ఇక్మాల్ ఆయత్ నిదర్శన గ్రంథాలు

ఆది, 07/24/2022 - 09:38

ఇక్మాల్ ఆయత్ కూడా ఖిలాఫత్‌ పదవికి సంబంధించిన ఆయత్ అని అహ్లె సున్నత్ గ్రంథాలలో ఉల్లేఖించబడి ఉంది...

ఇక్మాల్ ఆయత్ నిదర్శన గ్రంథాలు

ఇక్మాల్ ఆయత్
ٱلۡيَوۡمَ أَكۡمَلۡتُ لَكُمۡ دِينَكُمۡ وَأَتۡمَمۡتُ عَلَيۡكُمۡ نِعۡمَتِي وَرَضِيتُ لَكُمُ ٱلۡإِسۡلَٰمَ دِينٗا

అనువాదం: ఈ రోజు నేను మా దీన్ ని మీ కొరకు పరిపూర్ణం చేశాను. మీ పై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను. మీ కొరకు ఇస్లాం ధర్మాన్ని ఇష్టానుసారమైనదిగా చేశాను[మాయిదహ్ సూరా:5, ఆయత్:3]

“దైవప్రవక్త(స.అ), ‘గదీర్ మైదానం’లో హజ్రత్ అలీ(అ.స) యొక్క ఖిలాఫత్ అధికార ప్రకటన తరువాత ఈ ఆయత్ అవతరించబడింది” అని షియా ముస్లింలందరూ ఏకీభవిస్తారు. మరి ఈ విషయాలను పవిత్ర అహ్లెబైత్(అ.స)ల రివాయతులతో వెల్లడిస్తారు. అందుకని షియా ముస్లింలు “ఇమామత్‌”ను ఉసూలె దీన్[1]లో లెక్కిస్తారు.

మరి అలాగే అహ్లె సున్నత్‌ల చాలా ఉలమాలు కూడా ఈ ఆయత్ అవతరించబడడానికి గల కారణం, “గదీరె ఖుమ్”లో హజ్రత్ అలీ(అ.స) ఖిలాఫత్ ప్రకటన తరువాత అని ఒప్పుకున్నారు. ఉదాహారణకు కొందరి ఉలమాల పేర్లు క్రింద వ్రాస్తున్నాను:

1. తారీఖె దమిష్ఖ్, ఇబ్నె అసాకిర్, భాగం 2, పేజీ75.
2. మనాఖిబే అలీ(అ.స), ఇబ్నె మగాజీ, పేజీ19.
3. తారీఖె బగ్ధాది, ఖతీబె బగ్ధాది, భాగం8, పేజీ92.
4. ఇత్ఖాన్, సీవ్తీ, భాగం1, పేజీ13.
5. మనాఖిబ్, ఖారజ్మి, పేజీ 80.
6. తజ్కిరతుల్ ఖవ్వాస్, సిబ్తె ఇబ్నె జౌజీ, పేజీ30.
7. తఫ్సీర్, ఇబ్నె కసీర్, భాగం2, పేజీ14.
8. రూహుల్ మఆని, ఆలూసి, భాగం6, పేజీ55.
9. బిదాయహ్ వనిహాయహ్, ఇబ్నె కసీరె దమిష్ఖీ, భాగం3, పేజీ213.
10. దుర్రె మన్సూర్, సివ్తీ, భాగం3, పేజీ19.
11. యనాబీవుల్ మువద్దహ్, ఖన్దూజీ హనఫీ, పేజీ 115.
12. షవాహిదుల్ తన్జీల్, హస్కాని, భాగం1, పేజీ157.

ఇవే కాకుండా మరెన్నో గ్రంథాలలో ఇక్మాల్ ఆయత్ హజ్రత్ అలీ(అ.స) యొక్క విలాయత్ మరియు ఖిలాఫత్ పై నిదర్శిస్తున్నాయి. పరిశోధన చేసి రుజుమార్గం పొందాలనుకుంటున్నవారు మత పక్షపాతం లేకుండా పరిశోధిస్తారనే అభిలాషతో ఈ వ్యాసాన్ని మరియు కొన్ని గ్రంథాలను రిఫరెన్స్ తో ప్రదర్శించబడినది.

హజ్రత్ అలీ(అ.స) విలాయత్ విషయంలో మార్గ భ్రష్టతకు గురి అయి ఉన్న వారికి అల్లాహ్ రుజు మార్గం చూపించాలని ప్రార్థిస్తున్నాము.

రిఫరెన్స్
1. దీన్ యొక్క మూల అంశాలు.
2.  అల్ షియా హుమ్ అహ్లుస్సున్నహ్, తీజానీ సమావీ, పేజీ 250.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15