ఉత్తమ వివాహం

శుక్ర, 07/01/2022 - 05:25

హజ్రత్ అలీ(అ.స) మరియు హజ్రత్ ఫాతెమా(స.అ) వివాహ సంఘటన ద్వార మనం నేర్చుకోవలసిన కొన్ని అంశాలు...

ఉత్తమ వివాహం

హజ్రత్ అలీ(అ.స) మరియు హజ్రత్ ఫాతెమా(స.అ) వివాహంలో మనం నేర్చుకోవడానికి చాలా అంశాలు ఉన్నాయి. ఈ దైవాదేశ వివాహంలో జీవిత భాగస్వామిని ఎన్నుకోవడం, వివాహ వేడుక మరియు మంచి కుటుంబానికి సంపూర్ణ నమూనాలు ఉన్నాయి. ఇక్కడ మేము ఆ వివాహానికి సంబంధించిన, చరిత్ర గ్రంథాలలో రచించబడ్డ హదీసుల ద్వార కొన్ని విషయాలు తెలియపరచాలనుకుంటున్నాము.

జీవిత భాగస్వామి ఎన్నిక మరియు పెళ్ళి చూపులు

ఒక కుటుంబం ఏర్పడాలంటే దానికి ముందు ఒక మంచి ఎన్నిక అవసరం. మంచి ఎన్నిక మరియు ఎదుటివారి అంగీకరణతో ఒక కుటుంబం ఏర్పడుతుంది. హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) కు చాలా సంబంధాలు వచ్చాయి, మంచి మంచి డబ్బున్నావాళ్లు, గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నవారు. వచ్చిన వాళ్లు మంచి ఇంటిలో అన్ని వసతులను ఆమెకు అనుకూలంగా ఉంచుతాము అని అన్నారు. అబూబక్ర్, ఉమర్ మరియు అబ్దర్రహ్మాన్ ఇబ్నె ఔఫ్ లు కూడా సంబంధం అడిగిన వాళ్లలో ఉన్నారు, కాని దైవప్రవక్త(స.అ) వాళ్లలో ఏ ఒక్కరికీ సమ్మతించలేదు. దైవప్రవక్త(స.అ) వాళ్లతో ఇలా అనేవారు: నా కుమార్తె వివాహం అల్లాహ్ చేతుల్లో ఉంది ఆయన ఆదేశం కొరకు వేచి ఉన్నాను.[1]

మరో వైపు హజ్రత్ ఇమామ్ అలీ(అ.స) మంచి సంబంధం కోసం వెతుకుతున్నారు, ఎవరితో పడితే వారితో రాజీ పడేవారు కాదు, అయితే వారు ఎక్కువ ధనం కూడా కలిగిలేరు. ముహాజిరీనులు హజ్రత్ జహ్రా(స.అ) యొక్క సంబంధం అడగడానికి వెళ్లమని సలహా ఇచ్చారు. కాని తన ధన స్థితిని చూసి వాళ్ల సలహాను అంగీకరించలేదు. ముహాజిరీనులు వారితో దైవప్రవక్త(స.అ) నీ నుండి ఏదీ కోరరు, అన్నారు. చివరికి హజ్రత్ అలీ(స.అ) దైవప్రవక్త(స.అ) వద్దకు వెళ్లారు కాని సిగ్గు వల్ల తన కోరికను చెప్పలేకపోయారు. అలా మూడవ సారికి వారు తన కోరికను చెప్పి, హజ్రత్ జహ్రా(స.అ) సంబంధాన్ని ఆమె తండ్రితో అడిగారు. దైవప్రవక్త(స.అ) వారితో ఇలా అడిగారు: నీ దగ్గర ఏదైనా ఉందా? అలీ(అ.స) దానికి ఇలా సమాధానమిచ్చారు: యా రసూలల్లాహ్ కవచం తప్ప మరేది లేదు. దైవప్రవక్త(స.అ), హజ్రత్ ఫాతెమా ను పన్నెండున్నర(12.50) బంగారపు నాణ్యాల మెహ్ర్ తో హజ్రత్ అలీ(అ.స)కు ఇచ్చి వివాహం చేశారు మరియు వారి కవచాన్ని తిరిగి ఇచ్చేశారు.[2] వారిద్దరి వివాహం పై దైవప్రవక్త(స.అ) అంగీకారం పై ముహాజిరీనులలో కొందరు నిరాశ చెందారు, పిర్యాదు చేశారు. దైవప్రవక్త(స.అ) వారికి ఇలా సమాధానమిచ్చారు.. ఫాతెమాను అలీకు నేనివ్వలేదు., అల్లాహ్ ఆమెను అలీకిచ్చాడు[3].

సంబంధం అడిగిన వెంటనే దైవప్రవక్త(స.అ) వివాహ ఖుత్బా చదివారు(ఒక రకంగా చెప్పాలంటే వివాహ మంత్రాలు).

దీని ద్వార తెలిసిన విషయాలు:
1. మంచి కుటుంబ స్థాపన కోసం మంచి జీవిత భాగస్వామిని ఎంచుకోవడం చాలా ముఖ్యం.
2. వివాహం యొక్క షరత్తుల పట్ల సులభం మరియు మంచి సంబంధం పై అంగీకరణ దైవప్రవక్త(స.అ) సద్గుణాల నుండి.
3. సాధారణ మెహ్ర్, పెళ్లి ఏర్పాట్లు మరియు పెళ్లికొడుకు మరియు పెళ్లి కూతురు తరపు వారిద్దరు పెళ్లి వేడుక విషయంలో ఒకరినొకరు సహాయం చేసుకోవడం హజ్రత్ జహ్రా(స.అ) మరియు హజ్రత్ అలీ(అ.స) వివాహం లో మనకు కనిపిస్తాయి.
4. వివాహానికి సంబంధించినవాటన్నింటిని అల్లాహ్ పై భారం వేయడం ఉత్తమమైనది.
5. వివాహం విషయంలో ప్రజల మాటలను వారి ప్రతిచర్యలను మరియు అంగీకరణలను మన నిర్ణయంలో ప్రభావం చూపకూడదు, ఇది చాలా ముఖ్యమైన అంశం.
6. అమ్మాయి పెళ్లి విషయంలో ఆలస్యం చేయకూడదు.

మెహ్ర్

పై చెప్పిన విధంగా దైవప్రవక్త(స.అ) మెహ్ర్ విషయంలో తక్కువ మెహ్ర్ పై సమ్మతించారు. ఇమామ్ రిజా(అ.స) హదీస్ లో హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) మెహ్ర్ ను 500 దిర్హమ్(వెండి నాణాలు) కు సమానమైనది అని ఉంది.[4] ఇమామ్ అలీ(అ.స) కూడా తన మహ్ర్ కోసం తన వద్ద ఉన్న వస్తువును అమ్మి దాన్ని దైవప్రవక్త(స.అ)కు ఇచ్చారు. దైవప్రవక్త(స.అ) కూడా ఆ ఇచ్చిన సొమ్ము నుండి కొంత బిలాల్ కు ఇచ్చి ఇలా అన్నారు.. దీంతో నా కుమార్తె కోసం అత్తరు కొను. మిగిలింది అబూబక్ర్ కు ఇచ్చి ఇలా అన్నారు: ఈ డబ్బుతో నా కూతురికి అవసరమైన వాటిని సిద్ధం చేయి. అమ్మార్ మరియు సహాబీయుల నుండి కొంత మంది అబూబక్ర్ తో పాటు సామానులు కొనడానికి వెళ్లారు. హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) యొక్క జహేజ్ యొక్క లిష్టు: 7 దిర్హముల చొక్కా, 4 దిర్హముల స్కార్ఫ్, నల్ల రంగు ఖతీఫా(తువాలు లాంటిది), ఖర్జూరపు ఆకులతో అల్లిన పడక మంచం, రెండు దుప్పట్లు అందులో ఒకటి ఖర్జూరపు ఆకులతో మరొకటి గొర్రెల ఉన్నితో నింపబడినవి, నాలుగు దిండులు, ఉన్ని పరదాలు, ఒక చాప, ఒక రోకలి, ఒక రాగి బేసన్, చెక్క కప్పు, పాలు పితకడానికి ఒక గిన్నె, నీళ్ల కూజా, ఒక చెంబు, ఒక పెద్ద కుండ మరియు కొన్ని మట్టి కుండలు[5] పనికి రాని ఏ వస్తువూ వీటి లేదు అని తెలుస్తుంది.

రిఫరెన్స్
1. అల్లామా ఖజ్వీనీ, ఫాతెమా జహ్రా అజ్ విలాదత్ తా షహాదత్, పేజీ191.
2. తారీఖె తహ్ఖీఖీ-ఎ-ఇస్లాం, మొహమ్మద్ యూసుఫీ గరవీ, భాగం2, పేజీ251.
3. తారీఖె యాఖూబీ, భాగం2, పేజీ41.
4. అల్లామా మజ్లిసీ, బిహారుల్ అన్వార్, భాగం93, పేజీ170, రివాయత్10.
5. షహీదీ, జిందగానీయె ఫాతెమా జహ్రా, పజీ58-59.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
15 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16