బల్లిగ్ ఆయత్ నిదర్శనం-2

గురు, 07/07/2022 - 13:05

బల్లిగ్ ఆయత్ ఎప్పుడు ఎవరి గురించి అవతరించబడింది అన్న విషయం పై షియా వర్గం వారి గ్రంథాలనుసారం సంక్షిప్త వివరణ...

బల్లిగ్ ఆయత్ నిదర్శనం-2

ఇక ఇప్పుడు వాటితో పాటు[1] షియా ముస్లింలను కూడా చూడండి, వాళ్ళలో ఇందులో ఎటువంటి వ్యతిరేకత మరియు అభిప్రాయభేదం లేదు, మాయిదహ్ సూరాయే చివరిలో అవతరించబడిన సూరా మరి ఈ ఆయత్ (وَٱللَّهُ يَعۡصِمُكَ مِنَ ٱلنَّاسِ) దానిని “బల్లిగ్ ఆయత్” అంటారు ఇది జిల్‌హిజ్జ్ మాసం, 18వ తేదీ గురువారం రోజు హజ్జతుల్ విదా తరువాత ఖదీరె ఖుమ్ (ఖుమ్ అను మైదానం)లో హజ్రత్ అలీ(అ.స) యొక్క ఉత్తరాధికారాన్ని ప్రకటించక ముందు అవతరించబడింది, ఆ రోజు ఐదు గంటల సమయం గడిచిన తరువాత జిబ్రయీల్ ఈ ఆయత్‌ను తీసుకొని వచ్చి ఇలా అన్నారు: ఓ ముహమ్మద్! అల్లాహ్ మీకు సలామ్ చెప్పిన తరువాత ఇలా అన్నాడు:

(يَٰٓأَيُّهَا ٱلرَّسُولُ بَلِّغۡ مَآ أُنزِلَ إِلَيۡكَ مِن رَّبِّكَۖ وَإِن لَّمۡ تَفۡعَلۡ فَمَا بَلَّغۡتَ رِسَالَتَهُۥۚ وَٱللَّهُ يَعۡصِمُكَ مِنَ ٱلنَّاسِۗ إِنَّ ٱللَّهَ لَا يَهۡدِي ٱلۡقَوۡمَ ٱلۡكَٰفِرِينَ)

ఈ ఆయత్‌లో وَإِن لَّمۡ تَفۡعَلۡ فَمَا بَلَّغۡتَ رِسَالَتَهُ యొక్క సూచన చాలా స్పష్టంగా ఉంది ఇక దౌత్యం పూర్తయ్యింది లేదా పూర్తి అవుతుంది కేవలం ఒక ముఖ్య విషయం మిగిలి ఉంది అది లేకుండా దీన్ సంపూర్ణమవ్వదు మరియు దానితో పాటు ఆయత్‌లో దైవప్రవక్త‎(స.అ) ఒకవేళ ఈ ముఖ్య విషయం గురించి ప్రజలకు చెబితే నన్ను అబధ్ధం చెబుతున్నానని అంగీకరించడానికి సిధ్ధమవ్వరేమో అనే గుబులును కూడా సూచించబడింది అయినప్పుటికీ అల్లాహ్ వ్యవధి ఇవ్వలేదు, సమయం వచ్చేసింది. మరియు ఈ సమయం చాలా మంచి సమయం ఎందుకంటే ఒక వారం రోజుల నుండి ఇంచుమించు లక్ష కన్న ఎక్కువ సహాబీయులు దైవప్రవక్త‎(స.అ)తో కలిసి హజ్జ్ చేశారు మరియు వాళ్ళ హృదయాలు అల్లాహ్ చిహ్నాలతో నిండి ఉన్నాయి మరియు స్వయంగా దైవప్రవక్త(స.అ) నోటితోనే, బహుశ ఈ సంవత్సరం తరువాత నేను మీతో కలవలేనేమో, అల్లాహ్ కబురు వస్తే నేను అంగీకరిస్తానేమో, అని అతని మరణ సమయాన్ని విని ఉన్నారు. ఈ ప్రదేశం నుండే జనం వేరై తమ తమ స్వదేశాలకు తిరిగి వెళ్తారు మరియు ఇంత మంది జనసమూహం మరలా ఒకేచోట గదీరె ఖుమ్‌లో ఏకమైనట్లు అవ్వరేమో. అందుకని దైవప్రవక్త‎(స.అ) కు ఇంతకన్న మంచి సమయం దొరకదు, అల్లాహ్ తరపు నుండి ఈ సందేశాన్ని ప్రకటించకపోతే నీ దౌత్యం కష్టాలలో పడుతుంది అని దైవవాణి కూడా వచ్చింది. మరియు అల్లాహ్, రక్షణ బాధ్యతను కూడా తీసుకున్నాడు దాంతో ఇక వాళ్ళ నిరాకరణ భయం లేదు అలా చూస్తే దైవప్రవక్త‎(స.అ) కన్న ముందు ఎంత మంది ప్రవక్తలను నిరాకరించలేదు అయినా వాళ్లు తన ప్రచారాన్ని వదల లేదు ఏ ప్రచార ఆదేశం వస్తే దానిని ప్రచారించే వారు అలాగే దైవప్రవక్త‎(స.అ) కూడా ఏదైతేనేం ఆదేశాన్ని ప్రకటించాలి. అల్లాహ్‌కు తెలుసు చాలా మంది సత్యాన్ని ఇష్టపడరు అని.[జుఖ్రుఫ్ సూరా, ఆయత్:78] మరి అల్లాహ్‌కు తెలుసు అందులో నిరాకరించే వారు కూడా ఉన్నారు అని[అల్ హాఖహ్ సూరా:69, ఆయత్:49] అయినా సరే అల్లాహ్ వాళ్ళను చెప్పేంత వరకు వదిలేవాడు కాదు. దైవప్రవక్త‎(స.అ)ల రాక తరువాత, అల్లాహ్‌కు ప్రతికూలంగా వాదించటానికి ప్రజలవద్ద ఏ సాకూ మిగల కూడదని. ఎట్టి పరిస్థితులలోనైనా అల్లాహ్‌యే ఆధిక్యం కలిగివుండేవాడు, మహా వివేకవంతుడు.[అల్ నిసా సూరా 4, ఆయత్:165]

అంతే కాకుండా పూర్వ ప్రవక్తల వలే వాళ్ళ ఉమ్మతులు వాళ్ళను నిరాకరించారో అలా దైవప్రవక్త(స.అ)కు అతని ఉమ్మత్ నిరాకరిస్తే అందులో పూర్వ ప్రవక్తల ఆచరణ కూడా ఉంది. అల్లాహ్ ఇలా ప్రవచించెను:

(‏وَإِن يُكَذِّبُوكَ فَقَدۡ كَذَّبَتۡ قَبۡلَهُمۡ قَوۡمُ نُوحٖ وَعَادٞ وَثَمُودُ وَقَوۡمُ إِبۡرَٰهِيمَ وَقَوۡمُ لُوطٖ وَأَصۡحَٰبُ مَدۡيَنَۖ وَكُذِّبَ مُوسَىٰۖ فَأَمۡلَيۡتُ لِلۡكَٰفِرِينَ ثُمَّ أَخَذۡتُهُمۡۖ فَكَيۡفَ كَانَ نَكِيرِ)

అనువాదం:)(ఓ ప్రవక్తా!) వారు (అవిశ్వాసులు) నిన్ను నిరాకరిస్తున్నారంటే, వారికి పూర్వం నూహ్, ఆద్, సమూద్ జాతుల, ఇంకా ఇబ్రాహీమ్ జాతివారు, లూత్ జాతివారు, మద్యన్ వాసులు కూడా(తమ తమ ప్రవక్తలను) నిరాకరించారు, ఇంకా మూసా కూడా తిరస్కరించబడ్డారు. ఈ సత్య తిరస్కారులందరికీ మొదట్లో నేను వ్యవధినిచ్చాను, తరువాత పట్టుకున్నాను. నీవు చూశావుగా నా శిక్ష ఎంత భయంకరంగా ఉండినదో([హజ్జ్ సూరా:22, ఆయత్:42,44,45]

ఒకవేళ మేము మతపక్షపాత అంధాకారాన్ని ప్రక్కన పెట్టి, మనకు మన వర్గంపై ఉన్న ఇష్టాన్ని మరియు ప్రేమను తొలగించి చూస్తే మనకు అర్ధం అయ్యేది ఇదే. మరియు ఆయత్ యొక్క పదధోరణితో కలిసి ఉంది. ముందు మరియు తరువాత అయ్యే సంఘటనలకు కూడా సంబంధం కలిగి ఉంది.

రిఫరెన్స్
1. https://te.btid.org/node/2197

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
11 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 20