అహ్లెబైత్(అ.స) అనుచరుల లక్షణాలు

శని, 06/18/2022 - 16:47

అహ్లెబైత్(అ.స) అనుచరుల లక్షణాలను వివరిస్తున్న కొన్ని హదీసుల తెలుగు అనువాదం...

అహ్లెబైత్(అ.స) అనుచరుల లక్షణాలు

ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం:
మా షియా మరియు అనుచరులు: “ధర్మనిష్ట కలిగివుంటారు, వారు (నిత్యం) ప్రయత్నిస్తూ ఉంటారు, మాటపై నిలబడతారు, ఉన్నదాంట్లోనే సంతోషపడతారు(ఆశించరు), ఒక రోజులో 51 రక్అతుల నమాజ్ చదువుతారు(వాజిబ్ నమాజులు మరియు వాటికి సంబంధించిన నాఫిలా నమాజులతో పాటు నమాజె షబ్ కలిపి 51 రక్అతులు) రాత్రుళ్లు అల్లాహ్ స్మరణలో గడుపుతారు మరియు ఉదయం పూట ఉపవాసం దీక్షను నిర్వర్తిస్తారు, తన ధనం నుండి జకాత్ ను చెల్లిస్తారు, వాజిబ్ అయిన కాబా దర్శనానికి వెళతారు మరియు ప్రతీ హరామ్ నుండి దూరంగా ఉంటారు”.[1]
ఇమామ్ రిజా(అ.స) ఉల్లేఖనం: “మా షియాలు మా ఆదేశాలను పాటిస్తారు, మా మాటల పట్ల విధేయత చూపుతారు, నా శత్రువులను వ్యతిరేకిస్తారు, అయితే ఇలా కాని వారు మా వాళ్లు కారు”.[2]
ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: “అల్లాహ్ సాక్షిగా, అలీ(అ.స) యొక్క షియా కాలేరు ఎవరైతే తమ పొట్టను మరియు పొట్ట క్రింది భాగాన్ని కాపాడుకునేవారు, కార్యములను అల్లాహ్ కోసం చేయువారు మరియు ఆయన నుండే ఫలితాన్ని ఆశించేవారు, ఆయన శిక్ష పట్ల భయం కలిగివున్నారు తప్ప”.[3]
ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: “నిస్సందేహంగా అలీ(అ.స) యొక్క షియా, వారి పొట్టలు ఖాలీగా మరియు వారి పెదాలు పొడిగా ఉంటాయి, వారు సున్నిత మనస్కులు, ప్రేమానురాగాలు గలవారు, జ్ఞానులు మరియు ఔదార్యం కలిగివున్నవారు, వారి పవిత్రతలో ప్రసిద్ధులు...”[5]
ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) యొక్క హదీస్ ప్రకారం షియాలు 10 ప్రత్యేకతలు కలిగి ఉన్నారు.. 1. అంతిమ దినం పట్ల గట్టి నమ్మకం కలిగి ఉంటారు, 2. అల్లాహ్ పట్ల ఇష్టం కలిగివుంటారు, 3. తమ చర్యల పట్ల పరిశీలన కలిగివుంటారు, 4. దాతృత్వం కలిగివుంటారు, 5. 51 రక్అత్లు చదువుతారు, 6. నమాజ్ ను దాని ఉత్తమ సమయంలో చదువుతారు, 7. అరుపులు కేకలకు దూరంగా ఉంటారు, 8. అత్యాశ కలిగు ఉండరు, 9. వైరానికి దురంగా ఉంటారు, 10. ఆహారం విషయంలో చాలా జాగ్రత్త వహిస్తారు, 11. మార్గభ్రష్టతకు గురి చేసే అంశాల నుండి దూరంగా ఉంటారు, 12. ఉత్తమ రీతి కలిగి ఉంటారు.  

రిఫరెన్స్
1. సిఫాతె షియా, షేఖ్ సదూఖ్, పేజీ15, ఇంతెషారాతె గుల్ హాయె బెహిష్త్, 1387.
2. సిఫాతె షియా, షేఖ్ సదూఖ్, పేజీ16, ఇంతెషారాతె గుల్ హాయె బెహిష్త్, 1387.
3. సిఫాతె షియా, షేఖ్ సదూఖ్, పేజీ25, ఇంతెషారాతె గుల్ హాయె బెహిష్త్, 1387.
4. సిఫాతె షియా, షేఖ్ సదూఖ్, పేజీ30, ఇంతెషారాతె గుల్ హాయె బెహిష్త్, 1387.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
12 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9