అల్లాహ్ యొక్క విశిష్ట గుణవిశేషాలు

మంగళ, 01/23/2018 - 16:17

.దైవప్రవక్త[స.అ] “రహీమ్” అయితే అల్లహ్ “అర్హముర్రాహిమీన్”, దైవప్రవక్త[స.అ] “కరీమ్” అయితే అల్లాహ్ “అక్రమ్”, దైవప్రవక్త[స.అ] “హాకిమ్” అయితే అల్లాహ్ “అహ్కమ్”.

అల్లాహ్ యొక్క విశిష్ట గుణవిశేషాలు

అల్లాహ్, దైవప్రవక్త[స.అ]కు ప్రసాదించిన ప్రతీ ప్రతిష్టత, నైపుణ్యం మరియు ప్రవీణతలు; ఇవన్నీ అల్లాహ్ లో వాటికి మించి కలిగి ఉన్నాయి. ఉదా:
1. దైవప్రవక్త[స.అ] “రహీమ్” అయితే అల్లహ్ “అర్హముర్రాహిమీన్”.
దైవప్రవక్త[స.అ] గురించి ఖుర్ఆన్ ప్రవచనం: “...అతను విశ్వాసుల యెడల వాత్సల్యం కలవాడు, దయామయుడు”[తౌబహ్,128]
అల్లాహ్ గురించి ఖుర్ఆన్ ప్రవచనం: “మా ఇద్దరినీ నీ కారుణ్యంలో చేర్తుకో. నువ్వు కరుణించే వారందరిలో కెల్లా గొప్ప కరుణామయుడవు”[ఆరాఫ్,151]. మరోచోట ఇలా ఉంది: “...అల్లాహ్ యే అత్యుత్తమ రక్షకుడు. ఆయనే కరుణించే వారందరిలో కెల్లా గొప్ప కరుణాకరుడు”[యూసుఫ్,64].
2. దైవప్రవక్త[స.అ] “కరీమ్” అయితే అల్లాహ్ “అక్రమ్”.
దైవప్రవక్త[స.అ] గురించి ఖుర్ఆన్ ప్రవచనం: “నిస్సందేహంగా ఇది(ఈ ఖుర్ఆన్) గౌరవనీయులైన ప్రవక్త వాక్కు, ఏ కవి పుంగవుడో పలికిన మాట కానే కాదు”[హాఖ్ఖహ్,40-41]
అల్లాహ్ గురించి ఖుర్ఆన్ ప్రవచనం: “నువ్వు చుదువుతూ పో. నీ ప్రభువు దయాశీలి”[అలఖ్,3].
3. దైవప్రవక్త[స.అ] “హాకిమ్” అయితే అల్లాహ్ “అహ్కమ్”.
దైవప్రవక్త[స.అ] గురించి ఖుర్ఆన్ ప్రవచనం: “(ఓ ప్రవక్తా!) అల్లాహ్ మీకు చూపిన విధంగా మీరు ప్రజల మధ్య తీర్పు చెయ్యటానికిగాను మేము నీ వైపుకు ఈ గ్రంథాన్ని సత్యంతోపాటు పంపాము”[నిసా,105].
అల్లాహ్ గురించి ఖుర్ఆన్ ప్రవచనం: “ఏమిటి, అధికారులందరికంటే అల్లాహ్ గొప్ప అధికారి కాడా!?”[తీన్,8].     

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 19