బల్లిగ్ ఆయత్ ప్రస్థావన గ్రంథాలు

గురు, 07/07/2022 - 13:19

బల్లిగ్ ఆయత్ హజ్రత్ అలీ(అ.స) యొక్క విలాయత్ కు సంబంధించిన అంశం అని అహ్లె సున్నత్ గ్రంథాలలో వివరించబడి ఉంది అని నిదర్శిస్తున్న ఉల్లేఖనలు...

బల్లిగ్ ఆయత్ ప్రస్థావన గ్రంథాలు

అహ్లె సున్నత్‌ల చాలా ఉలమాలు బల్లిగ్ ఆయత్‌ను “గదీరె ఖుమ్”లో హజ్రత్ అలీ(అ.స) యొక్క ఖిలాఫత్ ప్రకటనకు సంబంధించింది అని వివరించారు. మరి ఆ రివాయత్‌లను సరైనవిగా నిర్ధారించారు. మరి వాళ్ళు ఈ క్రమంలో షియా సోదరులతో ఏకాభీప్రాయం కలిగి ఉన్నారు. ఉదాహారణగా షియా ముస్లింల దీని పట్ల విశ్వాసాన్ని సమర్ధిస్తున్న అహ్లెసున్నతుల ఉలమాలలో కొందరి పేర్లును ఇక్కడ ప్రదర్శిస్తున్నాను:
1. అబూ ఇస్హాఖ్ సఅలబీ, తఫ్సీరె కబీర్‌లో
2. హాకిమె హస్కాని, షవాహిద్దుత్తన్జీల్ లి ఖవాయిదుత్తఫ్సీల్, భాగం1, పేజీ187.
3. జలాలుద్దీన్ సివ్తీ, తఫ్సీరు అల్ దుర్రుల్ మన్సూర్ ఫిత్తఫ్సీరి బిల్ ఉసూర్, భాగం3, పేజీ 117.
4. ఫఖ్రె రాజీ, తఫ్సీరె కబీర్, భాగం12, పేజీ 50.
5. ముహమ్మద్ అబ్దుహ్, తఫ్సీరుల్ మనార్, భాగం1, పేజీ 86 మరియు భాగం 6, పేజీ 463.
6. ఇబ్నె అసాకిరె షాఫెయీ, తారీఖె దమిష్ఖ్, భాగం2, పేజీ 86.
7. షూకానీ, ఫత్హూల్ ఖదీర్, భాగం2, పేజీ60.
8. ఇబ్నె తల్హా షాఫెయీ, మతాలిబుస్సఆల్, భాగం1, పేజీ 44.
9. ఇబ్నె సబ్బాగె మాలికీ, ఫుసూలుల్ ముహిమ్మహ్, పేజీ 25.
10. ఖందూజియే హనఫీ, యనాబీవుల్ మవద్దహ్, పేజీ 120.
11. షహ్రీస్తాని, మిలల్ వ నహల్, భాగం1, పేజీ163.
12. ఇబ్నె జురైరె తబరీ, కితాబుల్ విలాయహ్.
13. ఇబ్నె సయీదె సజిస్తాని, కితాబుల్ విలాయహ్.
14. బద్రుద్దినె హనఫీ, ఉమ్దతుల్ ఖారీ ఫీ షర్హిల్ బుఖారీ, భాగం8, పేజీ 584.
15. అబ్దుల్ వహాబె బుఖారీ, తఫ్సీరుల్ ఖుర్ఆన్.
16. హాఫిజ్ అబూ నయీమ్, నుజూలుల్ ఖుర్ఆన్
17. ఇమామ్ వాహిదీ, అస్బాబున్నుజూల్, పేజీ 150.
18. ఆలూసీ, రూహుల్ మఆనీ, భాగం2, పేజీ 384.
19. సిద్దీఖ్ హసన్ ఖాన్, ఫత్హూల్ బయాన్ ఫీ మఖాసిదిల్ ఖుర్ఆన్, భాగం3, పేజీ 63.
20. హుమ్యని, ఫరాయిదుస్సిబ్తైన్, భాగం1, పేజీ85.

ఇవి వాళ్ళలో కొందరి పేర్లు ఒకవేళ వివరంగా చూడలనుకుంటే అల్లామా అమీనీ యొక్క పుస్తకం “అల్ గదీర్”ను చదవండి.

అల్లాహ్, దైవప్రవక్త‎(స.అ) కు مَآ أُنزِلَ إِلَيۡكَ ప్రచార ఆదేశం ఇచ్చిన తరువాత మీ ఉద్దేశంలో దైవప్రవక్త‎(స.అ) ఏమి చేసి ఉంటారు?.

షియా ముస్లింలు ఇలా అంటారు: దైవప్రవక్త‎(స.అ) అందరిని ఒకేచోట అనగా “గదీరె ఖుమ్”లో ఏకం చేసి చాలా సమయోచితమైన మరియు దీర్ఘమైన ఉపన్యాసము ఇచ్చారు. ఆ తరువాత ప్రజలందరిని నేను మీపై మీ కన్న ఎక్కువ అధికారం ఉన్న వాడిని; అవునా, కాదా? అని ప్రశ్నించారు. అందరు కలిసికట్టుగా “అవునూ! మీకు మా పై మా కన్న ఎక్కువ అధికారం ఉంది” అని అన్నారు. ఆ తరువాత దైవప్రవక్త(స.అ) అలీ ఇబ్నె అబీతాబ్(అ.స) చేయ్యి పట్టుకొని పైకెత్తి ఇలా ప్రకటించారు: “నేను ఎవరికి మౌలా(స్వామి)నో అలీ(అ.స) కూడా వారి స్వామి, ఓ అల్లాహ్! అలీ(అ.స)ని ఇష్టపడిన వారిని నీవు ఇష్టపడు, మరి అలీ(అ.స)ని ద్వేషించే వారిని నీవు కూడా ద్వేషించు, అలీ(అ.స)ని సహకరించే వారిని నీవు సహకరించు, అలీ(అ.స)ని సహకరించని వారిని అప్రతిష్ఠ చెయ్యి, మరియు సత్యాన్ని, ఎటు అలీ(అ.స) ఉంటే అటు మలుచు”.[1] ఆ తరువాత అలీ(అ.స) కు అమామహ్(తలపాగ) తొడిగించారు. ఒక డేరా అలీ(అ.స) కోసం తయారు చేశారు. సహాబీయులందరికి అలీ(అ.స)ను అమీరుల్ మొమినీన్(విశ్వాసుల నాయకుడు) అని శుభాకాంక్షలు తెలియపరచమని ఆదేశించారు. సహాబీయులందరు శుభాకాంక్షలు తెలియ పరిచారు. వాళ్ళలో ముందు ముందుగా “అబూబక్ర్‎”‎ మరియు “ఉమర్”లు ఉన్నారు. మరి వాళ్ళు ఇలా అన్నారు: “ఓ అలీ(అ.స)! శుభాకాంక్షలు, శుభాకాంక్షలు మీరు పురుష మరియు స్ర్తీ విశ్వాసులందరి మౌలా(స్వామి) అయ్యారు”.[2] శుభాకాంక్షల ఆచార వ్యవహారం ముగిసిన తరువాత అల్లాహ్ ఈ ఆయత్‌ను అవతరింపజేసాడు:

(ٱلۡيَوۡمَ أَكۡمَلۡتُ لَكُمۡ دِينَكُمۡ وَأَتۡمَمۡتُ عَلَيۡكُمۡ نِعۡمَتِي وَرَضِيتُ لَكُمُ ٱلۡإِسۡلَٰمَ دِينٗا)

ఇది షియాలలో ఆమోదితమైనది ఇందులో ఏ ఒక్కరు అభీప్రాయభేదాన్ని వ్యక్తం చేయలేదు.

రిఫరెన్స్
1. దీనినే హదీసె గదీర్ అంటారు. దీనిని షియా ఉలమాలు మరియు అహ్లెసున్నత్ ఉలమాలు ఇద్దరు ఉల్లేఖించారు.
2. ముస్నదె అహ్మద్ బిన్ హంబల్, భాగం4, పేజీ281. తఫ్సీరె తబరీ. తఫ్సీరె రాజీ భాగం3, పేజీ 636. సవాయిఖుల్ ముహ్రఖహ్, ఇబ్నె హజర్. దారు ఖుత్లీ, బైహఖీ. ఖతీబె బగ్దాదీ. షహ్రీస్తానీ మొ॥ వారు  ఈ హదీసును వ్రాశారు.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 16 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 20