ఇమామ్ హుసైన్(అ.స) పలుకులు

ఆది, 07/24/2022 - 15:53

ఇమామ్ హుసైన్(అ.స) గురించి దైవప్రవక్త(స.అ) ఏమన్నారు మరియు ఇమామ్ హుసైన్(అ.స) యొక్క కొన్ని హదీసులు...

ఇమామ్ హుసైన్(అ.స) పలుకులు

ఇమామ్ హుసైన్(అ.స) గురించి దైవప్రవక్త(స.అ) ఏమన్నారు మరియు ఇమామ్ హుసైన్(అ.స) యొక్క కొన్ని హదీసులు:

1. దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: హుసైన్ ఇబ్నె అలీ యొక్క స్థానం, భూమి పై వారు కలిగి ఉన్న స్థానానికి మించిన స్థానం.[1].

2. దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: నిస్సందేహంగా హుసైన్ ఇబ్నె అలీ(అ.స) రుజుమార్గ దీపం(వెలుగు) మరియు విముక్త నౌక.[2].

3. దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: అల్లాహ్ ఇమామ్ హుసైన్ సంతానంలో పవిత్రతను ప్రసాదించాడు.[3].

4. దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: అవకాశం మరియు బలం కలిగివున్నప్పటికి ఎదుటి వారి తప్పులను క్షమించువాడే ప్రజలలో ఉత్తమ క్షమపణ గుణం కలిగిఉన్నవాడు.[4].

5. దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: ఒకరి పట్ల కోపం కలిగివున్న వ్యక్తితో సంధి చేయువాడే ప్రజలలో గొప్పవాడు.[5].

6. దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: నీకు సంబంధం లేని విషయం గురించి మాట్లాడకు దాంతో నువ్వు పాపంలో పడే అవకాశం ఉంది.[6]

7. హజ్రత్ ఇమామ్ హుసైన్(స.అ) ఉల్లేఖనం: ఇద్దరు వ్యక్తులతో వాదించకు 1. ఔదార్యం కలిగివున్నవాడితో మరియు 2. బుద్ధి లేనివాడితో ఎందుకంటే ఔదార్యం గల వ్యక్తి నిన్ను కోపానికి గురి చేస్తాడు మరియు బుద్ధిలేని వాడు నిన్ను కష్టం కలిగిస్తాడు.[7].

8. హజ్రత్ ఇమామ్ హుసైన్(స.అ) ఉల్లేఖనం: ఏదైతే విశ్వాసం గల నీ సోదరుడు నీ గురించి చెప్పాలనుకుంటావో అదే విషయం నీ అతడి గురించి చెప్పు.[8].

9. హజ్రత్ ఇమామ్ హుసైన్(స.అ) ఉల్లేఖనం: ఎక్కువ అనుభవం, బుద్ధివివేకాలను పెంచుతుంది.[9].

10. హజ్రత్ ఇమామ్ హుసైన్(స.అ) ఉల్లేఖనం: గౌరవం ధర్మనిష్టలో ఉంది.[10].

11. హజ్రత్ ఇమామ్ హుసైన్(స.అ) ఉల్లేఖనం: చెడు కార్యముల నుండి నిన్ను ఆపే వాడిని ఇష్టపడు మరియు నిన్ను మోసం చేసేవాడిని శత్రువుగా భావించు.[11].

12. హజ్రత్ ఇమామ్ హుసైన్(స.అ) తమ సోదరులు హజ్రత్ అబ్బాస్(అ.స)తో ఇలా అన్నారు.. నిస్సందేహంగా నేను నమాజ్ మరియు ఖుర్ఆన్ పారాయణాన్ని ఇష్టపడతాను.[12].

రిఫరెన్స్

1,2,3. బిహారుల్ అన్వార్, భాగం36, పేజీ208, హదీస్8.
4,5,6. బిహారుల్ అన్వార్, భాగం71, పేజీ400.
7,8. బిహారుల్ అన్వార్, భాగం75, పేజీ127, హదీస్10.
9,10,11. బిహారుల్ అన్వార్, భాగం75, పేజీ127.
12. లుహూఫ్, పేజీ89.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12