నజాసత్ పట్ల కొన్ని సూత్రాలు

ఆది, 06/19/2022 - 16:56

నజాసత్ విషయంలో మన జీవితంలో చాలా ప్రభావితమైన మూల సూత్రాల వివరణ...

నజాసత్ పట్ల కొన్ని సూత్రాలు

నజాసాత్ (అశుద్ధం మరియు మలినం) విషయంలో ప్రత్యేక ప్రభావాన్ని చూపేటువంటి ఒక సూత్రం; అదేమిటంటే “کُلُّ شیء طاهر” అనగా ప్రతీదీ పవిత్రమైనది. ఈ సూత్రంతో పాటు మరి కొన్ని సూత్రాలు ఉన్నాయి వాటి గురించి ఇక్కడ సంక్షిప్తంగా తెలుసుకుందాం

మొదటి సూత్రం: “کل شئی کان طاهرا فیما مضی ثم تشک”  ఒక వస్తువు ముందు పాక్ గా ఉంది కాని తరువాత నజిసా లేదా ఇంతకు ముందులానే పాక్ గానే ఉందా అని సందేహం ఏర్పడింది. అలాంటి సమయంలో అది పాక్ అవుతుంది.

ఉదాహారణకు మీరు పడుకునే మంచం ముందు పాక్ గా ఉంది, ఇప్పుడు మీకు సందేహం ఏర్పడింది నజాసత్ ద్వార ఇది అశుద్ధమయ్యిందా లేక ముందు ఎలా శుద్దంగా ఉండిందో అలాగే ఉందా? అని. అలాంటప్పుడు నీవు పడుకునే మంచం పాక్ మరియు శుద్ధమైనదే అని భావించాలి.

రెండవ సూత్రం: “کل شئی کان نجسا فیما مضی ثم تشک”  ఒక వస్తువు ముందు నజిస్ గా ఉంది కాని తరువాత సందేహం ఏర్పడింది ఇది పాక్ అయ్యిందా లేక ఇంతకు ముందులానే నజిస్ గానే ఉందా అని. అలాంటి సమయంలో దానిని నజిస్ గానే భావించాలి.

ఉదాహారణకు నీ చెయ్యి నజిస్ అయ్యింది. నీకు పూర్తి నమ్మకం కూడా ఉంది నా చెయ్యి నజిస్ అని. ఆ తరువాత నీకు సందేహం ఏర్పడింది మునుపటి నజాసత్ నుండి శుద్ధమయ్యిందా లేక అశుద్ధంగానే ఉందా? అని. అలాంటప్పుడు నువ్వు నీ చెయ్యి నజిస్ అని భావించాలి.

మూడవ సూత్రం: “کل شئی لا تعلم حالتها السابقه” ఒక వస్తువు ఇంతకు ముందు అది ఏ స్థితిలో ఉందో తెలియదు. అది నజిసా లేక పాకా? అని తెలియదు అలాంటి సమయంలో దానిని పాక్ గానే భావించాలి.

ఉదాహారణ: ఒక కప్పులో ఒక పారే ద్రవం ఉంది దాని గురించి నీకు తెలియదు ఇది ఇంతకు ముందు నజిసా లేదా శుద్ధమైనదా? అని. అలాంటప్పుడు ఇది పాక్ మరియు శుద్ధమైనది గా భావించాలి.

నాలుగొవ సూత్రం: “کل شیء تشکّ، هل أصابته نجاسة فتنجّس بها أو أخطأته فلم تُصِبه” ఏ వస్తువు గురించి అయితే దానికి నజాసత్ అంటుకుందా లేదా? అన్న సందేహం కలిగినప్పుడు అది శుభ్రమైనదే (నజిస్ కాదు) అని భావించాలి. ఇక దాని శుభ్రత పై నమ్మకం కలగడానికి దాని గురించి పరిశోధనలు మరియు పరిశీలనలు చేయాల్సిన అవసరం లేదు. అది శుభ్రమైనది అని చెప్పబడుతుంది. మీకు పరిశీలన చేయడం శులభమైనా సరే పరిశీలనవసరం లేదు.

ఉదాహారణ: నీ బట్టలు శుభ్రమైనవి అని నీకు ముందు నుంచి నమ్మకం ఉంది. ఇక ఇప్పుడు దాని పై మూత్రము చక్కలు ఏమైనా పడ్డాయా లేక ఇంతకు ముందు శుభ్రంగా ఉన్నట్లే ఉన్నాయా? అని సందేహం కలిగింది. ఇలాంటి పరిస్థితిలో నీ బట్టల గురించి పరిశీలన చేయడం అవసరం లేదు, ఒక వేళ పరిశోధన చేయడానికి వీలు ఉన్నా సరే. ఇలాంటప్పుడు “నా బట్టలు శుభ్రమైనవి” అని భావించాలి.

ఒక విశ్వాసికి ఈ మూల సూత్రాల పట్ల జ్ఞానం ఉంటే, అతడు నజాసత్ విషయంలో చాలా సులువుగా ఎటువంటి సందేహం లేకుండా షరా ఆదేశాలను అనుచరించగలడు.

రిఫరెన్స్
1. అల్ ఫతావా అల్ ముయస్సిరహ్, ఆయతుల్లాహ్ సీస్తానీ, మరత్తబ్: అబ్దుల్ హాదీ ముహమ్మద్ తఖీ అల్ హకీమ్, పేజీ14.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13