రజ్అత్ ఖుర్ఆన్ మరియు సున్నత్ ప్రకారంగా నిరూపితమైనది. రజ్అత్ అల్లాహ్కు అసాధ్యం కాదు. అన్న అంశాల పై ఖుర్ఆన్ నిదర్శనలు...

రజ్అత్ ఖుర్ఆన్ మరియు సున్నత్ ప్రకారంగా నిరూపితమైనది. రజ్అత్ అల్లాహ్కు అసాధ్యం కాదు. ఖుర్ఆన్ యొక్క కొన్ని ఉదాహారణాలు తిలకించండి:
1. ఆయత్: లేక ఉదాహారణకు – ఇళ్ళ కప్పులు తల క్రిందులుగా పడివున్న పట్టణం మీదుగా ప్రయాణం చేసిన వ్యక్తిని చూడు. అతడు ఆశ్చర్యంతో ఇలా పలికాడు: “శిథిలయమైపోయిన ఈ పట్టణానికి అల్లాహ్ మళ్ళీ ఏవిధంగా జీవం పోస్తాడు” అప్పుడు అల్లాహ్ అతని ప్రాణాన్ని తీసేశాడు. ఆ స్థితిలో అతడు నూరేళ్ళ వరకు ఉన్నాడు. తరువాత అల్లాహ్ అతనిని మళ్ళి బ్రతికించాడు[1]
2. ఆయత్: మరణభీతితో తన ఇళ్ళూవాకిళ్ళను విడిచి వెళ్ళిన వారి ఉదంతాన్ని గురించి నీవు తలపోశావా? వారు వేల సంఖ్యలో ఉండేవారు. అల్లాహ్ వారితో “చావండి” అని అన్నాడు. మళ్ళీ ఆయన వారిని బ్రతికించాడు.[2]
3. ఆయత్: మూసాతో మీరు అన్న మాటలను జ్ఞప్తికి తెచ్చుకోండి: “మూసా! అల్లాహ్ను కళ్ళారా చూడనంత వరకు, నీ మాటలను ఎంత మాత్రం విశ్వసించము” అదే సమయంలో మీరు చూస్తూ ఉండగానే, ఒక భయంకరమైన పిడుగు మీపై పడింది. మీరంతా నిర్జీవులై నేలకొరిగారు. మళ్ళి మేము ప్రాణంపోసి మిమ్మల్ని లేపాము, కనీసం ఈ ఉపకారం తరువాతైనా మీరు కృతజ్ఞత చూపుతారేమో అని.[3]
ఇందులో పూర్తి ఒక వర్గం పునర్జీవనం ప్రస్తావన ఉంది.
4. ఆయత్: ఆ తరువాత మేము వారిని మేల్కోలిపాము, ఆ రెండు వర్గాలలో ఏ వర్గం వారు తాము గుహలో ఉన్న కాలాన్ని కచ్చితంగా లెక్కకడతారో పరీక్షిద్దామని.[4]
ఈ ఆయత్లో “అస్హాబె కహఫ్”కు పునర్జీవితం ప్రసాదించబడిన ప్రస్తావన ఉంది, వీళ్ళు ఒక గుహలో మూడు వందల సంవత్సరముల కన్న ఎక్కువ మృతులుగా పడి ఉన్నారు.
ఖుర్ఆన్లో పూర్వ ఉమ్మతులలో “రజ్అత్” సంభవించిన ప్రస్తావన ఉంది. అందుకని ఈ రజ్అత్ ఉమ్మతే ముహమ్మదీ(స.అ)లో(సంభవించడం) అసాధ్యం కాదు మరియు కాకూడదు. ముఖ్యంగా దాని గురించి ఆయిమ్మయే అహ్లెబైత్(అ.స)లు రివాయత్ కూడా చేశారు. ఇక అసాధ్యం అయ్యే సమస్యే లేదు. ఎందుకంటే వీళ్ళు సత్యులు మరియు జ్ఞానులు కాబట్టి.
ఇక మిగిలింది “తుఫైలీయు”లలో కొందరు చెప్పే ఈ మాట “రజ్అత్ యొక్క అర్ధం ‘తనాసుఖ్’ (ఒక రూపం నుండి మరో రూపంలోకి మారడం) మరియు ‘తనాసుఖ్’ అవిశ్వాసుల నమ్మేటువంటి విశ్వాసం. అయితే ఈ రజ్అత్ కూడా అవిశ్వాసుల విశ్వాసమే” అయితే ఇది పూర్తిగా దుష్ట మరియు వ్యర్ధ వచనం. దీని ఉద్దేశం కేవలం షియా ముస్లిములను ఎత్తిపొడుపు కోసమే. ఎందుకంటే “తనాసుఖ్”ను విశ్వాసించే వారు ఎన్నడూ “మనిషి ఇహలోకంలోనే తన అసలు శరీరం, ఆత్మ, రూపం మరియు నిజస్వరూపంతో పాటు మరలా తిరిగి వస్తాడు” అని చెప్పరు. వాళ్ళు “ఎవరైన మరణిస్తే అతడి ఆత్మ వేరే తాజాగా పుట్టే మనిషిలో ప్రవేశిస్తుంది అంతే కాదు ఇలా కూడా జరిగే అవకాశం ఉంది ఒక చనిపోయిన మనిషి ఆత్మ తాజాగా పుట్టే జంతువులో కూడా ప్రవేశించవచ్చు” అని నమ్ముతారు. మరి ఈ విశ్వాసం ముస్లిముల విశ్వాసం ఏమాత్రం కాదు. ముస్లిములు “అల్లాహ్ చనిపోయిన వాళ్ళను వాళ్ళ వాళ్ళ శరీరాల మరియు ఆత్మలతో పాటు లేపుతాడు” అని విశ్వసిస్తారు. అందుకని “రజ్అత్” మరియు “తనాసుఖ్” మధ్య భూమికి ఆకాశానికి గల తేడా ఉంది. ఈ వచనం “షియ్ఉయ్యాహ్” మరియు “షీఅత్”లో తేడాను గుర్తించలేని ఆ అజ్ఞానుల వచనం వలే ఉంది.
రిఫరెన్స్
1. అల్ బఖరా సూరా:2, ఆయత్:259. أَوۡ كَٱلَّذِي مَرَّ عَلَىٰ قَرۡيَةٖ وَهِيَ خَاوِيَةٌ عَلَىٰ عُرُوشِهَا قَالَ أَنَّىٰ يُحۡيِۦ هَٰذِهِ ٱللَّهُ بَعۡدَ مَوۡتِهَاۖ فَأَمَاتَهُ ٱللَّهُ مِاْئَةَ عَامٖ ثُمَّ بَعَثَهُ
2. అల్ బఖరా సూరా:2, ఆయత్:243. أَلَمۡ تَرَ إِلَى ٱلَّذِينَ خَرَجُواْ مِن دِيَٰرِهِمۡ وَهُمۡ أُلُوفٌ حَذَرَ ٱلۡمَوۡتِ فَقَالَ لَهُمُ ٱللَّهُ مُوتُواْ ثُمَّ أَحۡيَٰهُمۡ
3. అల్ బఖరా సూరా:2, ఆయత్:55, 56. وَإِذۡ قُلۡتُمۡ يَٰمُوسَىٰ لَن نُّؤۡمِنَ لَكَ حَتَّىٰ نَرَى ٱللَّهَ جَهۡرَةٗ فَأَخَذَتۡكُمُ ٱلصَّٰعِقَةُ وَأَنتُمۡ تَنظُرُونَ ثُمَّ بَعَثۡنَٰكُم مِّنۢ بَعۡدِ مَوۡتِكُمۡ لَعَلَّكُمۡ تَشۡكُرُونَ
4. కహఫ్ సూరా:18, ఆయత్:12. ثُمَّ بَعَثۡنَٰهُمۡ لِنَعۡلَمَ أَيُّ ٱلۡحِزۡبَيۡنِ أَحۡصَىٰ لِمَا لَبِثُوٓاْ أَمَدٗا
వ్యాఖ్యానించండి