హిజాబ్ యొక్క ప్రాముఖ్యత ఇస్లాం దృష్టిలో మరియు దానిపై ముస్లిం స్ర్తీల అనుచరణ...

ఇస్లామీయ సంస్కృతిలో ధర్మం యొక్క అతి ముఖ్య ఉపదేశాలలో వ్యక్తిగత మరియు సామాజిక సంబంధాలకు పవిత్రత మరియు హిజాబ్ రక్షణ ఒకటి. ఖుర్ఆన్ యొక్క ఆయతులు మరియు చాలా రివాయతులు ఈ టాపిక్ యొక్క ప్రాముఖ్యత మరియు అవసరం గురించి వివరించబడి ఉంది. అయితే గమనించదగ్గ విషయమేమిటంటే ఇది కేవలం ఇస్లాం ధర్మానికి ప్రత్యేకించబడిన విషయం కాదు ఇతర ధర్మాలలో కూడా మనిషి జీవితంలో హిజాబ్ మరియు పవిత్ర గురించి ఉపదేశించబడి ఉంది. కాకపోతే ఇతర ధర్మాలలో దీనిపై సరిగా అమలు జరగలేదు; కాని ముస్లిములు హిజాబ్ యొక్క ఆదేశ రక్షణకై దానిని అమలు పరిచారు. వారు దానిని గౌరవిస్తారు మరియు దాని ప్రాముఖ్యతను నమ్ముతారు. నిజానికి హిజాబ్ రక్షణను ఇస్లామీయ పవిత్ర ఆదేశాల రక్షణగా భావించి దాని పట్ల ప్రత్యక శ్రద్ధ తీసుకుంటారు.
(ఓ ప్రవక్తా!) ముస్లిం స్ర్తీలు తమ చూపులను క్రిందికి ఉంచాలనీ, తమ మర్మస్థానాలను రక్షించుకోవాలనీ, బహిర్గతమై ఉండేది తప్ప – తమ అలంకరణను బహిర్గతం చేయరాదనీ, తమ వక్షస్థలాలపై ఓణీలు వేసుకోవాలనీ, తమ భర్త లేక తమ తండ్రి లేక తమ మామాగారు లేక కొడుకులు లేక తమ భర్త కొడుకులు లేక తమ సోదరులు లేక తమ సోదరుల కుమారులు లేక తమ అక్కాచెల్లెళ్ల కొడుకులు లేక తమతో కలిసిమెలసి ఉండే స్ర్తీలు, లేక తమ బానిసలు లేక ఇతరత్రా ఉద్దేశాలు లేకుండా తమకు లోబడి ఉన్న పురుష సేవకులు లేక స్ర్రీల గుప్త విషయాల గురించి ఇంకా తెలియని బాలురు వీళ్ల ఎదుట తప్ప ఇతరుల ఎదుట తమ అంలకరణలను(అందచందాలను కనబడనివ్వకూడదనీ, దాగివున్న తమ అలంకరణ ఇతరులకు తెలిసిపోయేలా తమ కాళ్ళను నేలపై కొడుతూ నడవరాదని వారితో చెప్పు.[సూరయె నూర్, ఆయత్31] (ఓ ప్రవక్తా!) ముస్లిం పురుషులు తమ చూపులను క్రిందికి ఉంచాలనీ, వారు తమ మర్మస్థానాలను కాపాడుకోవాలనీ, అది వారి కొరకు పవిత్రమైనదని వారితో చెప్పు. వారు చేసేదంతా అల్లాహ్ కు తెలుసు[సూరయె నూర్, ఆయత్30]
ఇక్కడ మేము హిజాబ్ రక్షణ యొక్క 4 లాభాలు మరియు శుభాలను చెప్పాలనుకుంటున్నాము.
1. అల్లాహ్ సామిప్యం మరియు జీవితంలో ఆధ్యాత్మిక శక్తి
హిజాబ్ యొక్క ప్రభావాలలో ముఖ్యమైన ప్రభావం అల్లాహ్ సమ్మతం మరియు ఆధ్యాత్మిక పరంగా శక్తి పొందడం. ఎందుకంటే ఈ దైవాదేశాన్ని అమలు పరచడం నిజానికి దైవాదేశాలను గౌరవించినట్లు. ఇది అల్లాహ్ సామిప్యం వైపు అడుగు వేయడం మరి ఇది ఆధ్యాత్మిక స్థితి ఉత్తమత్వానికి సహాయపడవచ్చు. మన జీవితంలో హిజాబ్ యొక్క రక్షణ సంబంధం డైరెక్ట్ గా పవిత్రతతో ఉంది. పవిత్రత మరియు హిజాబ్ ను కాపాడుకునే వారిపై దైవానుగ్రహాలు ఉంటారు. దైవప్రవక్త(స.అ) ఇలా ఉపదేశించారు: “అల్లాహ్ ఉదారత్వంగల, పవిత్రమైన మరియు పవిత్రత కోసం ప్రయత్నించేవాడిని ఇష్టపడతాడు”[1]. బహుశ కొందరు ఇలా ఆలోచించవచ్చు పవిత్రతకు మరియు హిజాబ్ ఎటువంటి సంబంధం లేదు అని; కాని యదార్థమేమిటంటే హిజాబ్ మరియు దాని పట్ల నమ్మకం మనిషి యొక్క అంతరాత్మ పవిత్రత మరియు ఉత్తమత్వాన్ని నిదర్శిస్తుంది.
2. మనశాంతి
కొందరు మనశాంతి, మనో ధైర్యం మరియు ఆత్మగౌరవం లేకపోవడాన్ని పరదా రహీతం అని భావిస్తారు, కాని హిజాబ్ ధరించే వారి మరియు హిజాబ్ ను ధరించని వారితో చర్చించి దాని పై ఒక పరిశోధన చేసిన తరువాత దక్కిన ఫలితమేమిటంటే; హిజాబ్ ధరించువారు సమాజంలో సరసాలాడు ధోరణి మరియు స్వీయ ప్రదర్శనకు దూరంగా ఉండడం వల్ల వారి మనశాంతి ఉత్తమ స్థానంలో ఉంది. నిజానికి ఫ్యాషన్ మరియు నగ్నత్వం ద్వార స్వయ సమ్మతం, మనశాంతికి కారణం కాలేదు. సృష్టికర్త అయిన అల్లాహ్ కు మనిషి యొక్క అవసరాలు తెలుసు మరియు మనశాంతి పొందడానికి మార్గాలు ఆయనకు మించి ఎవరికి తెలుస్తాయి. ఇలాంటి షరా రహితమైన అంశాలను నిషేధిస్తూ అల్లాహ్ ఇలా ఉపదేశించెను: “మీరు మీ ఇండ్లల్లోనే ఆగి ఉండండి. పూర్వపు అజ్ఞాన కాలంలో మాదిరిగా మీ సింగారాన్ని చూపిస్తూ తిరగకండి”[సూరయె అహ్జాబ్, ఆయత్33]
3. సమాజంలో మహిళలకు గుర్తింపు
హిజాబ్ స్ర్తీకు ఉనికిని ప్రసాదిస్తుంది, ఇది మహిళను ఒక వ్యపార సమాచారాలకు ఉపయోగించే ఆలోచన మరియు సంస్కృతికి వ్యతిరేకమైనది. మహిళను తమ ప్రకటన వస్తువుగా భావిస్తున్నారు కాని ఇస్లాం మహిళను దైవిక ఉనికి మరియు ఉత్తమురాలిగా పరిచయించెను. ఖుర్ఆన్ ఇలా ఉపదేశించెను: “మీరు వారిని ఏదానా అడగవలసి వచ్చినప్పుడు తెర వెనుక నుంచి అడగండి. మీ ఆంతర్యాల, వారి హృదయాల పరిశుద్ధత కోసం ఇదే సముచితమైన పద్ధతి”[అల్ అహ్జాబ్, ఆయత్53].
4. సమాజంలో సిగ్గుమాలిన తనం మరియు చెడు పెరగకుండా ఆపుతుంది
హిజాబ్ మరియు పవిత్రత వల్ల ఎన్నో సిగ్గుమాలిన చర్యలను మరియు సమాజం పై పడే ఎన్నో చెడు ప్రభావాలను అరికట్టగలం. మనిషి లోపల ఎన్నో ఆశలు ఉంటాయి, అవి ఎప్పుడు ఏ విధంగా మనిషిని మృగంగా మారుస్తోయో మనిషి కే తెలియదు. అలాంటప్పు సంభవించే అనర్ధాలు చాలా భయంకరంగా ఉంటాయి.[2]
చివరిమాట:
మనిషికి విశ్వాసం మరియు పవిత్రత పట్ల జ్ఞానం, ఇతరుల పట్ల దురాశ నుంచి దూరంగా ఉంటాము. సూరయె అహ్జాబ్ యొక్క 59 ఆయత్ లో అల్లాహ్ ఇలా ఉపదేశించెను: “ఓ ప్రవక్తా! తమపై నుంచి తమ దుప్పట్లను (క్రిందికి) వ్రేలాడేలా కప్పుకోమని నీ భార్యలకు, నీ కుమార్తెలకు, విశ్వాసులైన స్ర్తీలకు చెప్పు. తద్వారా వారు చాలా తొందరగా (మర్యాదస్తులుగా) గుర్తించబడి, వేధింపుకు గురికాకుండా ఉంటారు. అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడు”[సూరయె అహ్జాబ్, ఆయత్59][3]
రిఫరెన్స్
1. కులైనీ, మొహమ్మద్ ఇబ్నె యాఖూబ్, అల్ కాఫీ, భాగం2, పేజీ112, హదీస్8.
2. فَيَطْمَعَ الَّذي في قَلْبِهِ مَرَض(సూరయె అహ్జాబ్, ఆయత్32) అనువాదం: హృదయంలో (దురాలోచనా) రోగం ఉన్నవాడు అత్యాశకు పోవచ్చు.
3. يا أَيُّهَا النَّبِيُّ قُلْ لِأَزْواجِكَ وَ بَناتِكَ وَ نِساءِ الْمُؤْمِنينَ يُدْنينَ عَلَيْهِنَّ مِنْ جَلاَبِيبِهِنَّ ذلِكَ أَدْنى أَنْ يُعْرَفْنَ فَلا يُؤْذَيْنَ وَ كانَ اللَّهُ غَفُوراً رَحيما
వ్యాఖ్యానించండి