నజిస్ వస్తువులను శుభ్రపరిచే వాటిలో ఇంతెఖాల్- ఇస్తిహాలహ్- ఇన్ఖిలాబ్- ఇస్తిబ్రా లు యొక్క అర్థాలు ఏమిటి అన్న విషయం పై సంక్షిప్త వివరణ...

నజిస్ వస్తువులను శుభ్రపరిచే వాటిలో ఇంతెఖాల్- ఇస్తిహాలహ్- ఇన్ఖిలాబ్- ఇస్తిబ్రా లు యొక్క అర్థాలు ఏమిటి అన్న విషయం పై సంక్షిప్త వివరణ...
ఇంతెఖాల్ (బదిలీ చేయబడడం)
మనిషి రక్తం దోమల, ఈగల మరియు పేనుల ఆహారం అయినప్పుడు, మరి ఇవి ఎలాంటి సూక్ష్మ క్రిముల నుంచి అంటే సాధారణంగా వీటి రక్తాన్ని, రక్తంగా భావించరు. ఇలాంటి జీవులు, రక్తాన్ని పీల్చినప్పుడు వాటి కడుపు రక్తంతో నిండుతుంది, ఆ తరువాత నువ్వు దాన్ని చంపావు దాని రక్తం నీ బట్టలకు అంటుకుంది లేదా నీ శరీరం పై అంటుకుంది, ఇలాంటి రక్తం పాక్(శుభ్రమైనది) రక్తం (ఈ రక్తం నజిస్ కాదు).
ఇస్తిహాలహ్(ఒక స్థితి నుంచి మరో స్థితికి మారడం)
ప్రశ్న: ఇస్తిహాలహ్ అనగానేమి?
సమాధానం: ఒక వస్తువు మరో వస్తువుగా మారిపోవడం, దీన్నే ఇస్తిహాలహ్ అంటారు. కేవలం దాని పేరు లేదా దాని లక్షణాలు మారిపోవడం లేదా కేవలం దానిని భాగాలుగా విడదీయడం అని కాదు దీని అర్థం. అది పూర్తిగా మరో వస్తువుగా మారిపోవడం, ఇక అది వేరే వస్తువుకు నిదర్శనం అవ్వాలి అప్పుడు దాన్ని ఇస్తేహాల సంభవించింది అని అంటారు.
ప్రశ్న: దయచేసి ఉదాహారణ ద్వార వివరించండి.
సమాధానం: ఒక నజిస్ కర్ర ముక్క పూర్తిగా కాలిపోయి బూడిదగా మారిపోతే ఇక ఇప్పుడు ఆ బూడిద శుభ్రమైనది. మరి ఇదే విధంగా జంతువుల మలం మంట కోసం ఉపయోగించినప్పుడు పొయ్యిలో బూడిదగా మారినప్పుడు అది శుభ్రమైనదిగా మారుతుంది. ఇలాంటి చాలా ఉదాహారణలు ఉన్నాయి.
జపా రక్తం
షరా పరంగా జపా చేయబడిన జంతువుల నుండి సహజంగా బయటకు రావలసినంత రక్తం వచ్చిన తరువాత ఇక లోపల మిగిలిన రక్తం, ఇది శుభ్రమైన రక్తం.
ఇన్ఖిలాబ్
మద్యం, వెనిగర్ గా మారిపోవడం, మద్యం తన రూపంలో ఉన్నంత వరకు అది నజిస్ గా ఉంటుంది కాని మద్యం, వెనిగర్ గా మారిపోగానే అది శుభ్రమైపోతుంది.
మలం తినే జంతువుల ఇస్తిబ్రా
మనిషి మలం తినే అలవాటు పడిన హలాల్ మాంసపు జంతువు యొక్క మాంసం తినడం మరియు దాని పాలు త్రాగడం హరామ్ చర్యగా పరిగణించబడినది. అదే విధంగా ఆ జంతువు యొక్క మూత్రం, మలం, చెమట మరియు దాని శరీరం కూడా నజిస్ గా మారుతాయి.
ప్రశ్న: మలం తినే జంతువు యొక్క ఇస్తిబ్రా ఏ విధంగా చేయబడుతుంది?
సమాధానం: ఆ జంతువును మలం తినే జంతువు కాకుండా జంతువు అని అనబడేంత వరకు దాన్ని మలం తినకుండా ఆపాలి.
ప్రశ్న: అయితే అప్పుడు(ఇస్తిబ్రా తరువాత) దాని పరిస్థితి ఏమిటి?
సమాధానం: ఇస్తిబ్రా తరువాత ఆ జంతువు మాంసం, పాలు మరియు పై చెప్పబడినవన్నీ శుభ్రమైనవి అని భావించబడతాయి.
రిఫరెన్స్
1. అల్ ఫతావా అల్ ముయస్సిరహ్, ఆయతుల్లాహ్ సీస్తానీ, మరత్తబ్: అబ్దుల్ హాదీ ముహమ్మద్ తఖీ అల్ హకీమ్, పేజీ24.
వ్యాఖ్యానించండి