నిజం మరియు అబద్ధం యొక్క ప్రభాలు మరియు ఫలితాలు గురించి వివరిస్తున్న కొన్ని హదీసుల తెలుగనువాదం...

నిజం మరియు అబద్ధం, ఈ రెండూ మనిషి ప్రవర్తనకు సంబంధించినవి. వీటి సంబంధం మనిషి నమ్మే ధర్మానికి సంబంధించినవి. నిజం పలకడం అనేది మనిషి స్వభావానికి అనుకూలమైన చర్య అయితే అబద్ధం చెప్పడం మనిషి స్వభావానికి వ్యతిరేకం చర్య.
నిజమే పలకాలనే ప్రేరణ మనిషి ఆలోచన పటిష్టత మరియు తన ఆత్మపై నమ్మకానికి నిదర్శనమైతే, అబద్ధం మనిషిలో ఉన్న లోపాలకు, కపటానికి నిదర్శనం.
అబద్దం చెప్పడం అతి చెడు లక్షణం, మహా పాపం మరియు మనిషి ఆధ్యాత్మిక పెరుగుదలకు అడ్డుగా నిలుస్తుంది. వీటి నుండి దూరం అవ్వాలంటే దీని యొక్క చెడును మరియు దాని చెడు ప్రభావాలను తెలుసుకోవాలి అలాగే దీనికి ప్రతిగా ఉన్న సత్యాన్ని కూడా తెలుసుకోవాలి. దాంతో అబద్ధం నుండి దూరం అయ్యే అవకాశం ఉంది. ముందుగా మేము సత్యం పలకడం వల్ల కలిగే ప్రభావాలు మరియు ఫలితాల గురించి తెలుసుకుందాం, ఆ తరువాత అబద్దం యొక్క చెడు ప్రభావల గురించి తెలుసుకుందాం.
ప్రళయదినం సత్యవంతుడి స్థానం
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: తన మాటల్లో సత్యవంతుడు, ఇతరులకు సంబంధించిన వస్తువు పట్ల నమ్మకస్తుడు, ఇచ్చిన మాటన నిలబెట్టుకొనేవాడు, ప్రవర్తనలో ఉత్తముడు మరియు ప్రజల పట్ల ప్రేమానురాగాలు కలిగివున్నవాడు, ప్రళయదినాన నాకు అత్యంత సమీపంలో ఉంటాడు.[1]
మాట సౌందర్యం
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: మాట యొక్క సౌందర్యం, అందులో ఉండే సత్యం.[2]
స్వర్గపు ద్వారం
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: నిత్యం నిజమే చెప్పండి, ఎందుకంటే నిజం చెప్పడం స్వర్గం యొక్క ద్వారముల నుండి ఒక ద్వారము. అబద్ధం నుండి దూరంగా ఉండండి, ఎందుకంటే అబద్ధం నరకం యొక్క ద్వారముల నుండి ఒక ద్వారము.[3]
ఉత్తమ మాట
హజ్రత్ అలీ(అ.స) ఉల్లేఖనం: ఉత్తమ ప్రసంగం, సత్య ప్రసంగం.[4]
సత్యం యొక్క ఫలితం
హజ్రత్ అలీ(అ.స) ఉల్లేఖనం: నిజం మాట్లాడడం యొక్క ఫలితం., స్వేచ్ఛ మరియు ఆరోగ్యం.[5]
నిజం శౌర్యానికి నిదర్శనం
హజ్రత్ అలీ(అ.స) ఉల్లేఖనం: సత్యం పలకడం ద్వార శౌర్యం ఉత్తమ స్థాయికి చేరుతుంది.[6]
సత్యం విముక్తికి కారణం
హజ్రత్ అలీ(అ.స) ఉల్లేఖనం: (ఇహపరలోకాల) విముక్తి సత్యం పలకడంలో ఉంది.[7]
ఉత్తమ గుణం
హజ్రత్ అలీ(అ.స) ఉల్లేఖనం: ఉత్తమ గుణాలు, సత్యం పలకడం మరియు మంచి పనులు చేయడం.[8]
సత్యం పలకడం ఉత్తముల పద్ధతి
హజ్రత్ అలీ(అ.స) ఉల్లేఖనం: సత్యం పలకడం మరియు నమ్మకస్తాన్ని పాటించు ఈ రెండూ, ఉత్తముల పద్ధతి.[9]
సత్యం విశ్వాసం యొక్క స్తంభం
హజ్రత్ అలీ(అ.స) ఉల్లేఖనం: నిజం పలకడం మనిషి యొక్క సౌందర్యం మరియు విశ్వాసం యొక్క స్తంభం.[10]
అబద్ధం
మహా పాపం
ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: మహాపాపముల నుండి దూరంగా ఉండాలి, అవి: అల్లాహ్ హరామ్ గా నిర్ధారించిన వారిని చంపడం, వ్యభిచారం, దొంగతనం ... అబద్ధం చెప్పడం, అహంకారం...[11]
అబద్ధం నుండి దూరం
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: అబద్ధం నుండి దూరంగా ఉండండి, ఎందుకంటే అబద్ధం (మనిషిని) పాపం వైపుకు లాగుతుంది మరియు పాపం (అతడిని) నరకాగ్ని వైపుకు దారి చూపుతుంది.[12]
అపవిత్రతల తాళం చెవి
ఇమామ్ హసన్ అస్కరీ(అ.స) ఉల్లేఖనం: అపవిత్రతలన్నీ ఒక ఇంట్లో ఉన్నాయి మరియు దాని తాళం చెవి అబద్ధం చెప్పడం.[13]
అబద్ధం మరియు హాస్యం
దైవప్రవక్త(స.అ) అబూజరె గఫ్ఫారీ తో ఇలా అనెను: ఓ అబూజర్! ప్రజలను నవ్వించడానికి అబద్ధం చెప్ప వాడి స్థితి పై చాలా చెడ్డ స్థితి, చాలా చెడ్డ స్థితి, చాలా చెడ్డ స్థితి.[14]
అబద్ధం యొక్క ఫలితం
హజ్రత్ అలీ(అ.స) ఉల్లేఖనం: అబద్ధం చెప్పడం వల్ల వచ్చే నష్టాలు, నిందలు మరియు సిగ్గు (తిరస్కరణ).[15]
అతి చెడ్డ లక్షణం
హజ్రత్ అలీ(అ.స) ఉల్లేఖనం: అతి చెడ్డ లక్షణం అబద్దం చెప్పడం మరియు రెండు ప్రవర్తనలు కలిగి ఉండడం(కపటం).[16]
అబద్ధం చెప్పడానికి కారణం
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: అబద్ధం చెప్పేవాడు, తనలో ఉన్న నీచత్వం మరియు హీనం వల్ల అబద్ధం చెబుతాడు.[17]
కపటం యొక్క ద్వారం
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: అబద్ధం చెప్పడం, కపటం యొక్క ద్వారముల నుండి ఒక ద్వారం.[18]
రిఫరెన్స్
1. లిఆలిల్ అఖ్బార్, భాగం5, హదీస్253.
2. మన్ లా యహ్జుర్హు అల్ ఫఖీహ్, భాగం4, పేజీ402.
3. నెహ్జుల ఫసాహహ్, హదీస్419.
4. గురరుల్ హికమ్, భాగం3, పేజీ429, హదీస్96.
5. గురరుల్ హికమ్, భాగం4, పేజీ363, హదీస్ 6333.
6. గురరుల్ హికమ్, భాగం3, పేజీ208, హదీస్4224.
7. గురరుల్ హికమ్, భాగం3, పేజీ207, హదీస్4221.
8. గురరుల్ హికమ్, భాగం3, పేజీ430, హదీస్5004.
9. గురరుల్ హికమ్, భాగం2, పేజీ187, హదీస్2325
10. గురరుల్ హికమ్, భాగం2, పేజీ143, హదీస్2120
11. ఉయూను అఖ్బారి అల్ రిజా, భాగం2, పేజీ127.
12. ముస్తద్రికుల్ వసాయిల్, భాగం2, పేజీ100.
13. బిహారుల్ అన్వార్, భాగం72, పేజీ263.
14. మకారిముల్ అఖ్లాఖ్, పేజీ470.
15. గురరుల్ హికమ్, భాగం4, పేజీ363, హదీస్6332.
16. గురరుల్ హికమ్, భాగం4, పేజీ166, హదీస్5689.
17. మీజానుల్ హిక్మహ్, భాగం8, పేజీ347.
18. మజ్ముఅయె వర్రామ్, భాగం1, పేజీ113.
వ్యాఖ్యానించండి