ఇమామ్ రిజా(అ.స) ఉల్లేఖనలు

శని, 06/11/2022 - 17:22

వివిధ అంశాలను మరియు ప్రత్యేకతలను వివరిస్తున్న ఇమామ్ రిజా(అ.స) యొక్క కొన్ని హదీసుల తెలుగు అనువాదం... 

ఇమామ్ రిజా(అ.స) ఉల్లేఖనలు

1. ఉత్తమ బుద్ధి
ఇమామ్ రిజా(అ.స) ఉల్లేఖనం: ఉత్తమ బుద్ది(కి నిదర్శనం), స్వీయాన్ని తెలుసుకోవడం.[1]
2. దైవారాధన ఆరంభం
ఇమామ్ రిజా(అ.స) ఉల్లేఖనం: దైవారాధన ఆరంభం, ఆయన పట్ల జ్ఞానం(తో మొదలవుతుంది)[2]
3. అహ్లె బైత్(అ.స) ఆశ్రయం
ఇమామ్ రిజా(అ.స) ఉల్లేఖనం: మీకు కష్టాలు వచ్చినప్పుడు, మమ్మల్ని మధ్యవర్తగా చేసి అల్లాహ్ నుండి సహాయాన్ని కోరండి.[3]
4. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
ఇమామ్ రిజా(అ.స) ఉల్లేఖనం: “బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్” అల్లాహ్ యొక్క ఇస్మె ఆజమ్ కు, కనుగుడ్డులో ఉండే నలుపు తెలుపుల మధ్య ఉన్న దగ్గర కన్నా దగ్గర[4].
5. విశ్వాసిని చిరునవ్వుతో చూడడం
ఇమామ్ రిజా(అ.స) ఉల్లేఖనం: తన తోటి విశ్వాసి సోదరుడిని చిరునవ్వుతో చూసినవాడిని అల్లాహ్ అతడి కోసం పుణ్యాన్ని లిఖిస్తాడు, మరి అల్లాహ్ పుణ్యాన్ని లిఖించినట్లైతే, అతడిని శిక్షించడు.[5]
6. ఇమామ్ లేని మరణం
ఇమామ్ రిజా(అ.స) ఉల్లేఖనం: ఇమామ్ (పట్ల నమ్మకం లేకుండానే) మరణించిన వాడి మరణం, అజ్ఞానపు మరణం[6].
7. దీన్ యొక్క ఉత్తమత్వం
ఇమామ్ రిజా(అ.స) ఉల్లేఖనం: దీన్ యొక్క ఉత్తమత్వం, మా విలాయత్ (ను స్వీకరించడం) మరియు మా శత్రువులను ద్వేషించడం[7].
8. ఇమామ్ అలీ(అ.స) పట్ల అతి విశ్వాసం
ఇమామ్ రిజా(అ.స) ఉల్లేఖనం: అమీరుల్ మొమినీన్(అ.స)ను (అల్లాహ్) దాసోహం యొక్క హద్దులకు దాటి నమ్మినవారు, ఆగ్రహానికి గురిఅయిన వారు మరియు మార్గభ్రష్టుల నుండి లెక్కించబడతారు.[8]
9. పొరుగువారు
ఇమామ్ రిజా(అ.స) ఉల్లేఖనం: ఎవరి చేష్టల వల్ల తన పొరుగువారు సురక్షితంగా లేరో అతడు మా వాడు కాడు.[9]
10. షియా ప్రత్యేకతలు
ఇమామ్ రిజా(అ.స) ఉల్లేఖనం: మా షియా: మా ఆజ్ఞల పట్ల అనుగుణంగా ఉంటారు, మా ఆదేశాల పట్ల విధేయత చూపుతారు మరియు మా శత్రువుల పట్ల వ్యతిరేక భావం కలిగి ఉంటారు. అయితే ఎవరైతే ఇలా ఉండలో వారు మావాడు కాడు.[10]
11. అహ్లె బైత్(అ.స) మాటలు ఆణిముత్యాలు
ఇమామ్ రిజా(అ.స) ఉల్లేఖనం: ఒకవేళ ప్రజలకు మా మాటల సౌదర్యం(తర్కం) గురించి తెలిస్తే, మమ్మల్ని అనుచరిస్తారు.[11]
12. ఆరాధన కీర్తి
ఇమామ్ రిజా(అ.స) ఉల్లేఖనం: ఎవరైతే తన ఆరాధన కీర్తి గొప్పలు చెప్పుకుంటాడో, అతడి దీన్(దీన్ దారీ) గురించి ఆలోచించండి.[12]
13. అజాన్ మరియు అఖామత్ ప్రాముఖ్యత
ఇమామ్ రిజా(అ.స) ఉల్లేఖనం: అజాన్ మరియు అఖామత్ చెబితే, దైవదూతల రెండు వరుసలు అతడి వెనక నమాజ్ చదువుతారు. ఎవరైతే అఖామత్ ఇచ్చి అజాన్ ఇవ్వనివాడి కుడి వైపు ఒక దైవదూత మరియు ఎడమ వైపు ఒక దూత నిలబడతాడు[13].
14. నమాజ్ సామిప్యానికి కారణం
ఇమామ్ రిజా(అ.స) ఉల్లేఖనం: నమజ్, ప్రతీ ధర్మనిష్టగల వారికి (అల్లాహ్) సామిప్యానికి కారణం.[14]    

రిఫరెన్స్
1. అల్ అదదుల్ ఖవియ్యహ్, పేజీ292, హదీస్18.
2. అల్ తౌహీద్, పేజీ34, హదీస్2.
3. తఫ్సీరె అయాషీ, భాగం2, పేజీ176, హదీస్1662.
4. ఉయూను అఖ్బారిర్రిజా(అ.స), భాగం2, పేజీ5, హదీస్11.
5. మసాదిఖతుల్ ఇఖ్వాన్, పేజీ157, హదీస్1.
6. కమాలుద్దీన్, పేజీ668, హదీస్11.
7. బిహారుల్ అన్వార్, భాగం27, పేజీ58, హదీస్19.
8. అల్ ఎహ్తెజాజ్, భాగం2, పేజీ453, హదీస్314.
9. ఉయూను అఖ్బారిర్రిజా, భాగం2, పేజీ24, హదీస్3.
10. సిఫాత్ అల్ షియా, పేజీ82, హదీస్2.
11. మఆనియుల్ అఖ్బార్, పేజీ180, హదీస్1.
12. అల్ అమాలీ లిత్తూసీ, పేజీ649, హదీస్1348.
13. మన్ లా యహ్జురుహుల్ ఫఖీహ్, భాగం1, పేజీ287, హదీస్888.
14. అల్ కాఫీ, భాగం3, పేజీ265, హదీస్6.
 

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 4