ఇమామ్ సజ్జాద్(అ.స) అహ్లె సున్నత్ ఉలమాల దృష్టిలో

ఆది, 08/21/2022 - 16:40

దైవప్రవక్త(స.అ) యొక్క నాలుగోవ ఉత్తరాధికారి అయిన ఇమామ్ సజ్జాద్(అ.స) గురించి అహ్లె సున్నత్ ప్రముఖ ఉలమాల అభిప్రాయాలు...

ఇమామ్ సజ్జాద్(అ.స) అహ్లె సున్నత్ ఉలమాల దృష్టిలో

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్

పవిత్ర మాసూమ్ గురించి తెలుసుకోవడం ఒక నిజమైన షియా యొక్క అత్యంత అవసరమైన చర్య. ఈ క్రమంలో వారిని ఇమామ్ గా నమ్మని వారు వారి ప్రతిష్టతను వివరిస్తే ఇంకా బాగా అర్థం చేసుకోగలం. కేవలం అహ్లె సున్నత్ యొక్క గ్రంథాలనే చూసుకున్నట్లైతే పవిత్ర మాసూముల గురించి ఉల్లేఖించబడి ఉన్నాయి. ఇక్కడ వాటి నుండి కేవలం ఇమామ్ సజ్జాద్(అ.స) గురించి కొన్ని అభిప్రాయాలు తెలుసుకుందాం:

ఇమామ్ సజ్జాద్(అ.స) హిజ్రీ యొక్క 38వ సంవత్సరం, మదీనహ్ పట్టణంలో జన్మించారు. వలీద్ ఇబ్నె అబ్దుల్ మలిక్ యొక్క ఖిలాఫత్ కాలంలో చంపబడ్డారు. వారి సమాధి జన్నతుల్ బఖీ స్మశానంలో ఇమామ్ హసన్(అ.స) యొక్క ప్రక్కలో ఉంది. ఇమామ్ సజ్జాద్(అ.స) మరణించిన ఆ సంవత్సరాన్ని “సనతుల్ ఫుఖహా” నామకరించారు, అందుకు కారణం ఆ సంవత్సరంలో మదీనహ్ కు చెందిన చాలా మంది ఫిఖీహ్ (ఫిఖా జ్ఞానం కలిగివున్న వారు) లు మరణించడం.

జ్ఞానం మరియు హదీస్ విషయంలో ఇమామ్ సజ్జాద్(అ.స) యొక్క స్థానం; సహా సిత్తా(అహ్లె సున్నత్ యొక్క ఆరు ప్రముఖ హదీస్ గ్రంథాలు – సహీ బుఖారీ, సహీ ముస్లిం, జామె అల్ సహీ తిర్మిజీ, సుననె అబూ దావూద్, సుననె నిసాయి, సుననె ఇబ్నె మాజహ్) లలో మరియు అహ్లె సున్నత్ యొక్క ఇతర మసానీద్ గ్రంథాలలో ఇమామ్ సజ్జాద్(అ.స) నుండి హదీసులు ఉల్లేఖించబడి ఉన్నాయి.

బుఖరీ తన గ్రంథంలో అబ్వాబె తహజ్జుద్, నమాజె జుమా, హజ్ మరియు కొన్ని చరిత్రకు సంబంధించిన అంశాల అధ్యాలలో., అలాగే ముస్లిం కూడా తన గ్రంథంలో ఉపవాసం, హజ్, ఫరాయిజ్, ఫితన్, అదబ్ మరియు ఇతర చరిత్ర అంశాలకు సంబంధించిన అధ్యాలలో ఇమామ్ సజ్జాద్(అ.స) నుండి హదీసులను ఉల్లేఖించారు.

1. ఇబ్నె షహాబె జొహ్రీ: (ఇమామ్ సజ్జాద్(అ.స) యొక్క శిష్యులలో ఒకరు) వివిధ సందర్భాలలో ఇమామ్ సజ్జాద్(అ.స) ఉల్లేఖనలు రచించారు. వాటిలో కొన్ని: “అహ్లె బైత్ లలో అలీ ఇబ్నుల్ హుసైన్ కు మించిన ప్రతిష్టత గల వారిని చూడలేదు”, “ఖురైషీయులలో అలీ ఇబ్నుల్ హుసైన్ కు మించి ప్రతిష్టత ఉన్న వారిని చూడలేదు”, నేను అలీ ఇబ్నుల్ హుసైన్ తో చాలా సార్లు కూర్చున్నాను, వారిని మించిన ఫఖీహ్ ని చూడలేదు”, “హషిమీలలో వారిని మించిన దాసుడను చూడలేదు”.

2. జైద్ ఇబ్నె అస్లమ్ (మరణం 136హి): “అలీ ఇబ్నుల్ హుసైన్ లాంటి ఎరుక గల వ్యక్తిని చూడలేదు”

3. మాలిక్ ఇబ్నె అనస్ (మరణం 179హి): “దైవప్రవక్త(స.అ) అహ్లెబైత్ లో వారికి సాటి లేరు”

4. మొహమ్మద్ ఇబ్నె ఉమర్ వాఖిదీ (మరణం 207హి): “వారు ప్రజలలో ఉత్తమ ధర్మనిష్ట గలవారు, దైవభక్తి గలవారు, అల్లాహ్ యొక్క గొప్ప దాసుడు”

5. అలీ ఇబ్నె మద్ యనీ (మరణం 230హి): “అలీ ఇబ్నుల్ హుసైన్ పవిత్రులు, ధర్మనిష్ట గలవారు...”

6. ఇబ్నె ఖుతైబహ్ దైనవీ (మరణం 276హి): “వారు ఉత్తమలు, ప్రతిష్టవంతులు”

7. ఇబ్నె అబ్దు రబ్బిహ్ ఉందులసీ (మరణం 327హి): “అలీ ఇబ్నుల్ హుసైన్, బనీ హాషిములలో ప్రతిష్టత గల వారు” వేరే ఒక చోట వారిని ఫిఖా మరియు జ్ఞానం మరియు ధర్మనిష్ట గలవారు అని అన్నారు.

8. ఇబ్నె హబ్బాన్ (మరణం 354హి): “వారు బనీ హషింలలో ప్రతిష్టత గలవార, మదీనహ్ ఫఖీహ్ మరియు ఉత్తమ దాసులలో ఒకరు, అప్పటి కాలంలో ఆరాధన చేసేవారి స్వామి (సయ్యదుల్ ఆబెదీన్)”

9. అబూ నయీమ్ (మరణం 430హి): “వారు జైనుల్ ఆబెదీన్, మినారుల్ ఖానితీన్, వారు న్యాయమైన ఆరాధకుడు మరియు గొప్యంగా దానం చేసే దానవుడు”.

10. ఇబ్నె అబిల్ హదీద్ (మరణం 656హి): “వారు ఆరాధనలో లక్ష్యం కలిగివున్నవారు”

వీళ్లే కాకుండా ఇబ్నె ఖల్లకాన్ (మరణం 681హి), షంస్సుద్దీన్ జహబీ (మరణం 748హి), ఇబ్నె కసీరె దమిష్కీ(మరణం 774హి), ఇబ్నె హజరె అస్కలానీ (మరణం852హి), ఖైరుద్దీన్ జర్కలీ (మరణం1392హి) మొ.. ఇమామ్ సజ్జాద్(అ.స) యొక్క ప్రతిష్టతలను వివరించారు. ఇవి కొంత మంది ఉల్లేఖనలు మాత్రమే. అవి కూడా ఇమామ్ సజ్జాద్(అ.స) యొక్క ప్రతిష్టతల తీరం లేని సముద్రం నుండి కేవలం ఒక నీటి బొట్టు మాత్రమే.

సంక్షిప్తంగా చెప్పాలంటే పై చెప్పబడిన అభిప్రాయాలను ఒక్క వాక్యంలో ఇలా చెప్పాలంటే ఇలా చెప్పవచ్చు .. ఇమామ్ సజ్జాద్(అ.స) తన కాలంలో అప్పటి ఇస్లామీయ సమాజంలో ఉత్తమ మరియు సాటి లేని వ్యక్తి..

మనకు వారి గురించి ఇంకా జ్ఞానం ప్రసాదించాలని మరియు దానితో పాటు వారి అడుగు జాడలలో నడిచే అర్హతను ప్రసాదించాలని అల్లాహ్ ను ప్రార్ధిస్తున్నాము.

రిఫరెన్స్
https://btid.org/fa/news/142573

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 25