సహీఫయే సజ్జాదియహ్

సోమ, 08/22/2022 - 15:53

ఇమామ్ హుసైన్ ఇబ్నె అలీ[అ.స] యొక్క కుమారుడు అయిన ఇమామ్ సజ్జాద్[అ.స] యొక్క ప్రార్ధనలతో కూడిన గ్రంథమే “సహీఫయే సంజ్జాదియహ్” గ్రంథం గురించి సంక్షిప్త వివరణ...

సహీఫయె సజ్జాదియహ్

ఇమామ్ హుసైన్ ఇబ్నె అలీ[అ.స] యొక్క కుమారుడు అయిన ఇమామ్ సజ్జాద్[అ.స] యొక్క ప్రార్ధనలతో కూడిన గ్రంథమే “సహీఫయే సంజ్జాదియహ్” గ్రంథం. దీనిని “ఇంజీలె అహ్లెబైత్” “జబూరె ఆలె ముహమ్మద్” మరియు “ఉఖ్తుల్ ఖుర్ఆన్” అంటారు. ఇందులో చూడడానికి దుఆలు మరియు ప్రార్ధనలు ఉన్నాయి కాని చాలా యదార్థాలు, ఇస్లామీయ విజ్ఞానం, సంపూర్ణత్వం, చట్టం, ఇస్లాం షరా, రాజకీయ సమస్యలు, సమజా, శిక్షణ మరియు సద్గుణలకు సంబంధించిన సమస్యలను ఇమామ్ దుఆ రూపంలో సూచించారు.
“సహీఫయే సజ్జాదియహ్”లో 75 దుఆలు ఉండేవి. అవి ఇమామ్ సజ్జాద్[అ.స] చెబితే వారి సోదరుడు జైద్ ఇబ్నె అలీ[అ.స] దానిని రెండు పుస్తకాలలో వ్రాశారు. జైద్ ఇబ్నె అలీ[అ.స] తన దగ్గర ఉన్న గ్రంథాన్ని భద్ర పరచడానికై “ముతవక్కిల్ ఇబ్నె హారున్”కు ఇచ్చారు. ఇమామ్ జాఫర్ సాదిఖ్[అ.స] యొక్క సహాబీ అయిన ‘మతవక్కిల్ ఇబ్నె హారూన్’ ఇలా అన్నారు: “నా వద్ద నుండి 11 దుఆలు పోయాయి నేను 64 దుఆలను ఉల్లేఖిస్తున్నాను”. ముతవక్కిల్ తన దగ్గరున్న ఆ దుఆలను ఇమామ్ జాఫర్ సాదిఖ్[అ.స]కు ఇచ్చారు. వాటిని ఇమామ్ ముహమ్మద్ బాఖిర్[అ.స] లిఖించినవాటిని పోల్చగా ఆ రెండింటిలో ఎటువంటి తేడా కనిపించలేదు. కాని ఆ 64 దుఆల నుండి ఇప్పుడు మన వద్ద “సహీఫయే సజ్జాదియహ్”లో 54 దుఆలే ఉన్నాయి.
అల్లాహ్ వాటిని చదివి అర్ధం చేసుకునే యోగ్యత ప్రసాదించమని కోరుకుందాం!.

సహీఫయే సజ్జాదియహ్ అహ్లె సున్నత్ దృష్టిలో

“ఇబ్నె షహ్రె ఆషూబ్” తన పుస్తకం “మనాఖిబ్”లో ఇలా ఉల్లేఖించెను: “బస్రా పట్టణంలో ఒక వక్త వద్ద ‘సహీఫయే కామెలహ్’ యొక్క వక్తృత్వం మరియు వాక్ నైపుణ్యం మాట మధ్యలో వస్తే అతను ఇలా అన్నాడు: ‘నేను కూడా అలాంటిది మీ కోసం ఉల్లేఖించగలను’ అప్పుడు కలం తీసుకొని తలను వంచాడు(మరి ఒక పదం కూడా చెప్పలేకపోయాడు) మరి అదే స్థితిలో ఈ ప్రపంచాన్ని విడిచాడు”
1974లో ఆయతుల్లాహ్ “మర్అషీ నజఫీ” “సహీఫయే సజ్జాదియహ్” గ్రంథాన్ని అహ్లెసున్నత్ యొక్క పండితుడు, ఇస్కందరియ్యహ్ కు చెందిన ముఫ్తీ అయిన “తంతావీ” గారికి “ఖాహరహ్”కు పంపించారు. అతను దాని గురించి ఇలా అన్నారు: “సృష్టితాల ప్రవచనకు ఎక్కువ మరియు సృష్టికర్త ప్రవచనకు తక్కువ” అని వర్ణించారు. ఆ తరువాత ఇలా అన్నారు: “నుబువ్వత్ వారసత్వం నుండి వచ్చిన ఈ అముల్యమైన దాన్ని ఇప్పటి వరకు పొందకపోవడం మా దురదృష్టం”
మరి అలాగే “ఇబ్నె జౌజీ” “ఖసాయిసుల్ ఆయిమ్మహ్” లో ఇలా అనెను: “అలీ ఇబ్నుల్ హుసైన్, జైనుల్ ఆబెదీన్ అల్లాహ్ ను ఎలా వేడుకోవాలో ముస్లిములకు తెలియపరిచారు, అస్తగ్ఫార్ ఎలా చేయాలి, శత్రువుల భయం ఉంటే అల్లాహ్ ను ఎలా వేడుకోవాలీ, కరువు సమయంలో ఎలా ప్రార్థించాలి, మొ.. వాటిని నేర్పారు”.
“జకీ ముబారక్” తన పుస్తకంలో సహీఫయే సజ్జాదియహ్ ను కొన్ని కొణాలలో “ఇంజీల్”తో పోల్చారు. కాని ఇంజీల్, హృదయాన్ని ‘ఈసా మసీహ్’ వైపుకు తీసుకొని వెళ్తుంది మరియు సహీఫహ్, హృదయాన్ని అల్లాహ్ వైపుకు ఆకర్షింపజేస్తుంది. రెండిటిలో ఇదే తేడా, అని అన్నారు. 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 22