్ ఇబ్నె ఔఫ్” వద్దకు మసీదులో కలిశారు. ఆ తరువాత వాళ్ళ వద్దకు అబూబక్ర్ మరియు అబూఉబైదహ్ వచ్చినప్పుడు ఉమర్ ఇలా అన్నారు: ఏంటీ నేను మిమ్మల్ని వేరువేరు బృంధాలలో విడిపోయి ఉన్నట్లు చూస్తున్నాను? లేవండి! అబూబక్ర్ యొక్క బైఅత్ చేయండి, నేనైతే అతనితో బైఅత్ చేశాను. అన్సారులు కూడా అతని బైఅత్ చేశారు(ఇది విని) సఅద్ మరియు అబ్దుల్ రహ్మాన్, అతని అనుచరులైన బనీ జొహ్రహ్
లు నిలబడ్డారు, అందరు కలిసి అబూబక్ర్
తో బైఅత్ చేశారు.[1]
ఇలా రివాయత్ వ్రాయబడు ఉంది: ఉమర్, సఅద్
ను గవర్నర్ పదవి నుండి తొలగించారు. కాని ఖలీఫా చివరి క్షణాలలో నా మరణాంతరం ఒకవేళ సఅద్ ఇబ్నె అబీ వఖ్ఖాస్ ఖలీఫాగా ఎన్నుకోబడకపోతే అతనిని తప్పకుండా గవర్నర్ని చేయ్యవలసిందిగా కోరారు, ఎందుకంటే అతనిని అన్యాయానికి పాలుపడిన వలనో లేదా ద్రోహం చేసిన వలనో తొలగించలేదు. అందుకని ఉస్మాన్ తన మిత్రుడి చివరికోరికను నిర్వర్తిస్తూ సఅద్
ను కూఫాకు గవర్నర్
గా నియమించారు.
“సఅద్ ఇబ్నె అబీ వఖ్ఖాస్” కూడా తన మిత్రుల వలే చాలా ఎక్కువ ఆస్తిని విడిచారు. రివాయత్ ప్రకారం అతను విడిచిన ఆస్తి మూడు లక్షలు. మరి అలాగే అతనికి మరియు ఉస్మాన్ చావుకు ఎటువంటి సంబంధం లేదు. తల్హా మరియు జుబైర్ వలే జనానికి ఉస్మాన్ పట్ల పురికొల్పలేదు.
“ఇబ్నె ఖుతైబహ్” తన “చరిత్ర” పుస్తకంలో ఇలా రివాయత్
ను వ్రాశారు: అమర్ ఇబ్నె ఆస్, సఅద్ ఇబ్నె అబీ వఖ్ఖాస్
కు ఉత్తరం వ్రాసి “ఉస్మాన్
ను ఎవరు చంపారు?” అని దర్యాప్తు చేశారు.
“సఅద్” ఇలా జవాబు వ్రాశారు: నువ్వు నాతో ఉస్మాన్ చావు గురించి ప్రశ్నిస్తున్నావా? అయితే నేను నిన్ను హెచ్చరిస్తున్నాను, అది ఆయిషా యొక్క గుప్త ఖడ్గంతో చంపబడ్డారు, దానిని తల్హా పదును పెట్టారు, అబూతాలిబ్ కుమారుడు దానిని విషయుక్తం చేశారు, జుబైర్ మౌనంగా ఉండి చేతితో సైగు చేశారు, మేము సిద్ధమై ఉన్నాము, ఒకవేళ మేము అతని తరపు నుండి డిఫెన్స్ చేయాలి అని అనుకంటే చేసే శక్తి మాలో ఉంది, కాని ఉస్మాన్ కూడా మార్పులు తీసుకొచ్చారు మరియు స్వయంగా అతను కూడా మారిపోయారు.
ఇక ఒకవేళ మేము మంచి పని చేసుంటే అది మాకోసం మరియు ఒకవేళ చెడ్డపని చేసి ఉంటే అల్లాహ్
తో క్షమాపణ కోరుతున్నాము.
నేను నిన్ను హెచ్చరిస్తున్నాను, జుబైర్ పై కోరికలు మరియు తన వంశీకుల ప్రభావం ఎక్కువ. మరియు తల్హా ఒకవేళకు అతని పొట్ట తీల్చే పదవి ఇస్తాము అని షరత్తు పెట్టినా అతను సిద్ధంగా ఉంటాడు.[2]
కాని ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే “సఅద్ ఇబ్నె అబీ వఖ్ఖాస్”కు, అమీరుల్ మొమినీన్ హజ్రత్ అలీ(అ.స) యొక్క ఇమామత్ స్థానం సత్యమైనది మరియు అతని ప్రతిష్టత తెలిసిప్పటికీ అతని బైఅత్ చేయలేదు, మరియు అలాగే అతనికి సహాయపడలేదు. ఇతనే స్వయంగా హజ్రత్ అలీ(అ.స)కు సంబంధించిన హదీసులను ఉల్లేఖించారు వాటిని ఇమామ్ నిసాయీ, ఇమామ్ ముస్లింలు తమ సహీ పుస్తకాలలో ఉల్లేఖించారు.
“సఅద్” ఉల్లేఖనం: నేను దైవప్రవక్త(స.అ) నోట అలీ(అ.స) గురించి మూడు గుణాలు విన్నాను ఒకవేళ వాటి నుండి ఒక్కటి కూడా నా సొంతమైతే అది నా అన్ని శ్రేయస్సులకు మించింది అయ్యేది. నేను దైవప్రవక్త(స.అ) నుండి ఇలా విన్నాను: మూసా(అ.స)కు హారూన్ ఎలాగో అలీ(అ.స) నాకు అలాగ, కేవలం నా తరువాత ప్రవక్త ఉండరు.
నేను దైవప్రవక్త(స.అ) నుండి ఇలా విన్నాను: “అల్లాహ్ మరియు దైవప్రవక్త(స.అ)ను ఇష్టపడేటువంటి వాడు, అతనిని అల్లాహ్ మరియు దైవప్రవక్త(స.అ) ఇష్టపడేటువంటి వాడికి రేపు నేను ద్వజాన్ని ఇస్తాను”.
నేను దైవప్రవక్త(స.అ) నుండి ఇలా విన్నాను: “ప్రజలారా! మీ స్వామి ఎవరూ? ఇలా అన్నారు: అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త. ఆ తరువాత దైవప్రవక్త(స.అ) అలీ(అ.స) చేతిని పట్టి, ఎత్తి ఇలా అన్నారు: ఎవరికి అల్లాహ్ మరియు దైవప్రవక్త (స.అ) స్వామియో ఈ అలీ(అ.స) కూడా అతనికి స్వామియే, ఓ అల్లాహ్! అలీ(అ.స)ను ఇష్టపడిన వారిని ఇష్టపడు మరియు అతనిని ద్వేషించే వారిని ద్వేషించు”.[3]
రిఫరెన్స్
1. అల్ ఇమామతు వస్సియాసతు, భాగం1, పేజీ18.
2. అల్ ఇమామతు వస్సియాసతు, భాగం1, పేజీ48.
3. ఖసాయిసే ఇమామ్ నిసాయీ, పేజీ18 మరియు 35.
వ్యాఖ్యానించండి