ఇస్లాం దృష్టిలో అబద్ధం మహా పాపం. దానికి నిదర్శనం అల్లాహ్ ప్రవచనం: ‘ఒకవేళ తాను చెప్పేది అబద్ధమైతే తనపై అల్లహ్ శాపం పడుగాక!’ అని చెప్పాలి.

అబద్ధం అనగ అసత్యం, యదార్ధానికి వ్యతిరేకమైన విషయం మరియు తప్పుడు మాటలు. ఇస్లాం దృష్టిలో అబద్ధం మాహా పాపం. అల్లాహ్ ఖుర్ఆన్ లో అబద్ధం చెప్పినవారు సాఫల్యం పొందలేరని, వారికి వ్యధాభరితమైన శిక్ష ఉందని మరియు వారికి సన్మార్గం చూపడని వివరించాడు.
అల్లాహ్ నహ్ల్ సూరహ్ లో ఇలా ప్రవచించెను: “ఏ వస్తువునైనా తమ నోటితో ‘ఇది ధర్మసమ్మతం’ అని, ‘ఇది నిషిద్ధమనీ’ ఇష్టమొచ్చినట్లు అబద్ధం చెప్పేసి, అల్లాహ్ కు అబద్దాలు ఆపాదించకండి. అల్లాహ్ కు అబద్ధాలు ఆపాదించేవారు సాఫల్యాన్ని పొందలేరు”[నహ్ల్, 116]
దాని తరువాతి ఆయత్ లో ఇలా ప్రవచించెను: “వారికి లభించే ప్రయోజనం బహుస్వల్పం. వారి కోసం వ్యధాభరితమైన శిక్ష ఉంది”[నహ్ల్, 117]
అల్లాహ్ జుమర్ సూరహ్ లో ఇలా ప్రవచించెను: "అబద్ధాలకోరులకు, కృతఘ్నులకు అల్లాహ్ ఎట్టి పరిస్థితిలోను సన్మార్గం చూపడు”[జుమర్,3]
అబద్ధం చెప్పే వారిపై అల్లాహ్ శాపం ఉంటుంది. అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ప్రవచించెను: ‘ఒకవేళ తాను చెప్పేది అబద్ధమైతే తనపై అల్లహ్ శాపం పడుగాక!’ అని చెప్పాలి[నూర్, 7]
వ్యాఖ్యలు
ماشاءالله, زاد الله توفیقاته
Shukriya.. Ilaahi Ameen.
వ్యాఖ్యానించండి