మృత్యువు

మంగళ, 11/08/2022 - 07:19

మృత్యువు మరియు దాని ఆలోచన కలిగి ఉండడం వల్ల కలిగే లాభాలు మరియు ప్రభావాల గురించి సంక్షిప్త వివరణ...  

మృత్యువు

ఖుర్ఆన్ అనుసారం ప్రతీ ప్రాణికి మృత్యువు రుచి చూడడం తప్పని సరి. మీరు మృత్యువు నుండి పారిపోతున్నారు నిస్సందేహంగా అది మీతో వచ్చి కలుస్తుంది. అలాగే ఈ లోకంలో ఏది మిగలదు కేవలం అల్లాహ్ అస్తిత్వం తప్ప. ఆలాగే దైవప్రవక్త(స.అ) మరియు వారి అహ్లె బైత్(అ.స) కూడా మృత్యువు గురించి చాలా విషయాలు చెప్పారు వాటి నుండి కొన్ని ఇక్కడ మీ కోసం:

హజ్రత్ అలీ(అ.స) ఉల్లేఖనం: ప్రతీ ప్రాణికి మరణం అనేది ఉంది[1]

హజ్రత్ అలీ(అ.స) ఉల్లేఖనం: మృత్యువు సంభవంతో నీ జీవిత అధ్యాయం మూసివేయబడుతుంది.[2]

హజ్రత్ అలీ(అ.స) ఉల్లేఖనం: మృత్యువు పరలోకానికి ద్వారం(లాంటిది).[3]

హజ్రత్ అలీ(అ.స) ఉల్లేఖనం: మృత్యువు అంతిమ పని, ప్రపంచం సాధన మైదానం, ప్రళయం పోటీ ప్రదేశం మరియు స్వర్గం ఆ పోటీ యొక్క బహుమతి.[4]

హజ్రత్ అలీ(అ.స) ఉల్లేఖనం: అల్లాహ్ వద్ద ఒక దూత ఉన్నాడు అతడు ప్రతీ రోజు ఇలా అరుస్తూ ఉంటాడు: జన్మించండి మరణించేందుకు, ప్రోగు చేయండి నాశనం చేయడం కోసం, తయారు చేయండి పాడు చేయడం కోసం.[5]

దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: మృత్యువు విశ్వాసుని రైహానహ్(తులసి).[6]

దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: మృత్యువు విశ్వాసి యొక్క బహుమతి.[7]

హజ్రత్ అలీ(అ.స) ఉల్లేఖనం: హృదయం విశ్వాసం మరియు ధర్మనిష్ఠాలతో నిండి ఉన్న వారికి మృత్యువు ఎంత మంచి లాభామో![8]

హజ్రత్ అలీ(అ.స) ఉల్లేఖనం: మంచి వారి మృత్యువు వారి దేహానికి మంచిది, చెడ్డవారి మృత్యువు ప్రజలకు మంచిది.[9]

ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: మృత్యువును నిత్యం గుర్తుపెట్టుకోవడం; మనోవాంఛలను లోపలే చంపేస్తుంది, నిర్లక్ష్య మొక్కలను మెలవకుండా చేస్తుంది, హృదయాన్ని అల్లాహ్ ప్రమాణాల పట్ల బలపరుస్తుంది, స్వభావాన్ని సున్నితంగా చేసి, మనోవాంఛల సంకేతాలను విరిచేస్తుంది.[10]

దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: మృత్యువును ఎక్కువగా గుర్తు చేస్తూ ఉండు, ఎందుకంటే అల్లాహ్ ఎవరి హృదయాన్ని అయితే (ఆథ్యాత్మిక) జీవం పోస్తాడు వాడు తప్ప మరొకడు మృత్యువును గుర్తు చేయడు. ఇలాంటి వాడికి మృత్యువు ను సౌకర్యంగా మారుస్తాడు.[11]

దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: ఓ తారిఖ్! మృత్యువు రాక ముందే సిద్ధంగా ఉండు.[12]

దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: ఉత్తమ ఆరాధన మృత్యువును గుర్తు చేయడం మరియు ఉన్నత ఆలోచన మృత్యువు గురించి ఆలోచించడం.[13]

ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: ఎవరైతే కఫన్ ను ఇంట్లో పెట్టుకుంటాడో, అతడి పేరు నిర్లక్ష్యుల పేర్లలో లిఖించబడదు, దాన్ని చూసినప్పుడల్లా అతడికి పుణ్యం లభిస్తుంది.[14]

ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: ఎప్పుడైనా ఒకరి అంతిమ ప్రయాణంలో జనాజా కు భుజం ఇచ్చినప్పుడు, భుజాల పై తీసుకెళ్తున్న వ్యక్తి నువ్వే అని భావించు.[15]

దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: మృత్యువును ఎక్కువగా గుర్తు చేస్తూ ఉండు ఎందుకంటే దాంతో ఈ ప్రాపంచిక ఆశలు తరుగుతాయి.[16]

దైవప్రవక్త(స.అ) తమ సహాబీయులను ఇలా ప్రశ్నించారు.. మీరందరూ స్వర్గానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారా? వారందరూ ఇలా అన్నారు: ఔను దైవప్రవక్త!. దైవప్రవక్త(స.అ) ఇలా అన్నారు: (అయితే) ఆశలను తగ్గించుకోండి, మృత్యువును మీ కళ్ల ముందే ఉంచండి మరియు అల్లాహ్ పట్ల ఎలా బిడియం కలిగి ఉండాలో అలా ఉండండి.[17]

రిఫరెన్స్
1. వాసెతీ, ఉయూనుల్ హికమ్ వల్ మవాయిజ్, పేజీ401.
2. నెహ్జుల్ బలాగహ్, ఖుత్బా155., అల్ కాఫీ, భాగం2, పేజీ49, హదీస్1.
3. తమీమీ ఆముదీ, గురరుల్ హికమ్, పేజీ161, హదీస్3083.
4. నెహ్జుల్ బలాగహ్, ఖుత్బాహ్105; బిహారుల్ అన్వార్, భాగం65, పేజీ382, బాబ్27, హదీస్32.
5. నెహ్జుల్ బలాగహ్, కలిమా132; బిహారుల్ అన్వార్, భాగం79, పేజీ180, బాబ్20, హదీస్25.
6. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం79, పేజీ179, బాబ్20, హదీస్23.
7. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం79, పేజీ171, బాబ్20, హదీస్6.
8. తమీమీ ఆముదీ, గురరుల్ హికమ్, పేజీ271, హదీస్5935.
9. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం79, పేజీ181, బాబ్20, హదీస్28.
10. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం6, పేజీ133, బాబ్4, హదీస్32.
11. ముత్తఖీయె హిందీ, కన్జుల్ ఉమ్మాల్, భాగం15, పేజీ544, హదీస్42105.
12. షేఖ్ అబ్బాసె ఖుమ్మీ, ఫైజుల్ ఖదీర్, భాగం1, పేజీ628., అల్ ముస్తద్రికు అలస్ సహీహైన్, భాగం4, పేజీ312.
13. షేఖ్ సదూఖ్, జామిఉల్ అఖ్బార్, పేజీ473, హదీస్1334.
14. కులైనీ, మొహమ్మద్ బిన్ యాఖూబ్, అల్ కాఫీ, భాగం1, పేజీ577.
15. హుసైన్ ఇబ్నె సయీద్, అల్ జొహ్ద్, భాగం77, పేజీ208.
16. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం82, పేజీ167, హదీస్2.
17. వర్రామ్ బిన్ అబీ ఫరాసె హిల్లీ, తంబీహుల్ ఖవాతిర్స భాగం1, పేజీ272.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11