సఅద్ ఇబ్నె అబీ వఖ్ఖాస్-3

మంగళ, 06/07/2022 - 03:25

దైవప్రవక్త(స.అ) యొక్క సహాబీ అయిన సఅద్ ఇబ్నె అబీ వఖ్ఖాస్ గురించి చరిత్ర గ్రంథాల పరంగా సంక్షిప్త వివరణ...

సఅద్ ఇబ్నె అబీ వఖ్ఖాస్-3

 “అబ్దుల్ రహ్మాన్ ఇబ్నె ఔఫ్” మరణాంతరం మరియు “ఉస్మాన్” చంపబడిన తరువాత జరిగిన ఖిలాఫత్ ఎన్నకలో అలీ(అ.స)కు పోటీదారుడు లేడు. కేవలం ఈ మూడు వ్యక్తులు తప్ప అనగా “తల్హా”, “జుబైర్” మరియు “సఅద్”.
ఇంకో చెప్పదగ్గ విషయమేమిటంటే “ఉస్మాన్” తన మరణానికి ముందు అలీ(అ.స)కి పోటీగా ఎలాంటి కొత్త వ్యక్తిని నిలబెట్టారంటే అతడు అందరి కన్న భయంకరమైన వాడు, మోసం మరియు దగా చేయడంలో సాటిలేని వాడు, బలం మరియు బలగం ఎక్కువగా ఉన్నవాడు. ఉస్మాన్ అతను ఖిలాఫత్
కు చేరేందుకు మార్గాన్ని సరిచేశారు. ఇస్లామీయ ప్రపంచ ప్రముఖ దేశాలను ఇరవై సంవత్సరముల కన్న ఎక్కువ కాలం తన చేతుల్లో ఉంచుకున్నారు, మరి ఇస్లామీయ దేశాల సంపద 2/3 వంతు కన్న ఎక్కువ ఈ పట్టణాల నుండే వచ్చేది.
ఆ వ్యక్తి “ముఆవియా”యే. ఇతనికి దీన్
తో గాని సద్గుణంతో గాని ఎటువంటి సంబంధం లేదు. ఇతడి లక్ష్యం ఖిలాఫత్. ఖిలాఫత్
కు చేరడం తప్ప అతడికి వేరే పని లేదు. అతడు ఖిలాఫత్ పై రావడానికి ప్రతీ న్యాయఅన్యాయాల గారిడినైనా ఉపయోగించే వాడు.

పరిస్థితులు ఈ విధంగా ఉన్నా సరే అమీరుల్ మొమినీన్ అలీ(అ.స) తన బలాన్ని ప్రయోగించి ప్రజల నుండి బైఅత్ తీసుకోలేదు. గతించిన ఖులాఫాలు బలవంతంగా బైఅత్ తీసుకునే వారు. అవును అతను అహ్కాములను ఖుర్ఆన్ మరియు సున్నత్
లో బంధించారు, అందులో ఎటువంటి మార్పులు చేయలేదు. మీరు అలీ(అ.స) “సఅద్”
తో చెప్పిన మాటను చదవలేదా? అలీ(అ.స): “ముహాజిరీన్
లు మరియు అన్సారులు నేను వారి మధ్య అల్లాహ్ గ్రంథం మరియు దైవప్రవక్త(స.అ) సున్నత్ ప్రకారంగా పరిపాలిస్తాను అన్న షరత్తు పై బైఅత్ చేశారు. నీకు నచ్చితే బైఅత్ చేయి లేకపోతే ఇంట్లో కూర్చో! నేను నీతో బలవంతంగా బైఅత్ చేయించుకోను”.
ఓ అబూతాలిబ్ కుమారుడా! మీకు శుభాకాంక్షలు, వేరే వాళ్ళు ఖుర్ఆన్ మరియు సున్నత్
ను జీవంలేకుండా చేసిన సమయంలో మీరు ప్రాణం పోశారు. అల్లాహ్ గ్రంథం ఇలా ప్రవచిస్తుంది:
إِنَّ ٱلَّذِينَ يُبَايِعُونَكَ إِنَّمَا يُبَايِعُونَ ٱللَّهَ يَدُ ٱللَّهِ فَوۡقَ أَيۡدِيهِمۡۚ فَمَن نَّكَثَ فَإِنَّمَا يَنكُثُ عَلَىٰ نَفۡسِهِۦۖ وَمَنۡ أَوۡفَىٰ بِمَا عَٰهَدَ عَلَيۡهُ ٱللَّهَ فَسَيُؤۡتِيهِ أَجۡرًا عَظِيمٗا
అనువాదం: ఎవరైతే (నీ చేతిలో చెయ్యేసి) విధేయతా ప్రమాణం చేస్తున్నారో వారు యదార్థానికి అల్లాహ్ తో ప్రమాణం చేస్తున్నారు. వారి చేతులపై అల్లాహ్ చెయ్యి(బలం) ఉంది. ఎవడైనా ప్రమాణ భంగానికి పాల్పడినట్లైతే, ఆ ప్రమాణ భంగపు నష్టం తన ఆత్మకే చేకూర్చుకుంటాడు. మరెవరయినా అల్లాహ్ తో చేసిన వాగ్దానాన్ని నెరవేరిస్తే అల్లాహ్ అతనికి త్వరలోనే గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.[ఫత్హ్ సూరా:48, ఆయత్:10]

అల్లాహ్ ప్రవచనం:
أَفَأَنتَ تُكۡرِهُ ٱلنَّاسَ حَتَّىٰ يَكُونُواْ مُؤۡمِنِينَ
అనువాదం: ...ప్రజలు విశ్వసించాల్సిందేనని నువ్వు వారిపై బలవంతం చేస్తావా?[యూనుస్ సూరా:10, ఆయత్:99]
ధర్మం
లో ఎటువంటి బలవంతం లేదు. అలాగే ఇస్లాంలో బలవంతంగా బైఅత్ తీసుకోవడం సరి కాదు. మరి అల్లాహ్ తన దైవప్రవక్త(స.అ)కు నీవు బైఅత్ కోసం ప్రజలతో యుద్ధం చేయమని ఆదేశించనూ లేదు.
సున్నత్ మరియు దైవప్రవక్త(స.అ) చరితము మాత్రం “వారు ఎప్పుడు కూడా ఎవరి పై బైఅత్ కోసం బలవంతం పెట్ట లేదు” అని చెబుతుంది. కాని ఖలీఫాలు మరియు సహాబీయులు ఈ బిద్అత్
ను సృష్టించారు, మరి ప్రజలతో ఒకవేళ “మాతో బైఅత్ చేయకపోయినట్లైతే చంపబడతారు” అని అన్నారు.

స్వయంగా ఫాతెమా(స.అ)నే ఇల్లు తగలబెడతామని హెచ్చరించారు. ఒకవేళ బైఅత్ విరోధులు మీ ఇంటి నుండి బయటకు రాకపోతే ఇల్లు తగలబెట్టేస్తాము. దైవప్రవక్త(స.అ) ఖలీఫాగా నియమించినటువంటి అలీ(అ.స) పై కత్తి ఎత్తారు. మరియు అల్లాహ్ పై ప్రమాణం చేసి ఇలా అన్నారు: “ఒకవేళ నీవు(అలీ(అ.స)) బైఅత్ చేయకపోయినట్లైతే తప్పకుండా మేము మిమ్మల్ని చంపేస్తాము” ఇలాంటి గౌరవనీయులైన వ్యక్తులతో వారు ఇలా ప్రవర్తించారంటే ఇక “అమ్మార్”, “సల్మాన్” మరియు “బిలాల్” లాంటి అమాయకపు సహాబీయులతో వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు.
ముఖ్య విషయమేమిటంటే “సఅద్ ఇబ్నె అబీవఖ్ఖాస్” అలీ(అ.స)తో బైఅత్
ను నిరాకరించారు. అలాగే ముఆవియా అతనిని అలీ(అ.స)ను దూషించమని ఆదేశించినప్పుడు అతను ఆ పనిని నిరాకరించాడు. ఇది సహీ ముస్లిం ఉల్లేఖనం ప్రకారం.
కాని సఅద్
కు ఇది చాలదు మరి అలాగే అతనిని స్వర్గార్హులు చేసేయదు, ఎందుకంటే అతను పక్షపాతరహితంగా వేరే ఒక మార్గాన్ని “నేను నీతోనూ లేను నీ శత్రువుతోనూ లేను” అన్న పిలుపు నీడలో తయారు చేసుకున్నారు. ఇస్లాం ఈ మాటను అంగీకరించదు. ఇస్లాం చెప్పేది ఒకే మాటు, అదేమిటంటే యదార్థాన్ని దాటితే అంతా మార్గభ్రష్టతే.

ఆ తరువాత అల్లాహ్ గ్రంథం మరియు దైవప్రవక్త(స.అ) సున్నత్
లు, ఆపదను స్పష్టంగా చూపించాయి. దాని నుండి జాగ్రత్తగా ఉండమని సూచించి, దాని హద్దులను నిశ్చయించాయి. ఎందుకంటే నాశనమయ్యేవాడు మరియు రుజుమార్గం పొందేవారిద్దరికీ తమ మార్గం తెలియాలి.
దైవప్రవక్త(స.అ) అలీ(అ.స) గురించి ఈ హదీస్  ప్రవచించి దాని ద్వార అన్ని విషయాలను చెప్పేశారు. “ఓ అల్లాహ్! అలీ(అ.స)ను ఇష్టపడే వారిని ఇష్టపడు మరియు ఇతన్ని ద్వేషించే వారిని ద్వేషించు, ఇతన్ని సహకరించే వారిని సహకరించు, మరియు ఇతన్ని అవమానించిన వారిని అవమానానికి గురిచేయి మరియు యదార్థాన్ని ఇతని విధేయత చేయి”
స్వయంగా హజ్రత్ అలీ(అ.స), సఅద్ బైఅత్ చేయకపోవడానికి కారణాలు చెప్పారు. “షఖ్
షఖియహ్” ఉపన్యాసంలో ఇలా ఉంది; “వారిలో ఒకవ్యక్తి వరుసకు అల్లుడు కావడంతో అటు వెళ్ళి పోయాడు”.

ఈ వాక్య వివరణతో “షేక్ మొహమ్మద్ అబ్దొహ్” ఇలా అన్నారు: “సఅద్ ఇబ్నె అబీవఖ్ఖాస్”కు హజ్రత్ అలీ(కర్రమల్లాహ్ వజ్
హహు)తో సహజంగా తన మేనమావయ్యల వల్ల మనస్పర్ధలు ఉన్నాయి. ఎందుకంటే అతని తల్లి “హుమ్నా బింతె అబీ సుఫ్యాన్ ఇబ్నె ఉమయ్యహ్ ఇబ్నె అబ్దుష్షంస్” మరి అలీ(అ.స) అతని పెద్దలను చంపడంలో ముఖ్యపాత్ర వహించేవారు, అన్న విషయం ప్రఖ్యాతి చెందినది.[1]

పాత శత్రుత్వం మరియు ఈర్ష్య “సఅద్”
ను అంధుడ్ని చేశాయి. అలీ(అ.స)ని శత్రువుగానే అర్ధం చేసుకున్నాడు. అతని ప్రవచనాన్ని ఇలా ఉల్లేఖించారు, అతనిని ఉస్మాన్ “కూఫా”కు గవర్నర్
గా నియమించినప్పుడు అతను ఉపన్యాసమిస్తూ ఇలా అన్నారు: అందరి కన్న మంచి మనిషి, (అనగా) అమీరుల్ మొమినీన్ ఉస్మాన్
ను విధేయులుగా ఉండండి.
అంటే “సఅద్ ఇబ్నె అబీ వఖ్ఖాస్”, ఉస్మాన్ జీవితకాలంలోనే అతని తరపు మక్కువ ఉండేది. అందుకనే ఉస్మాన్ మరణాంతరం కూడా అతనితో ప్రభావితుడయ్యే ఉన్నారు, మరియు అందువల్లే అతను హజ్రత్ అలీ(అ.స)పై “ఉస్మాన్
ను చంపినవాళ్ళలో అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స) కూడా ఉన్నారు” అని నింద వేశారు. “అమ్ర్ ఇబ్నె అల్ ఆస్” యొక్క ఉత్తరానికి జవాబులో వ్రాసినట్లు; “ఉస్మాన్, ఆయిషా యొక్క గుప్త కత్తితో చంపబడ్డారు మరియు అలీ(అ.స)కు కూడా అందులో భాగం ఉంది”.[2]

రిఫరెన్స్
1. షర్హె నెహ్జుల్ బలాగహ్, షేక్ మొహమ్మద్ అబ్దొహ్ మిస్రీ, భాగం1, పేజీ88.
2. అల్ షియా హుమ్ అహ్లుస్సున్నహ్, తీజానీ సమావీ, పేజీ 250.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 12 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12