జనాబత్ పై చర్చ

మంగళ, 06/28/2022 - 10:14

జనాబత్ అనగానేమి, అది ఎలా సంభవిస్తుంది, జనాబత్ స్థితి నుండి బయటబడాలంటే ఏమి చేయాలి అన్న విషయం పై సంక్షిప్త వివరణ...

జనాబత్ పై చర్చ

జనాబత్ అనగానేమి, అది ఎలా సంభవిస్తుంది, జనాబత్ స్థితి నుండి బయటబడాలంటే ఏమి చేయాలి అన్న విషయం పై సంక్షిప్త వివరణ:

ఇంతకు ముందు నజాసాత్(అశుభ్రమైన, మలినమైన) చర్చలో, నజాసాత్ గురించి., అవి మన శరీరం మరియు వస్తువులన్నీటి యొక్క మొదటి స్థితిలో ఉన్న శుభ్రతను అంతం చేస్తాయి అని చెప్పాను.

ఆ తరువాత తహారత్(శుభ్రపరచడం) యొక్క చర్చలో ముతహ్హిరాత్ అంటే నజిస్ గా మారిన వస్తువులను తిరిగి శుభ్రపరుస్తాయి. నిజానికి కొన్ని అంశాలు ఆత్మకు సంబంధించినవి అయి ఉంటాయి, వాటిని స్పర్శించలేము అవి సంభవిస్తే మనిషి శుభ్రత పోతుంది, ఆ తరువాత ఆ శుభ్రత తిరిగి పొందడానికి కొన్ని చర్యలు అవసరం.

(ఆ సంభవించే వాటిని హదస్ అంటారు)

హదస్ రెండు రకాలు. 1. హదసె అక్బర్ (పెద్ద హదస్) 2. హదసె అస్గర్ (చిన్న హదస్)

హదసె అక్బర్
ఉదా: జనాబత్, హైజ్, నిఫాస్, ఇస్తిహాజా కసీరహ్, మసె మయ్యత్ మరియు మయ్యత్

హదసె అస్గర్
ఉదా: మూత్రవిసర్జన, మల విసర్జన, పిత్తులు, నిద్ర మరియు ఇస్తిహాజా ఖలీలహ్ మొ..

హదసె అక్బర్(పెద్ద సంభవం)లో గుస్ల్ స్నానం లేదా దానికి బదులుగా తయమ్ముమ్ చేయాలి. హదసె అస్గర్(చిన్న సంభవం)లో ఉజూ లేదా దానికి బదులుగా తయమ్ముమ్ చేయాలి. తరువాత జరిగే చర్చలో వాటి గురించి విడివిడిగా చర్చించుకుందాం. ఈరోజు మనం మన చర్చను జనాబత్ తో మొదలుపెడదాం.

ప్రశ్న: జనాబత్ ఎలా తెలుస్తుంది అన్న విషయం గురించి వివరించండి?
సమాధానం: ఈ రెండు విషయాల నుండి ఏదో ఒకదాని ద్వార నిరూపితమౌతుంది.

మొదటిది:
వీర్యం బయటకు రావడం ద్వార, అది సంభోగం ద్వార కావచ్చు లేదా, ఎహ్తెలామ్ ద్వార లేదా ఏదో తెలియని కారణాల ద్వార మొ.. వచ్చినా సరే.

ప్రశ్న: వీర్యం యొక్క లక్షణాలు మరియు చిహ్నాలు ఏమిటి?
సమాధానం: చిక్కగా, జిగురు రూపంలో ఉంటుంది, దాని వాసన, పాడైపోయిన పిండిలో వచ్చే వాసన మాదిరి ఉంటుంది, తెల్లగా ఒక్కో సారి దాని రంగు కొంచెం పసుపు లేదా ఎరుపు రంగులో ఉంటుంది. యవ్వనం(బులూగ్) తరువాత లైంగిక కోరిక కారణంగా ఎగిరి మరియు శరీరంలో బలహీనత కలిగించడంతో పాటు బయటకు వస్తుంది.

ప్రశ్న: బయటకు వచ్చిన ఈ జిగురు పదార్ధం పై ఇది వీర్యమా లేదా వేరే ఏదైనా పదార్థమా అని సందేహం కలిగితే ఏమి చేయాలి?
సమాధానం: దానికి మూడు సంకేతాలు ఉన్నాయి, ఈ మూడు సంకేతాలు కూడా కనిపిస్తే అప్పుడు ఆ పదార్థం వీర్యం అవుతుంది. ఆ సంకేతాలు; 1. (కామ)కోరికతో రావడం 2. ఎగిరి(వేగంగా) బయటకు రావడం 3. శరీరం నీరసపడిపోవడం. అనారోగ్యంతో ఉంటే కోరికతో రావడమే చాలు.

ప్రశ్న: ఒకవేళ ఈ లక్షణాలలో ఒకటో రెండో కనిపిస్తే ఏమి చేయాలి?
సమాధానం: అయితే ఇది వీర్యం కాదు అని అనుకోవాలి, అనారోగ్యంగా ఉన్నప్పుడు తప్ప.

ప్రశ్న: మగాళ్ల మాధిరి స్ర్తీలకు కూడా వీర్యం పడుతుందా?
సమాధానం: ఔను స్ర్తీ యోని నుంచి (కామ)కోరిక ద్వారా బయటకు వస్తే అది కూడా మగాళ్ల వీర్యం ఆదేశం క్రమంలో వస్తుంది, అది నిద్రలో బయటకొచ్చినా సరే లేదా మెలుకువగా ఉన్నప్పుడు వచ్చినా సరే.

రెండవది:
లైంగిక సంబంధం ద్వార ఒకవేళ వీర్యం బయటకు రాకపోయినా సరే, కేవలం పురుషాంగం స్ర్తీ యొక్క యోనిలో ప్రవేశిస్తే చాలు.

ప్రశ్న: వీర్యం బయటకు వచ్చినా లేదా లైంగిక సంబంధం ఏర్పడినా అప్పుడు ఏమి చేయాలి?
సమాధానం: చిన్నా పెద్దా అన్న తేదా లేకుండా కర్తా మరియు కర్మా లందరి పై జనాబత్ సంభవిస్తుంది. అలాగే సాధారణ వ్యక్తి మరియు పిచ్చివాడు, ప్రాణాలతో ఉన్న వాడు మరియు ప్రాణాలతో లేనివాడు అన్నదానిలో తేడా లేదు(అందరికి సంభవిస్తుంది).

ప్రశ్న: జనాబత్ సంభవించినప్పుడు ఏమి చేయాలి?
సమాధానం: నమాజ్ చేయాలంటే గుస్ల్ స్నానం చేయడం వాజిబ్ అవుతుంది. ఉదా; హజ్ లో తవాఫ్ చేయడం కోసం గుస్ల్ వాజిబ్ అవుతుంది, ఎందుకంటే నమాజ్ మరియు తవాఫ్ లు సరిగా గుస్ల్ స్నానం చేయడం పై ఆధారపడి ఉంది. గుస్ల్ ఎలా చేయాలి అన్న విషయం పై తరువాత చర్చించబడుతుంది.[1]

రిఫరెన్స్
1. అల్ ఫతావా అల్ ముయస్సిరహ్, ఆయతుల్లాహ్ సీస్తానీ, మరత్తబ్: అబ్దుల్ హాదీ ముహమ్మద్ తఖీ అల్ హకీమ్, పేజీ24.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 19