దైవప్రవక్త(స.అ) యొక్క సహాబీ అయిన సఅద్ ఇబ్నె అబీ వఖ్ఖాస్ గురించి చరిత్ర గ్రంథాల పరంగా సంక్షిప్త వివరణ...
ఒక పరిశోధకుడు, “బుఖారీ” ఉల్లేఖించిన రివాయత్ ద్వార స్పష్టంగా రాత్రే కుట్ర పన్నారు అన్న విషయాన్ని తెలుసుకోగలడు. అబ్దుల్ రహ్మాన్ తెలివిని మరియు ఉమర్ అతనిని ఎన్నుకోవడం వ్యర్ధచర్య కాదు అని కూడా బాగా అర్ధం చేసుకోగలడు.
రావీ(మసూర్) వచనను కొంచెం పరిశీలనగా చూద్దాం. నేను అలీ(అ.స)ను పిలిచాను, ఆ తరువాత వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, అలీ(అ.స) లేచినిలబడ్డారు, అతను ఖిలాఫత్ అపేక్షతో ఉన్నారు.
దీని ప్రకారం అర్ధమయ్యేదేమిటంటే “అబ్దుల్ రహ్మాన్ బన్ ఔఫ్”, అలీ(అ.స)ను ఖిలాఫత్ మీది అని నమ్మకం కలిపించి, చివరికి ఆ పనికిమాలిన కమిటీలో చేర్చుకున్నారు. ఇంతకు ముందు సఖీఫాలో అబూబక్ర్ యొక్క బైఅత్ క్రమంలో జరినట్లు ఇంకోసారి ఉమ్మత్ యొక్క విభజనకు కారణం అయ్యారు. మరి ఈ అభిప్రాయం సరైనది అని మసూర్ వచనం “అబ్దుల్ రహ్మాన్ అలీ(అ.స) విషయంలో దేని వల్ల భయపడుతున్నారు” తాఖీదు చేస్తుంది.
అందుకనే అబ్దుల్ రహ్మాన్ మోసంగా ఒక ఆట ఆడారు. అదేమిటంటే రాత్రి అలీ(అ.స)కు ఖిలాఫత్ విషయంలో విశ్వాసం కలిపించారు. మరియు ఉదయం సైన్యాధిపతులు, నాయకులు, పెద్దలు సమక్షంలో “అబ్దుల్ రహ్మాన్ ఇబ్నె ఔఫ్” మరలిపోయి అకశ్మాత్తుగా అలీ(అ.స)తో “ప్రజలు ఉస్మాన్
కు పోటీగా ఎవ్వరిని అనుకోవడం లేదు” అన్నారు. అప్పుడు హజ్రత్ అలీ(అ.స) అవాంఛనీయంగా ఈ మాటను అంగీకరించారు. లేకపోతే తనకు వ్యతిరేకంగా విరోధులను మరియు కష్టాలను సృష్టించుకునే వారు. (అనగా ఒకవేళ వాళ్ళు ఎన్నుకున్న ఖలీఫా ఉస్మాన్ ఇబ్నె అఫ్వాన్ బైఅత్ చేయకపోతే అతనిని చంపేస్తాము)
ఒక పరిశోధకుడికి ఈ కుట్ర గురించి రివాయత్ యొక్క ఈ వాక్యం “జనం చేరుకున్నప్పుడు, అబ్దుల్ రహ్మాన్ కలెమా చదివి ఇలా అన్నారు: అలీ(అ.స)! నేను జనం విషయంలో బాగా ఆలోచించాను కాని వాళ్ళు ఉస్మాన్
కు సమానంగా ఎవ్వరిని అనుకోవడం లేదు. కనుక మీరు మీకు వ్యతిరేకంగా మార్గాన్ని తయారు చేసుకోకండి’’ ద్వార ఇంకా బాగా అర్ధమవుతుంది. అదీకాకుండా “అబ్దుల్ రహ్మాన్” ఆ జనసమూహం నుండి అలీ(అ.స)నే ఎందుకు చేప్పారు. “అలీ(అ.స)!... తల్హా!... జుబైర్!...” అని ఎందుకు చెప్పలేదు?.
దీంతో మనకు అర్ధమయ్యిందేమిటంటే, రాత్రి జరిగిన సంఘటన వేరు. అందరు ఉస్మాన్
ను ఖలీఫా చేయడంలో మరియు హజ్రత్ అలీ(అ.స)ను ఖిలాఫత్ నుండి దూరం చేయడంలో ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు.
నేను పూర్తినమ్మకంతో ఈ మాట చెబుతున్నాను, వీళ్ళందరూ అలీ(అ.స)తో భయపడి ఉన్నారు, వాళ్ళు ఒకవేళ అలీ(అ.స) ఖలీఫాగా నియమించబడితే వాళ్ళని న్యాయంగా, సమానంగా అమలు చేయమని బలవంతం చేస్తారు. దైవప్రవక్త(స.అ) సున్నత్
కు ప్రాణం పోస్తారు. ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ అరేబీయులను అజమీయుల పై శ్రేష్ఠతగల వారు అన్న బిద్అత్
ను శవాన్ని లేపుతారు, అని అనుకుంటున్నారు. ఉమర్ ఇబ్నె ఖత్తాబే స్వయంగా తన మరణానికి ముందు ఈ విషయాన్ని సూచించి వారిని అలీ(అ.స) తరపు నుండి వచ్చే ప్రమాదం పై హెచ్చరిస్తూ ఇలా అన్నారు: “ఒకవేళ అలీ(అ.స) గనక ఈ ఉమత్
కు ఖలీఫా అయినట్లైతే అతను దీన్ని సరైన మార్గంలో తీసుకొచ్చేస్తారు” అనగా దైవప్రవక్త(స.అ) సున్నత్ పై నడిపిస్తారు. కాని ఉమర్
కు మరియు ఖురైషీయులకు అది ఇష్టం లేదు. ఒకవేళ అతనికి కొంచెం కూడా దైవప్రవక్త(స.అ) సున్నత్ పై ప్రేమ ఉంటే అతను తప్పకుండా అలీ(అ.స)ను ఖలీఫాగా నియమించే వారు. అలీ(అ.స) కూడా వారిని తప్పకుండా సున్నత్ పై నడిపించే వారు. మరోసారి అందరిని దైవప్రవక్త(స.అ) సున్నత్ వైపు మరలించేవారు. అతనే దైవప్రవక్త(స.అ) యొక్క అసలైన ఉత్తరాధికారి, మరియు అతనే సున్నత్ పై స్థిరంగా, నిలకడగా ఉన్నారు కూడానూ.
మేము “తల్హా”, “జుబైర్” మరియు “సఅద్” ల గురించి చర్చించినప్పుడు “వాళ్ళు ముళ్ళను నాటారూ మరియు అవమానం, కీడును పోందారు” అని చెప్పాము.
రిఫరెన్స్
అల్ షియా హుమ్ అహ్లుస్సున్నహ్, సమావీ తీజానీ, పేజీ260.
వ్యాఖ్యానించండి