దైవప్రవక్త(స.అ) యొక్క సహాబీ అయిన సఅద్ ఇబ్నె అబీ వఖ్ఖాస్ గురించి చరిత్ర గ్రంథాల పరంగా సంక్షిప్త వివరణ...

“సహీ ముస్లిం”లో “సఅద్ ఇబ్నె అబీవఖ్ఖాస్” ద్వార ఉల్లేఖించబడి ఉంది. అతను ఇలా అన్నారు: నేను దైవప్రవక్త(స.అ)ను అలీ(అ.స) గురించి ఇలా ప్రవచిస్తుండగా విన్నాను: మూసా(అ.స)కు హారూన్ ఎలాగో అలీ(అ.స) నాకు అలాగ, కేవలం నా తరువాత ప్రవక్త ఉండడు, అన్న విషయాన్ని నీవు సమ్మతించడం లేదా?
నేను “ఖైబర్” రోజున అతని నుండి ఇలా విన్నాను: “అల్లాహ్ మరియు దైవప్రవక్త(స.అ)ను ఇష్టపడేటువంటి వాడు, అతనిని అల్లాహ్ మరియు దైవప్రవక్త(స.అ) ఇష్టపడేటువంటి వాడికి రేపు నేను ద్వజాన్ని ఇస్తాను. ఇది విని మా హృదయాలలో ఆ ద్వజం మాకు దక్కితే బాగుండేది అన్న కోరిక కలిగింది. కాని అతను ఇలా అన్నారు: అలీ(అ.స)ను పిలవండి!.
మరియు ఈ ఆయత్فَقُلۡ تَعَالَوۡاْ نَدۡعُ أَبۡنَآءَنَا وَأَبۡنَآءَكُمۡ అవతరించినప్పుడు దైవప్రవక్త(స.అ) అలీ(అ.స), ఫాతెమా(స.అ), హసన్(అ.స) మరియు హుసైన్(అ.స)లను పిలిచారు. మరియు ఇలా అన్నారు: ఓ అల్లాహ్! వీళ్ళే నా అహ్లెబైత్(అ.స)లు.
“సఅద్ ఇబ్నె అబీ వఖ్ఖాస్”, ఈ యదార్ధాలన్ని తెలిసినప్పటికీ అమీరుల్ మొమినీన్(అ.స)
తో బైఅత్ చేయడానిక ఎలా నిరాకరించగలరూ?
“సఅద్”, దైవప్రవక్త(స.అ) ఈ ప్రవచనాన్ని విని కూడా ఏ ప్రయోజనం; “ఎవరికి అల్లాహ్ మరియు దైవప్రవక్త(స.అ) స్వామియో అలీ(అ.స) కూడా అతనికి స్వామియే, ఓ అల్లాహ్! అలీ(అ.స)ను ఇష్టపడిన వారిని ఇష్టపడు మరియు అతనిని ద్వేషించే వారిని ద్వేషించు” ఈ రివాయత్ స్వయంగా అతనే ఉల్లేఖించారు. ఆ తరువాత కూడా అలీ(అ.స)ను వలీ(స్వామి)గా అంగీకరించలేదు మరియు అతనిని సహకరించలేదు!.
“సఅద్ ఇబ్నె అబీ వఖ్ఖాస్” నుండి దైవప్రవక్త(స.అ) యొక్క ఈ హదీస్ “తన కాలపు ఇమామ్ యొక్క బైఅత్ చేయకుండా చనిపోయిన వాడు అజ్ఞాని చావు చచ్చాడు” ఎందుకని రహస్యంగా ఉండిపోయింది?. ఈ హదీస్
ను “అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్” ఉల్లేఖించారు. అంటే “సఅద్” అజ్ఞానపు చావు చచ్చారు, అతను అమీరుల్ మొమినీన్, సయ్యదుల్ వసీయ్యీన్, ఖాయిదుల్ గుర్రిల్ మహజ్జిలీన్ యొక్క బైఅత్
ను నిరాకరించారా?!.
చరిత్రకారుల వచనానుసారం “సఅద్” క్షమాపణ కోసం హజ్రత్ అలీ(అ.స) వద్దకు వచ్చి ఇలా అన్నారు: “ఓ అమీరుల్ మొమినీన్(అ.స)! అల్లాహ్ సాక్షిగా! మీరు అందరికన్న ఖిలాఫత్ పదవీ హక్కుదారులు, మీరు ఇరులోకాలలో న్యాయస్థులు, అన్న విషయంలో నాకు ఏమాత్రం సందేహం లేదు. అయినప్పటికీ జనం ఈ క్రమంలో మీతో యుద్ధం చేస్తారు, అది వేరే విషయం అనుకోండి. కాని ఒకవేళ మీరు నా నుండి బైఅత్ కోరినట్లైతే నాకు ఇతడిని ఎంచుకో మరియు అతనిని వదిలేయి అని చెప్పే ఖడ్గాన్ని ఇవ్వండి”.
హజ్రత్ అలీ(అ.స) ఇలా అన్నారు: “ఏంటీ, నువ్వు ఎవరినైనా మాట మరియు అమలులో ఖుర్ఆన్
కు వ్యతిరేకిగా చూశావా! నిస్సందేహముగా ముహాజిరీన్
లు మరియు అన్సారులు నేను వారి మధ్య అల్లాహ్ గ్రంథం మరియు దైవప్రవక్త(స.అ) సున్నత్ ప్రకారంగా పరిపాలిస్తాను, అన్న షరత్తు పై బైఅత్ చేశారు. నీకు నచ్చితే బైఅత్ చేయి లేకపోతే ఇంట్లో కూర్చో! నేను నీతో బలవంతంగా బైఅత్ చేయించుకోను”.[1]
“సఅద్ ఇబ్నె అబీవఖ్ఖాస్” తీరు ఆశ్చర్యకరమైనది!! అలీ(అ.స) గురించి స్వయంగా చేబుతున్నారు “మీరు అందరికన్న ఖిలాఫత్ పదవీ హక్కుదారులు, ఇరులోకాలలో న్యాయస్థులు, అన్న విషయంలో నాకు ఏమాత్రం సందేహం లేదు” అని కాని తరువాత “మాట్లాడే ఖడ్గం” కావాలి అని చెబుతున్నారు. మరి దానిని బైఅత్ చేయడానికి షరత్తుగా నిర్ధారిస్తున్నారు. ఎందుకూ, అంటే? దాని ద్వార సత్య అసత్యాలు తెలుసుకునేందుకు, అని అంటున్నారు!.
ఇది వివేకులు, బుద్ధిమంతులు రద్దు చేసే వైరుధ్యం కాదా? ఇతను అసభవమైన దానిని అడగడం లేదా?, వాస్తవానికి దైవప్రవక్త(స.అ) చాలా హదీసులలో యదార్థాన్ని చెప్పి ఉన్నారు, వాటి నుండి ఐదు హదీసులు స్వయంగా “సఅద్”యే ఉల్లేఖించారు.
అబూబక్ర్, ఉమర్ మరియు ఉస్మాన్
తో బైఅత్ సమయంలో “ఎవరైతే బైఅత్
ను నిరాకరిస్తారో అతనిని చంపేయండి ఎందుకంటే దాని వల్ల ఆపదలు ఏర్పడే భయం ఉంది” అని ఆదేశమిచ్చినప్పుడు అక్కడ “సఅద్” లేరా?
నిజానికి ఈ “సఅదే” ఎటువంటి షరత్తు లేకుండా ఉస్మాన్
తో బైఅత్ చేశారు. మరియు హృదయపూర్వకంగా అతని వైపు నమ్రమయ్యారు. ఆ సమయంలోనే “అబ్దుల్ రహ్మాన్ ఇబ్నె ఔఫ్” హజ్రత్ అలీ(అ.స) శిరస్సు పై ఖడ్గాన్ని పెట్టి ఇది ఖడ్గమే వేరే ఏదీ కాదు, మీరు మీ కొరకు వ్యతిరేక మార్గాన్ని తెరుచుకోకండి, అని హెచ్చరిస్తున్నారు.[2]
హజ్రత్ అలీ(అ.స), అబూబక్ర్
తో బైఅత్ చేయడానికి నిరాకరించినప్పుడు కూడా “సఅద్” అక్కడ ఉన్నారు. ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ హెచ్చరిస్తూ ఇలా అన్నారు: బైఅత్ చేయి, లేకపోతే ఆయన తప్ప పూజింపదగినటువంటి ప్రభువు సాక్షిగా! మేము నీ శిరస్సును నరుకుతాము.[3]
“అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్”, “ఉసామా ఇబ్నె జైద్” మరియు “మొహమ్మద్ ఇబ్నె మస్లమహ్”
ను హజ్రత్ అలీ(అ.స)తో బైఅత్ నుండి మరలించింది, మరియు అతని గురించి చెడుగా చెప్పడానికి కారణం “సఅద్ ఇబ్నె అబీవఖ్ఖాస్” కాదా?
“ఉమర్ ఇబ్నె ఖత్తాబ్” ఖిలాఫత్ క్రమంలో హజ్రత్ అలీ(అ.స)కు భిన్నంగా నిశ్చయించిన ఆ ఐదుగురి స్థితిగతులు మీరు చదివారు. ఉమర్ గీసిన ప్లాను ప్రకారమే వారు తమ తీరును ప్రదర్శించారు. (ఆ ప్లాను) ఏమిటంటే అలీ(అ.స) ఖిలాఫత్ పదవికి చేరకూడదు. అందుకనే “అబ్దుల్ రహ్మాన్” తన బావ అయిన “ఉస్మాన్”
ను ఖలీఫా చేశారు. మరియు అలీ(అ.స)తో ఇలా అన్నారు: “నీవు బైఅత్ చేయకపోయినట్లైతే చంపబడతావు ఎందుకంటే ఉమర్ అబ్దుల్ రహ్మన్ ఉన్న బృంధం మాటను అంగీకరించమని చెప్పారు”.
రిఫరెన్స్
1. తారీఖె అఅసమ్, పేజీ163.
2. అల్ ఇమామతు వస్సియాసతు, భాగం1, పేజీ31.
3. అల్ ఇమామతు వస్సియాసతు, భాగం1, పేజీ20.
వ్యాఖ్యానించండి