నీరు మరియు దాని అహ్కాములు-1

సోమ, 06/20/2022 - 14:32

నీరు, దాని రకాలు మరియు దానికి సంబంధించిన అహ్కాముల సంక్షిప్త వివిరణ...

నీరు మరియు దాని అహ్కాములు

ఈ చర్చలో నజిస్ అయినవాటి శుభ్రత తిరిగి ఎలా లభిస్తుంది?. అన్న విషయం తెలుసుకుందాం.

ప్రశ్న: “శుభ్రమైన వస్తువులు అశుభ్రమైన(నజాసత్) వాటితో కలిస్తే వాటి శుభ్రత పోతుంది” అయితే వాటి శుభ్రత తిరిగి ఎలా పొందగలము?” (అవి తిరిగి ఎలా శుభ్రమౌతాయి).
సమాధానం: మలినమైన వాటిని నీళ్లతో శుభ్రపరచడం సాధ్యం, నీళ్ల ద్వార మలినమైన(నజిస్) వస్తువుల నుండి వాటి  మలినాన్ని మరియు నజాసత్ ను దూరం చేయవచ్చు. అందుకని ఈ రోజు చర్చ నీళ్ళతో మొదలవుతుంది.

నీరు
శుభ్రపరిచే యోగ్యత గల వాటిలో మొదటిది: నీరు.
నీరు రెండు రకాలు “మత్లఖ్” నీరు మరియు “ముజాఫ్” నీరు.

ప్రశ్న: “ముత్లఖ్” నీరు అంటే ఏ రకమైన నీరు?
సమాధానం: ముత్లఖ్(స్వచ్ఛమైన) నీరు అనగా మనిషి త్రాగే నీరు, జంతువులు త్రాగే నీరు, పొలాలకు ఉపయోగించే నీరు... సముద్రపు నీరు, నదుల నీరు, కాలువల నీరు, బావుల నీరు మరియు వర్షం నీరు.... నీళ్ల ట్యాంకులతో కనెక్ట్ చేసి ఊళ్లలో మరియు గ్రామాలలో నీళ్లు సరఫరా చేసే ట్యాపు నీళ్లు., ఒకవేళ అందులో కొద్దిగా మట్టి మరియు ఇసక ఉన్నప్పటికీ అవి ముత్లఖ్ అనగా స్వచ్ఛమైన నీళ్లు అనే అనబడతాయి, నదులు మరియు కాలువల నీళ్లు మాదిరి.

ప్రశ్న: “ముజాఫ్” నీళ్లు దేన్ని అంటారు?
సమాధానం: ముజాఫ్ నీళ్లు అనేటప్పుడు, నీళ్లను మరో పదంతో కలిపి వాడబడుతుంది, ఇలా శులభంగా అర్థమౌతుంది ఉదాహారణ: గులాబీ నీళ్లు, దానిమ్మ నీళ్లు, ద్రాక్ష నీళ్లు, క్యారెట్ నీళ్లు మరియు పుచ్చకాయ నీళ్లు(జ్యూస్) అంటే ఇతర వాటి నుండి పిండిన నీళ్లు(జ్యూస్). ఉదాహారణలలో చూసినట్లు ఇక్కడ నీళ్లు అనగా హదస్ ను దూరం చేసుకునే మరియు శుభ్రపరుచుకునే మరియు త్రాగే నీళ్లు కావు. ఈ దానిమ్మ నీళ్లు లేదా ద్రాక్ష నీళ్లతో హదస్ ను దూరం చేసుకోలేము.

ముత్లఖ్ నీళ్లు రెండు రకాలు:
1. మహ్‌ఫూ‌జ్ (సురక్షితమైన)
2. గైరు మహ్‌ఫూజ్ (అసురక్షితమైన)

ప్రశ్న: మహ్‌ఫూ‌జ్(సురక్షితమైన) అనగానేమి?
సమాధానం: “మహ్‌ఫూ‌జ్” (సురక్షితమైన) అనగా అందులో మలినం(నజాసత్) పడిన తరువాత దాని రంగు, రుచి మరియు వాసన మారనంత వరకు అశుభ్రం (నజిస్) కానటువంటి నీళ్లు... “గైరు మహ్‌ఫూ‌జ్” (అసురక్షితమైన) అనగా అందులో మలినం(నజాసత్) పడిన వెంటనే అశుభ్రం(నజిస్) అయ్యే నీరు. ఆ నీటిలో మూడు లక్షణాల(రంగూ, రుచీ మరియు వాసన) నుండి ఏది కనిపించకపోయినా సరే (అది నజిస్ అవుతుంది).

ప్రశ్న: నీళ్ల రకాలు?
సమాధానం: మహ్‌ఫూ‌జ్ (సురక్షితమైన) నీళ్లు కొన్ని రకాలు, వాటి వివరణ:
1. కసీర్ నీళ్లు
కసీర్ నీళ్లు అనగా ఒక కుర్(పరిమాణం పేరు) నీళ్లకు సమానమైది అనగా 36 అడుగుల స్క్వేర్ క్యూబ్ గల గొతిలో పట్టే నీళ్లు; దాన్ని కుర్ నీళ్లు అంటారు. ఉదాహారణకు గ్రామాలకు ట్యాపుల ద్వార వచ్చే పెద్ద పెద్ద నీళ్ల ట్యాంకుల నీళ్లు లేదా మోటరు ద్వార తోడి ఇంటి పై నింపే మన ఇళ్ల ట్యాంకు నీళ్లు. ఈ ట్యాంకుల నుండి ట్యాపుల ద్వార ఆగకుండా వచ్చే టప్పుడు అవి కుర్ నీళ్లు అవుతాయి.
2. బావి నీళ్లు
3. పారే నీళ్లు

ఉదాహారణకు కాలువ, నదులు మరియు ఫౌంటెన్ నీళ్లు
4. వర్షం నీరు
వర్షం తీవ్రంగా కురుస్తున్నప్పటి నీళ్లు మహ్‌ఫూ‌జ్(సురక్షితమైన) నీళ్లు అనబడుతుంది.

ప్రశ్న: గైరు మహ్‌ఫూ‌జ్(అసురక్షితమైన) నీళ్లు, ఏ నీళ్లును అంటారు?
సమాధానం: కుర్ కన్న తక్కువ నీరు ఉన్న చిన్న చిన్న కొలనులు, గొతులు లేదా పాత్రలు మొదలగువాటిలో ఉన్న నీళ్లు (బావి నీరు తప్ప), ఇస్లాం పరిభాషలో ఇటువంటి నీళ్లను “ఖలీల్” నీరు అంటారు, అంటే తక్కువ నీళ్లు. ఇంతకు ముందు చెప్పినట్లు ఇటువంటి నీళ్లు మలినం(నజాసత్) పడగానే ఆ నీరు నజిస్(మలినం) అవుతుంది.[1]

రిఫరెన్స్
1. అల్ ఫతావా అల్ ముయస్సిరహ్, ఆయతుల్లాహ్ సీస్తానీ, మరత్తబ్: అబ్దుల్ హాదీ ముహమ్మద్ తఖీ అల్ హకీమ్, పేజీ14.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 4