హదీసె యొముద్దార్ ఏ రోజును అంటారు మరియు అహ్లె సున్నత్ గ్రంథాలలో దీని గురించి ఏమని లిఖించబడి ఉంది అన్న విషయాల పై సంక్షిప్త వివరణ...

హదీసె యొముద్దార్ ఏ రోజును అంటారు మరియు అహ్లె సున్నత్ గ్రంథాలలో దీని గురించి ఏమని లిఖించబడి ఉంది అన్న విషయాలు తెలుసుకుందా...
మొహమ్మద్ ఇబ్నె ఇస్హాఖ్ రావీయుల క్రమంతో హజ్రత్ అలీ(ర.అ) ద్వార రివాయత్ ను ఇలా ఉల్లేఖించారు: వారు(ర.అ) ఇలా అన్నారు: وَأَنذِرْ عَشِيرَتَكَ الْأَقْرَبِينَ ; నీ దగ్గరి బంధువులను భయపెట్టు[సూరయె షుఅరా, ఆయత్214] ఈ ఆయత్ అవతరించబడినపుడు దైవప్రవక్త(స.అ) నన్ను పిలిచి ఇలా అన్నారు: ఓ అలీ! అల్లాహ్ తఆలా నీ దగ్గరి బంధువులను భయపెట్టు మని ఆదేశించెను. ఈ ఆజ్ఞ నన్ను ఒత్తిడికి గురి చేసింది, ఎందుకంటే దీన్ని వాళ్ళ మధ్య చెబితే కలతకు గురిచేసేవారి సమాధానం వస్తుంది అని నాకు బాగా తెలుసు, అందుకని శ్వాస బిగపెట్టుకొని ఉన్నాను(అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను) చివరికి జిబ్రయీల్ వచ్చి ఇలా అన్నారు: ఓ ముహమ్మద్! నీవు ఈ కార్యాన్ని నిర్వర్తించకపోతే నీ ప్రభూ నిన్ను శిక్షస్తాడు. దైవప్రవక్త(స.అ) నాతో ఇలా అన్నారు.. మా కోసం ఒక సాఅ(మూడు కిలోలు) భోజనాన్ని తయారు చేయించు, అందులో గొర్రెతొడ(మాంసం)ని కూడా జోడించు. ఒక పాత్రను పాలుతో నింపు, ఆ తరువాత అబ్దుల్ ముతల్లిబ్ కుమారులందరిని ఆహ్వానించు నేను వాళ్లతో మాట్లాడి నా కర్తవ్యాన్ని వారికి చేరుస్తాను(వివరిస్తాను).
నేను దైవప్రవక్త(స.అ) ఆజ్ఞప్రకారం అబ్దుల్ ముతల్లిబ్ కుమారులందరిని ఆహ్వానించాను. ఆ రోజు ఇంచు మించు ఒకరిద్దరు ఇటూ అటుగా నలభై పురుషులు ఉన్నారు, వారిలో దైవప్రవక్త(స.అ) పినతండ్రులు అబూతాలిబ్, హంజా, అబ్బాస్ మరియు అబూలహబ్ లు కూడా ఉన్నారు.
వాళ్ళు దైవప్రవక్త(స.అ) వద్దకు వచ్చిన తరువాత నన్ను సిద్ధం చేయమన్న భోజనాన్ని వారి కోసం తీసుకొని రమ్మన్నారు, నేను భోజనాన్ని తీసుకొచ్చి నేల పై పెట్టాను దైవప్రవక్త(స.అ) మాంసం ముక్కను తన పళ్ళతో కొరికి పళ్లెం ఒకభాగంలో పెట్టి అందరితో బిస్మిల్లాహ్ తీసుకోండి అన్నారు, దాంతో అందరూ తినడం మొదలు పెట్టారు, ఇంకా భోజనం అవసరం లేకుండా అందరూ కడుపు నిండా తిన్నారు, నా ప్రాణాలు గుప్పట్లే ఉన్న ఆ అల్లాహ్ సాక్షిగా వాళ్ళను ఉన్న ఒక వ్యక్తి అందరికోసం తయారు చేసిన భోజనాన్ని తను ఒక్కడే తినేయగలడు!
ఆ తరువాత దైవప్రవక్త(స.అ) వారికి త్రాగడానికి ఇవ్వమని అన్నారు, నేను ఆ (పాల) గ్లాసును తీసుకొచ్చాను, వారందరు కడుపు నిండా త్రాగారు, అల్లాహ్ సాక్షిగా ఒక్కోక్కడు ఒక పాత్ర నిండుగా త్రాగగలరు.
దైవప్రవక్త(స.అ) వారందరితో మాట్లాడాలని అనుకున్నారు, ఇంతలో అబూలహబ్ ఇలా అన్నాడు.. ఈ వ్యక్తి చాలా కాలం నుండి మిమ్మల్ని చేతబడి చేస్తూ వస్తున్నాడు. ఈ మాటతో వారందరూ వెళ్ళిపోయారు. దైవప్రవక్త(స.అ) వారితో మాట్లాడలేకపోయారు.
మరుసటిరోజు దైవప్రవక్త(స.అ) ఇలా అన్నారు: ఓ అలీ! నేను మాట్లడక ముందే జోక్యం చేసిన వ్యక్తి మాటలు విని వెళ్ళిపోయిన వారిని చూశావు కదా, నీవు మరలా అదే విధంగా భోజనాన్ని సిద్ధం చేయి, వారందరిని మరలా ఆహ్వానించు.
అలీ ఇలా అన్నారు: నేను దైవప్రవక్త(స.అ) ఆదేశానుసారం భోజనాన్ని సిద్ధం చేశాను.... మునుపటి రోజు వలే అందరు తిన్నారు త్రాగారు.... ఆ తరువాత దైవప్రవక్త(స.అ) తన మాటను మొదలు పెట్టారు.. ఓ అబ్దుల్ ముతల్లిబ్ కుమారులారా! అల్లాహ్ సాక్షిగా అరబ్ లో తమ ప్రజల కోసం నేను తీసుకొచ్చినంత మంచి విషయం మాదిరి తీసుకొచ్చిన యువకుడిని నేను చూడలేదు, నేను మీ కోసం ఇహపరలోకాల మంచిని తీసుకొచ్చాను, అల్లాహ్ నాకు మిమ్మల్ని దాని వైపుకు ఆహ్వానించమని ఆజ్ఞాపించాడు, ఇప్పుడు మీలో ఎవరు నా ఈ కర్తవ్యం(దౌత్యం)లో నన్ను సహకరిస్తారు? నన్ను సహకరించేవాడే నా సోదరుడు, నా వసీ మరియు నా ఉత్తరాధికారి అవుతాడు. (ఇదే వారికి ఇవ్వబడే గొప్ప ప్రతిఫలం). అప్పుడు వారందరు దగ్భ్రమ చెంది ఉన్నారు, నేను అందరిలో తక్కువ వయసుగలవాడిని, ఇలా అన్నారు: ఓ దైవప్రవక్త(స.అ) నేను మీ ఈ కర్తవ్యంలో సహాయకుడిగా ఉంటాను!
దైవప్రవక్త(స.అ) నా మెడ పై చేయి వేసి ఇలా అన్నారు: నిస్సందేహంగా ఇతడు మీ మధ్య నా వసీ, నా ఉత్తరాధికారి. మీరందరూ ఇతని మాటను వినండి మరియు ఇతని పట్ల విధయేతగా ఉండండి!.[1]
రిఫరెన్స్
1. తారీఖె తబరీ, భాగం2, పేజీ62-63
వ్యాఖ్యానించండి