ముస్లిముల ఐక్యత

మంగళ, 11/08/2022 - 04:29

ముస్లముల ఐక్యత మరియు కలిసిమెలసి ఉండడం పై ఖుర్ఆన్, దైవప్రవక్త(అ.స), అహ్లెబైత్(అ.స) మరియు ఉలమాల ఆదేశాలు మరియు అభిప్రాయాలు...  

ముస్లిముల ఐక్యత

ముస్లిముల ఐక్యత ఖుర్ఆన్ దృష్టిలో

శత్రువులకు నిద్రలేకుండా భయపెడుతూ ఉండే శక్తి పేరు ఐక్యమత్యం. ఈ ఐక్యమత్యమే వారికి ఇష్టముండదు, అందుకనే ప్రాపంచిక మనోవాంఛల అనుచరులు మరియు ఇస్లాం వ్యతిరేకులు మన మధ్య విబేధాలు మరియు అల్లకల్లోలం సృష్టించాలని ఎదురు చూస్తూ ఉంటారు. వారు మన అతి పెద్ద శక్తి అయిన ఐక్యమత్యాన్ని నాశనం చేసి మనల్ని విడగొట్టి మన పై అధికారం చేయాలని అనుకుంటారు.

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ఉపదేశించెను:  “దీన్ ధర్మాన్నే నెలకొల్పాలనీ, అందులో చీలిక తీసుకు రావద్దనీ ఉపదేశించాము. (ఓ ముహమ్మద్[స.అ]!) నువ్వు ఏ విషయం వైపునకు వారిని పిలుస్తున్నావో అది బహుదైవారాధకులకు చాలా భారంగా తోస్తుంది”[సూరహ్ షూరా, ఆయత్13] ఇదీ ఐక్యమత్యంలో ఉన్న ప్రత్యేకతా మరియు శక్తి.

ఐక్యమత్యం దైవప్రవక్త(స.అ) దృష్టిలో

ఐక్యమత్యం గురించి దైవప్రవక్త(స.అ) ఇలా ఉపదేశించేవారు: “ప్రజలారా!  కలిసి ఐక్యమత్యంగా ఉండండి
వేర్వేరుగా ఉండకండి”[1]

మరో చోట దైవప్రవక్త(స.అ) ఇలా ఉపదేశించారు: “అల్లాహ్ కారుణ్యం ఐక్యమత్యంగా ఉండేవారిపై ఉంటుంది సమూహాని వ్యతిరేకంగా ఉండేవారితో పాటు నిరంతరం షైతాన్ ఉంటాడు”[2]

ఐక్యమత్యం హజ్రత్ అలీ(అ.స) దృష్టిలో

హజ్రత్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] ఇలా ప్రవచించెను: “... మరియు అల్లాహ్ పట్ల భయం కలిగి ఉండు. ప్రాణం, ధనం మరియు నోటి ద్వార జిహాద్ విషయంలో పరస్పరం ఒకరితో మరొకరి సంబంధాలను అనుకూలంగా చేసుకోండి, ఒకరినొకరు సహాయపడండి. ఖబడ్డార్! ఒకరిని చూసి ఒకరు ముఖాలను త్రిప్పుకోకండి, సంబంధాలను తెంచుకోకండి, మంచి పట్ల ప్రేరణ మరియు చెడు పట్ల నిషేధన(అమ్ర్ బిల్ మారూఫ్ వ నహ్యి అనిల్ మున్కర్)ను వదలకండి దాంతో మీ పై దుర్మార్గులు అధికారం చెలాయిస్తారు ఆపై మీరు మొర పట్టుకొన్నా దానిని వినే వారు ఉండరు[3]
మరో చోట ఇలా ఉల్లేఖించారు: “నిస్సందేహముగా షైతాన్ నీకోసం మార్గాలను శులభం చేస్తాడు.... అతడు నిన్ను ఐక్యత నుండి విభజన యొక్క ఆపదలలో ముంచేయాలని అనుకుంటాడు, అందుకని అతడి వలలో చిక్కకుండా అతడి నుండి ముఖాన్ని త్రిప్పుకోండి”[4]

ఆయతుల్లాహ్ ఖుమైనీ(ర.అ) దృష్టిలో

ఆయతుల్లాహ్ ఖుమైనీ(ర.అ) ముస్లిం వర్గాల మధ్య ఐక్యత గురించి చాలా పోరాడారు. వారు ముస్లిములందరూ సోదరులు అని భావించే వారు. అందరూ కలిసి ఉండాలని ఆదేశించేవారు. వారి రచించిన గ్రంథాల నుండి ముస్లిముల ఐక్యత ప్రాముఖ్యత గురించి చెప్పిన కొన్ని మాటలు ఇక్కడ తెలుసుకుందాం.

“మేమందరం ఒకటే, వేర్వేరు కాదు. మాలో ఉన్న అభిప్రాయబేధం, వర్గాలకు బట్టి మాత్రమే; ఈ బేధం ఇస్లాం యొక్క మూలాంశాలలో బేధానికి కారణం కాకూడదు. చూస్తూనే ఉన్నాము ఇప్పుడు ఇస్లాం ప్రమాదంలో ఉంది అని, మనం చేయిచేయి కలిపి ఐక్యమత్యంగా ఉండి మునుపటి పొరపాట్లను దూరం చేసుకొని, మమ్మల్ని విడదీయాలనె చేతులను కోసేద్దాం”[5]

“మేమూ అహ్లె తసన్నున్ ఇద్దరం ఒకటే; మేము ముస్లిములం మరియు సోదరులం. ఒకవేళ ఎవరైనా ముస్లిముల మధ్య వివాదం ఎర్పడే విధంగా మాట్లాడితే తెలుసుకోండి అతడు అజ్ఞాని అయినా అయి ఉండాలి లేదా ముస్లిములను విడదీయాలని అనుకొనేవాడై ఉండాలి”[6]

ఆయతుల్లాహ్ ఖామెనయీ (అల్లాహ్ వీరిని కాపాడుగాక) దృష్టిలో

సుప్రీమ్ లీడర్ ఖమెనయీ (అల్లాహ్ వీరిని కాపాడుగాక) కూడా దైవప్రవక్త(స.అ), వారి అహ్లె బైత్(అ.స) మరియు ఆయతుల్లాహ్ ఖుమైనీ(ర.అ) అడుగు జాడల్లో నడుస్తూ వీరు కూడా ముస్లిముల ఐక్యమత్యం గురించి ఇలా వివరించారు: “ప్రస్తుత కాలంలో శత్రువులకు అవకాశం దొరికే లేదా ముస్లిముల మధ్య వైరుధ్యానికి కారణం అయ్యే వ్యాఖ్యలు లేదా చర్యలకు పాల్పడటం షరా పరంగా హరామ్ (ఖండించబడినవి)”[7]

ఆయతుల్లాహ్ బహ్జత్(వీరి ఆత్మకు శాంతి కలుగుగాక) దృష్టిలో

“ముస్లిముల మధ్య ఐక్యమత్యాన్ని కోరనివాడు ముస్లిమేకాడు”[8]

ఆయతుల్లాహ్ సీస్తానీ(అల్లాహ్ వీరిని కాపాడుగాక) దృష్టిలో

“అహ్లెసున్నత్ మా సోదరులు కాదు వారు మా ప్రాణం, వారు మా ఆత్మ”

చివరిమాట

కొందరితో వచ్చే కష్టం ఇదే... చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోరు. ఐక్యమత్యంగా ఉండటం అంటే తమ తమ విశ్వాసాల పరంగా అభిప్రాయబేధాలు ఉన్నపట్టికీ శత్రువులకు మనం ఒకటే అని తెలియపరచటం. మన ఐక్యత భావాన్ని చూసి శత్రువులూ కపటులూ ఇస్లాం వైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడాలి. కాని ఇప్పుడు మన ఇరువర్గాలలో ఇటు వహాబీయులు(నాసిబీ, ఖారిజీ), అటు గాలీయులు(మలంగ్, అఖ్బారీయులు), వ్యాఖ్యులు మరియు చర్యల ద్వార మంటలు రేపుతున్నరు ఈ అవకాశాన్ని శత్రువులు బాగా ఉపయోగించుకుంటున్నారు. సాధారణ వ్యక్తులు ఈ మతోన్మాధుల పిచ్చికి బలైపోతున్నారు.
ఐక్యమత్యానికి ఉదాహారణ: ఇంట్లొ ఎన్నో గొడవలుంటాయి... కాని వారు ఎప్పుడైనా బయటవారిని మీ ఇంటి గొడవలలో జోక్యం చేయడానికి అంగీకరిస్తారా..???
అర్థం అయి ఉంటుంది అని భావిస్తున్నాము... ముస్లిముల ఐక్యతకు సహకరించకపోయినా పర్వాలేదుగాని చెడగొట్టడానికి కారణం కావద్దు... ప్లీజ్... 

రిఫరెన్స్
1. మీజానుల్ హిక్మహ్, హదీస్2434.
2. కన్జుల్ ఉమ్మాల్, హదీస్1031.
3. నెహ్జుల్ బలాగహ్, వసియ్యత్41, పేజీ566.
4. నెహ్జుల్ బలాగహ్, ఖుత్బహ్:121, పేజీ239.
5. సహీఫయె ఇమామ్ 18/11/1357.
6. సహీఫయె ఇమామ్, భాగం6, పేజీ133.
7. https://www.hawzahnews.com/news/891633/خدمات-انقلاب-به-اهل-سنت-در-طول-تاریخ-بی-سابقه-است-مقام-معظم
8. నూర్ న్యూస్, న్యూస్ కోడ్56031, 4/8/1399.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 13 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 5