ఇమామత్ పరిశోధన-1

శని, 11/05/2022 - 21:15

ఇస్లాం ధర్మంలో ఇమామత్ యొక్క ప్రాముఖ్యత మరియు దాని గురించి సంక్షిప్త వివరణ....

ఇమామత్ పరిశోధన-1

మనం మన వర్గం గురించి ఎందుకు పరిశోధించాలి? ఎందుకు ముస్లిములు తన వర్గం గురించి పరిశోధించాలి? మేమందరం ముస్లిములు కాదా? మేమందరం రుజుమార్గం పై లేమా?

మంచి మార్గాన్ని ఎన్నుకునే దాసులకు అల్లాహ్ సుభవార్త ఇస్తున్నాడు: “కనక (ఓ ప్రవక్తా!) మాటను శ్రద్ధగా విని, అందులోని ఉత్తమ విషయాలను అనుసరించే నా దాసులకు శుభవార్త అందజెయ్యి. అల్లాహ్ సన్మార్గం చూసిన వారు వీరే. విజ్ఞులు కూడా వీరే”.[సూరయె జుమర్, ఆయత్17-18]

ఇస్లామీయ వర్గాల నుండి ప్రతీ వర్గం తామే స్వర్గానికి వెళ్లే వర్గం అని భావిస్తుంది దీనికి సాక్ష్యం ఇతర వర్గాన్ని అంగీకరించకపోవటం

దైవప్రవక్త(అ.స) ఉల్లేఖనం: “తన మెడ పై బైఅత్ లేకుండా(తన నాయకుడి బైఅత్ చేయకుండా) మరణించినవాడు అజ్ఞానపు మరణాన్ని పొందినట్లే”[1]

హంబలీ వర్గ నాయకులైన అహ్మద్ ఇబ్నె హంబల్ దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనాన్ని ఇలా రచించారు: “ఇమామ్ లేకుండా మరణించినవారి మరణం అజ్ఞానపు మరణం(అవిశ్వాసి మరణం)” [2]

దైవప్రవక్త(అ.స) ఉల్లేఖనం: ఇస్లాం ధర్మం అధికారం చర్య 12 ఖలీఫాలు వచ్చి తమ కర్తవ్యాన్ని నిర్వర్తించనంత వరకు పూర్తవ్వదు” (అనగ నా తరువాత వచ్చే ఖలీఫాల సంఖ్య 12 మంది). ఆ తరువాత రావీ ఇలా వివరించెను.. వారందరూ ఖరైషీయులై ఉంటారు.[4]  

దైవప్రవక్త(అ.స) ఉల్లేఖనం: “నిరంతరం ఇస్లాం ధర్మం ప్రియమైనది, 12 మంది ఖలీఫాల అధికార శాసనం వరకు” [5]

12 మంది ఖలీఫాల హదీసులు కొద్దిపాటి తేడాతో సహాబీయుల నుండి 36 మంది ఉల్లేఖించారు. మన ముహద్దిసీన్ లు వాటిని తమ గ్రంథాలలో రచించారు.

కొన్ని రివాయతుల ప్రకారం ఆ 12 మంది ఖలీఫాలు బనీహాషిమ్ కు చెందినవారు అని ఉల్లేఖించబడి ఉంది.[6]

జాబిర్ ఇబ్నె సమురహ్ కథనం:
“పన్నెండు మంది నాయకులు అవుతారు. (రావీ) అనెను అప్పుడు ఒక మాట అన్నారు నేను వినలేదు. మా తండ్రి గారు ఇలా అన్నారు: వారందరూ ఖురైషీయులై ఉంటారు.[7] 

12 ఖలీఫాల హదీస్ సరైనది అనడానికి కొన్ని నిదర్శనలు:
1. సహీ గ్రంథాలలో ఈ హదీస్ ఉండటం
2. సహీ గ్రంథాల షరత్తుల ప్రకారం రచించబడ్డ గ్రంథాలలో ఉండటం
3. ఈ హదీస్ సరైనది అని ఉలమాలు అంగీకరించటం మొ...

మహా ప్రవక్త(స.అ) యొక్క ఆ పన్నెండు ఖలీఫాలను విశ్వసించే వర్గం ఏ వర్గం అన్న ప్రశ్నకు సమాధానం కోసం పరిశోధించిన వారికి తెలుస్తుంది ఆ వర్గం షియా వర్గం అని

అహ్లె సున్నత్ వర్గానికి చెందిన ప్రముఖ మహద్దిస్ అయిన ఇబ్నె హజర్, మరో ప్రముఖులు అయిన ఇబ్నె జౌజీ పరిశోధనను ఇలా ఉల్లేఖించెను:

నేను ఈ హదీస్(12 ఖలీఫాల హదీస్) గురించి పరిశోధించాను, వివిధ కోణాల నుండి పరిశీలించాను, తెలుసుకోవాలని ప్రయత్నించాను, కాని దీని నిజమైన అర్థం తెలుసుకున్నవారెవ్వరిని చూడలేదు. [8]

క్రమంగా మేము కొన్ని రోజుల నుండి దైవప్రవక్త(స.అ) ఉమ్మత్ 73 వర్గాలుగా విడిపోయే హదీస్ ను పరిశోధిస్తూ వచ్చాము దాని క్రమంలోనే పన్నెండు ఖలీఫాల హదీస్ కూడా మనకు కనిపించింది దానిని ఇరువర్గాల వారి హదీస్ మూల గ్రంథాలలో పరిశోధించడం మొదలు పెట్టాము, ఈ హదీస్ ఇరవర్గాల వారి హదీస్ యొక్క మూల గ్రంథాలలో ఉల్లేఖించబడి ఉంది అని తెలుసుకున్నాము. ఆ తరువాత ఎవరైనా ఆ 12 ఖలీఫాలను నమ్మే వర్గం ఉందా? అని పరిశీలన చేస్తుండగా షియా వర్గం వారు 12 ఖలీఫాలను నమ్ముతారు అని తెలిసింది. వారి హదీస్ మూల గ్రంథాలు ఉదాహరణకు అల్ కాఫీ, మన్ లా యహ్జుర్, కమాలుద్దీన్, బిహారుల్ అన్వార్ మొదలగు గ్రంథాలలో 12 ఖలీఫాలను నమ్ముతారనే విషయమే కాకుండా ఆ పన్నెండు ఖలీఫాల పేర్లు కూడా దైవప్రవక్త(స.అ) వివరించారు అని తెలిసింది.
ఇక అహ్లె సున్నత్ వారి వర్గాలలో ఎవరు దైవప్రవక్త(స.అ) పన్నెండు ఖలీఫాలను నమ్ముతారు అనే పరిశోధన మిగిలి ఉంది.

రిఫరెన్స్
1. సహీ ముస్లిం, భాగం3, పేజీ1478, హదీస్1851.
2. అహ్మద్ ఇబ్నె హంబల్, ముస్నదె అహ్మద్, భాగం4, పేజీ96.
3. సహీ ముస్లిం, భాగం6, పేజీ3, హదీస్1821.
5. సహీ ముస్లిం, హదీస్1820.
6. ఖందూజీ షాఫెయీ, యనాబీవుల్ మువద్దహ్, భాగం3, పేజీ290.
7. సహీ బుఖారీ, హదీస్7223.
8. ఫత్హుల్ బారీ, ఇబ్నె హజరె అస్ఖలానీ, భాగం13, పేజీ181.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9