నజిస్ వస్తువులను శుభ్రపరిచే సాధనలలో సూర్యుడు మరియు భూమి అని ముజ్తహిదీన్ లు అహ్లైబైత్(అ.స) రివాయతుల ద్వారా నిర్ధారించారు...

నజిస్ వస్తువులను శుభ్రపరిచే సాధనలలో సూర్యుడు మరియు భూమి అని ముజ్తహిదీన్ లు అహ్లైబైత్(అ.స) రివాయతుల ద్వారా నిర్ధారించారు.
సూర్యుడు
ప్రశ్న: సుర్యుడు ఏఏ వస్తువులను శుభ్ర పరుస్తాడు?
సమాధానం: నేలను శుభ్ర పరుస్తాడు. భూమిపై ఉన్న ఇళ్లు మరియు నాలుగు గోడలు కలిగివుండే నిలయాలు, వాటికి సంబంధించిన తాటి చాపలు మరియు వేరే చాపలు మొ.. వాటి దారాలు అవి ఇందులో రావు. తలుపులు, కర్రలు, మేకులు, చెట్లు వాటి ఆకులు, గడ్డీ, ఫలాలు (పండక ముందు) మరియు ఇవే కాకుండా నేలకు అతుక్కొని ఉన్నవన్నీ కూడా ఒకటే. (అనగా వాటిని సూర్యుడు శుభ్ర పరుస్తాడు).
ప్రశ్న: సుర్యుడు, నేలను మరియు ఇళ్లను ఎలా శుభ్ర పరుస్తాడు?
సమాధానం: సూర్య కిరణాలు వాటిపై పడాలి మరియు దాని ద్వార అవి ఎండిపోవాలి, దాంతో పాటు నేల మరియు ఇళ్ల నుండి నజిస్ పదార్దం పోవాలి.
ప్రశ్న: ఒకవేళ నజిస్ నేల ఎండిపోయి ఉంటే దాన్ని సూర్యుడి ద్వార ఎలా శుభ్ర పరచగలం?
సమాధానం: దాని పై నీళ్లు పోయాలి, ఆ తరువాత సూర్యకిరణాలు దానిపై పడి దాన్ని ఎండబెట్టాలి, అలా అది శుభ్రమవుతుంది.
ప్రశ్న: నేల మూత్రం ద్వార అశుభ్రమైనప్పుడు సూర్య కిరణాలు దాని పై పడి ఎండిపోతే నేల శుభ్రమైనట్లేనా?
సమాధానం: నేల పై మూత్రం యొక్క రంగు లేకపోతే ఆ నేల శుభ్రమైనట్లే.
ప్రశ్న: కంకరరాళ్లు, మట్లీ, బురదా మరియు రాళ్లు మొ.. ఇవి భూమి యొక్క భాగం కాబట్టి ఒకవేళ ఇవి మూత్రం ద్వార నజిస్ అయి సూర్యకిరణాల ద్వార ఎండిపోతే అవి శుభ్రమైనట్లేనా?
సమాధానం: ఒకవేళ ఇలా జరిగితే అవి శుభ్రమైనట్లే.
ప్రశ్న: ఒకవేళ నేల మరియు ఇళ్లలో పాతి ఉండే వెదురు కర్రలు నజిస్ అయితే ఏమి చేయాలి?
సమాధనం: దీని ఫత్వా, నేలకు సంబంధించిన ఫత్వా కాదు, (అంటే) సూర్యుడు వాటిని శుభ్రపరచడు.
భూమి
భూమి అనబడే ప్రతీది మతహ్హిర్(శుభ్రపరిచేది) అనబడుతుంది, ఉదాహారణకు రాళ్లు, ఇసుక, మట్టీ మొ.. ఇటుకలు లేదా సిమింటు నేల, లేదా తారు రోడ్డు లాంటివి ముతహ్హిరాత్(శుభ్రపరిచేవి) కావు. భూమి శుభ్రపరిచే యోగ్యతకలిగి ఉండడానికి షరత్తు అది పోడిగా మరియు శుభ్రంగా ఉండడం.
ప్రశ్న: ఈ భూమి శుభ్రమైనది అని ఎలా తెలుసుకోగలం?
సమాధానం: భూమి అశుభ్రమైనది అని తెలియనంత వరకు అది శుభ్రమైనది. మరి ఇలాంటి సమయంలో ఆ భూమి ముతహ్హిర్ (శుభ్రపరిచే యోగ్యత గలది) కూడాను.
ప్రశ్న: భూమి ఏఏ వస్తువులను శుభ్రపరుస్తుంది?
సమాధానం: అరికాళ్లు, చెప్పుల క్రింద భాగం. భూమిపై నడవడం లేదా దాని పై రుద్దడం ద్వార అరికాళ్లు లేదా చెప్పుల క్రింద భాగం నుంచి నజాసత్ తొలగిపోతే శుభ్రమౌతాయి; అయితే అరికాళ్లు లేదా చెప్పుల క్రింది భాగానికి అంటుకున్న ఈ నజసత్ అశుభ్రమైన భూమి నుండి అంటుకొని ఉండాలి అనగా భూమి ద్వారానే ఆ అరికాళ్లు లేదా చెప్పుల క్రింద భాగం నజిస్ అయి ఉండాలి, ఒకవేళ ఇలా కాకుండా వేరే విధంగా ఈ రెండూ నజిస్ అయినట్లైతే భూమి వాటిని శుభ్రపరచలేదు.[1]
రిఫరెన్స్
1. అల్ ఫతావా అల్ ముయస్సిరహ్, ఆయతుల్లాహ్ సీస్తానీ, మరత్తబ్: అబ్దుల్ హాదీ ముహమ్మద్ తఖీ అల్ హకీమ్, పేజీ24.
వ్యాఖ్యానించండి