ఇమామ్ ముహమ్మద్ తఖీ(అ.స) మరణానికి కారణం ఏమిటి అన్న విషయం పై సంక్షిప్త వివరణ...
ఇమామ్ ముహమ్మద్ తఖీ(అ.స), దైవప్రవక్త యొక్క 9వ ఉత్తరాధికారి మరియు షియా వర్గం యొక్క 9వ ఇమామ్ కూడా. వారి పేరు ముహమ్మద్ మరియు బిరుదు తఖీ మరియు జవాద్. వారి కున్నియత్ అబూ జాఫర్.
వారు హిజ్రీ యొక్క 195వ సంవత్సరం, మదీనహ్ పట్టణంలో జన్మించారు. వారి తండ్రి పేరు హజ్రత్ ఇమామ్ రిజా(అ.స), తల్లి పేరు సబీకా.
వారి కాలంలో అధికారంలో ఉన్న ఖలీఫాలు; మామూన్, మొఅతసిమ్ వీరిద్దరూ బనీ అబ్బాస్ కు చెందినవారు. దుర్మార్గపు ఖలీఫాలు.[1]
ఇమామ్ తన చిన్న వయసులోనే అప్పటి వేర్వారు ఉలమాలతో చర్చలు చేశారు, ఉదాహారణకు అహ్లె సున్నత్ యొక్క గొప్ప ఆలిమ్ తో చర్చ[2], యహ్యా ఇబ్నె అక్సమ్ తో చర్చ[3] ఇవే కాకుండా న్యాయాధికారులు చేసిన తప్పులను సరిదిద్దారు. ఇమామత్ పట్ల విశ్వసాన్ని ప్రజలలో బలపరిచారు మరియు దాన్ని నిరూపించారు. వాటిలో ఒకటి ఆస్థాన ఫఖీహ్ అయిన “ఇబ్నె అబీ దావూద్” యొక్క తప్పును స్పష్టం చేయడం.
వారి షహాదత్ సంఘటన
దొంగతనానికి పాలు పడ్డ ఒక వ్యక్తి తాను దొంగతనం చేశాను అని ఒప్పుకొని మొఅతసిమ్ ను తన పై షరా చట్టం పరంగా శిక్ష వేసి అతడ్ని తాను చేసిన తప్పు నుండి శుద్ధి చేయమని కోరాడు.
మోఅతసిమ్ ఫఖీహ్ లందరినీ ఆహ్వానించాడు, వారితో పాటు ఇమామ్ ను కూడా రమ్మని కోరాడు. వారందరితో ఈ దొంగ చేతులు ఎక్కడ నుండి కోయాలి? అని ప్రశ్నించాడు.
అక్కడికి విచ్చేసిన బగ్దాద్ న్యాయమూర్తి అయిన “ఇబ్నె అబీ దావూద్” ఇలా ఉల్లేఖించెను: “నేను ఇలా అన్నాను: చేతి మణికట్టు నుండి కోయాలి”
మొఅతసిమ్: ఏ ఆధారంతో?
నేను: ఎందుకంటే అల్లాహ్ తయమ్ముమ్ ఆయత్ లో (సూరయె మాయిదహ్ యొక్క 5వ ఆయత్ లో) “ఆ తరువాత ముఖం మరియు మీ చేతులను మస్హ్ చేయండి (మణికట్టు నుండి) అని ఆదేశించెను. అక్కడున్న ఫఖీహ్ ల నుండి కొందరు నా మాటను సమర్ధించారు మరి కొందరు మోచేయి నుండి కోయాలి అని అన్నారు.
మొఅతసిమ్: ఏ ఆధారంతో?
వారిలా అన్నారు: ఎందుకంటే అల్లాహ్ ఉజూ ఆయత్ లో “ఆ తరువాత ముఖాన్ని మరియు మీ చేతులను మోచేయ్యి వరకు కడుక్కోండి”[మాయిదహ్, ఆయత్6] అని ఆదేశించాడు. చేయి అనగా మోచెయ్యి వరకు అని అర్ధం.
మొఅతసిమ్ ఇమామ్ జవాద్(అ.స) వైపు చూసి వారితో ఇలా ప్రశ్నించాడు: ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు?
ఇమామ్ జవాద్(అ.స): ఇతరులు చెప్పారు కదా ఇక నన్ను దీని సమాధానం విషయంలో క్షమించు.
మొఅతసిమ్, వారికి మీరు కూడా తప్పకుండా మీ సమాధానం చెప్పాల్సిందే అని పట్టుబట్టాడు.
ఐతే ఇమామ్ ఇలా అన్నారు: నువ్వు పట్టుబడుతున్నావు కాబట్టి చెబుతున్నాను, వీరందరూ తప్పు చెబుతున్నారు. కేవలం అతడి చేతి వేళ్లు కోస్తే చాలు, అతడి అరచేయి మిగిలి ఉండాలి.
మొఅతసిమ్: ఏ ఆధారంగా?
ఇమామ్ జవాద్(స.అ) ఇలా అన్నారు: ఎందుకంటే దైవప్రవక్త(స.అ) ఇలా అన్నారు.. సజ్దా చేసే టప్పుడు భూమిపై ఏడు శరీర భాగాలు ఉండాలి; (ముఖం) నొసలు, రెండు అరచేతులు, రెండు మోకాళ్లు, రెండు కాళ్లు(కాళ్ల యొక్క పెద్ద వ్రేలు). ఒకవేళ ఈ దొంగ యొక్క చేయి మణికట్ట లేదా మోచేయి నుంచి నరకబడితే ఇక సజ్దా కోసం అతడికి చేయి మిగిలి ఉండదు. అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ఉపదేశించెను: “మస్జిదులు(సజ్దా చేయు స్థానాలు) కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించబడ్డాయి. కాబట్టి (వాటిలో) అల్లాహ్ తోపాటు ఇతరులెవరినీ పిలవకండి”.[జిన్, ఆయత్18]. శరీరం యొక్క ఈ ఏడు భాగాలు కూడా సజ్దా స్థానాలు.
మొఅతసిమ్ ఇమామ్ జవాద్(అ.స) యొక్క సమాధాన్నాని సమ్మతించి, ఆ దొంగ యొక్క చేతి వేళ్లను కోయమని ఆదేశించాడు.
ఇబ్నె అబీ దావూద్ ఇలా అన్నాడు: (ఆ సమయంలో) నాకు సిగ్గుతో చచ్చిపోవాలనిపించింది.[4]
ఇదే ఇమామ్ యొక్క మరణానికి కారణం అయ్యింద. కొన్ని రోజుల తరువాత ఇబ్నె అబీ దావూద్, మొఅతసిమ్ వద్దకు వచ్చాడు, ఇమామ్ జవాద్(స.అ) పట్ల కలిగివున్న అసూయ మరియు పగ వల్ల మొఅతసిమ్ తో మీరు నువ్వు విశ్వసుల నాయకులు, మీరు అతడి మాటలను సమ్మతించడంతో ప్రజలు వారే ఖిలాఫత్ కు అర్హులు అని భావిస్తున్నారు.
ఇలాంటి మాటలతో మొఅతసిమ్ కు ఇమామ్(అ.స) చంపడానికి పధకం వేసేటట్లు చేశాడు. మొఅతసిమ్ ఆదేశానుసారం[5] ఇమామ్(అ.స) యొక్క 25 సంవత్సరాల వయసులో వారిని విషం ద్వార చంపబడ్డారు.[6]
1. సీరయె పీష్వాయాన్, పేజీ529-530
2. http://www.jonbeshnet.ir/fa/news/64037
3. http://www.jonbeshnet.ir/fa/news/13492
4. బిహారుల్ అన్వార్, అల్లామా మజ్లిసీ, నాషిర్ ఇస్లామియహ్, భాగం50, పేజీ5,6.
5. http://www.tebyan.net/newindex.aspx?pid=183059
6. బిహారుల్ అన్వార్, అల్లామా మజ్లిసీ, నాషిర్ ఇస్లామియహ్, భాగం50, పేజీ7
వ్యాఖ్యానించండి