యజీద్ పై లఅనత్ చేయకండి

మంగళ, 11/01/2022 - 03:22

అల్లాహ్ ఖుర్ఆన్ లో “దుర్మార్గులపై లఅనత్(దైవశాపం) విరుచుకుపడుతుంది”[సూరయె హూద్, ఆయత్18] అని అనెను.

యజీద్ పై లఅనత్ చేయకండి

అల్లాహ్ ఖుర్ఆన్ లో “దుర్మార్గులపై లఅనత్(దైవశాపం) విరుచుకుపడుతుంది”[సూరయె హూద్, ఆయత్18] అని అనెను.

ముందుగా యజీద్ దుర్మార్గుడా కాదా? అని చర్చిద్దాం. అయితే ఇక్కడ కొందరు చరిత్రను వదిలేయండి వారు చేసిన తప్పులకు అల్లాహ్ శిక్షిస్తాడు లేదా ఆయనే చూసుకుంటాడు అని అంటూ ఉంటారు. ఇది కేవలం నోళ్ళను మూయడానికి మరియు ఇస్లాం పెద్దలుగా చెలమాణి అయిన వారి గుట్టలు రట్టు కాకుండా ఉండడానికి పెద్దలు నేర్పించిన ఒక సాకు మాత్రమే.

కొంచెం వివేకంగా ఆలోచిద్దాం.. ఎవరైనా మనపై దౌర్జన్యం చేస్తుంటే మనం అల్లాహ్ చూసుకుంటాడు అని వదిలేస్తామా లేక మనం న్యాయం కోసం తిరగబడతామా...? అలా అయితే హజ్రత్ ఉస్మాన్ ను చంపినవారి విషయంలో పలు ప్రముఖ సహాబీయులు ఎందుకు ముందుకొచ్చి అలీ పై లఅనత్ చేసి వారికి వ్యతిరేకంగా యుద్ధానికి దిగినట్లు!! అంటే వారికి తెలియదా అంతా అల్లాహ్ చూసుకుంటాడు మేము చేతులు మూసుకొని కూర్చుంటే చాలు అని! లేక వారికో న్యాయం మరియు మనకో న్యాయమా!

యజీద్, హుసైన్ ఇబ్నె అలీను చంపమని ఆదేశాలు జారి చేశాడు అన్న విషయాన్ని వివరించిన కొన్ని చరిత్ర గ్రంధాలు:
1. దైవప్రవక్త(స) మనవడు హుసైన్ ఇబ్నె అలీను చంపమని ఆదేశించాడు:
“ముఆవియహ్ మరణించిన తరువాత యజీద్ మదీనహ్ గవర్నర్ అయిన వలీద్ ఇబ్నె ఉఖ్బహ్ కు ఉత్తరం వ్రాసి హుసైన్ ఇబ్నె అలీ, అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ మరియు అబ్దుల్లాహ్ ఇబ్నె జుబైర్ నుంచి తన కోసం బైఅత్ తీసుకోమని, వారు నిరాకరించిన ఎడల వారిని వదలొద్దు అని ఆదేశించాడు.”[1] “హుసైన్ ఇబ్నె అలీ బైఅత్ ను నిరాకరించడంతో మర్వాన్ వారిని ఇక్కడే చంపేద్దాం అని వలీద్ తో కోరాడు, కాని వలీద్ భయపడ్డాడు.”[2]
2. హుసైన్ ఇబ్నె అలీను మక్కాలో చంపాలని అనుకున్నాడు:
“హుసైన్ అబ్నె అలీ మదీనహ్ విడిచి మక్కాకు వెళ్ళారు కాని అక్కడ కూడా చాలా రోజులు ఉండలేక పోయారు, ఎందుకంటే వారిని చంపాలనే యజీద్ అభిప్రాయం మారలేదు గనుక. అబ్దుల్లాహ్ ఇబ్నె జుబైర్ వారితో మక్కాలో ఉండమని కోరినపుడు హుసైన్ ఇబ్నె అలీ ఇలా సమాధానిమిచ్చారు” “నా దృష్టిలో మక్కాలో చంపబడటం కన్నా ఒక్క అడుగు మక్కాకు అవతల చంపబడటం మంచిది, అలాగే ఒక అడుగు అవతల చంపబడటం కన్నా రెండడుగులు అవతల చంపబడటం మంచిది.”[3]
3. హుసైన్ ఇబ్నె అలీ ను కర్బలో చంపేయమని ఆదేశించాడు:
“హుసైన్ ఇబ్నె అలీ మక్కా నుండి కూఫా వైపు ప్రయాణం సాగించారు మధ్యలో, కూఫాకు చెందిన సైన్యం వారిని చుట్టుముట్టింది, యజీద్ ద్వార కూఫాలో గవర్నర్ గా నియమించబడ్డ ఇబ్నె జియాద్, ఉమర్ ఇబ్నె సఅద్ కు హుసైన్ ఇబ్నె అలీ నుండి బైఅత్ తీసుకోమని ఉత్తర్వులు జారీ చేశాడు, వారు నిరాకరించటంతో వారిని చంపారు.”
మరెన్నో గ్రంథాలు వీటిని వివరిస్తున్నాయి....   
యజీద్ పట్ల పలు అహ్లె సున్నత్ ప్రముఖుల అభిప్రాయాలు

1. “జహబీ” ప్రవచనానుసారం “యజీద్ నాసిబీ... చెడు స్వభావం గలవాడు..., తన అధికారాన్ని
హుసైన్ ను చంపి ప్రారంభించి హర్రా సంఘటనతో ముగించాడు”[4]

2. అహ్లె సున్నత్ ప్రముఖ ముహద్దిస్ అయిన “మస్ఊదీ” తన గ్రంథం “మురవ్విజుజ్ జహబ్” లో ఇలా ఉల్లేఖించారు:
“యజీద్ ఆటపాటల సాధనలను వాడేవాడు, కుక్కలతో, కోతులతో ఆడుకునే వాడు, మధ్యం సేవించేవాడు... అతడి అధికార కాలంలోనే సంగీతం(మ్యూజిక్) మక్కా మరియు మదీనహ్ లలో బయటకు వచ్చాయి మరియు ఆటపాటల సాధనాలు తన పని మొదలు పెట్టాయి, ప్రజలు బహిరంగంగా మధ్యం చేవించటం మొదలు పెట్టారు”[5]

కొంచెం సేపు కర్బలా సంఘటనను ఇద్దరు రాజకుమారుల యుద్ధం అని అనుకుందాం (నిజానికి ఈ ఆలోచన ఏమాత్రం యదార్థం కాదు) మరి హర్రా సంఘటనను ఏమని అంటారు, అన్యాయంగా సహాబీయులు చంపబడడాన్ని ఏమంటారు, మద్యం సేవించడాన్ని ఏమంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. అల్లాహ్ ఆదేశాన్ని అనుసరించని వాడు లఅనత్ కు అర్హుడు కాడా, అల్లాహ్ మద్యం సేవించడాన్ని హరామ్ గా నిర్ధారించెను కాని యజీద్ బహిరంగంగా మద్యపానం చేసేవాడు... ఇది చాలదా యజీద్ పై లఅనత్ చేయడానికి...  

రిఫరెన్స్
1. తబరీ, తారిఖుల్ ఉమమ్ వల్ మమ్లూక్ – తారీఖె తబరీ- భాగం5, పేజీ338.
2. దైనవీ, అబూహనీఫహ్ అహ్మద్ ఇబ్నె దావూద్, అల్ అఖ్బారుత్తివాల్, పేజీ228.
3. బిలాజరీ, అన్సాబుల్ అష్రాఫ్, భాగం3, పేజీ163-164.
4. జహబీ, మొహమ్మద్ ఇబ్నె అహ్మద్, సియరు అఅలామిన్ నుబలా, భాగం5, పేజీ6, ఖాహిరహ్, దారుల్ హదీస్, 1427హి.
5. మస్ఊదీ, మురవ్విజుజ్ జహబ్, భాగం3, పేజీ77.

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8