హజ్రత్ అబూబక్ర్ ఖిలాఫత్ హదీస్ పరిశీలన-1

గురు, 11/10/2022 - 14:27

హజ్రత్ అబూబక్ర్ ఖిలాఫత్ పై నిదర్శించబడిన సహీ ముస్లిం హదీస్ పై పరిశీలన మరియు ముఖ్యాంశాల వివరణ... 

హజ్రత్ అబూబక్ర్ ఖిలాఫత్ హదీస్ పరిశీల

అబూబక్ర్ ఖిలాఫత్ పై అహ్లెసున్నత్ హదీస్ నిదర్శనం పై సమాధానం

మొట్టమొదటి సారి ఈ హదీస్ ను హజ్రత్ అబూబక్ర్(ర.అ) గారి ఖిలాఫత్ పై నిదర్శించిన వ్యక్తి ఇబ్నె హజర్ అస్ఖలానీ, ఈ హదీస్ సహీ ముస్లిం[1]లో హజ్రత్ ఆయిషా ద్వార ఉల్లేఖించబడి ఉంది. ఈ హదీస్ అరబీలో:
أخرج مسلم عن عائشة قالت قال لی رسول الله ص ادعی لی أباك و أخاك حتى أكتب كتابا فإنی أخاف أن يتمنى متمن و يقول قائل أنا أولى و يأبى الله و المؤمنون إلا أبا بكر

ఇందులో కొన్ని దోషాలున్నాయి, అవి:
1. (వేరే రివాయతుల ఆధారంగా) మొత్తానికి దైవప్రవక్త(స.అ) చివరి దశలో ఎటువంటి వసీయత్ చేయలేదు, అని చెప్పారు.
రివాయత్: దైవప్రవక్త(స) ప్రాణాలు పోయేటప్పుడు వారి తల నా ఒడిలో ఉంది, నాకు తెలియకుండానే వారు ఎలా వసీయత్ చెసుంటారు!!.
2. హజ్రత్ ఆయిషా తన మరియు తన తండ్రి గురించి ప్రతిష్టతను నిరూపించుకోవాలనుకుంటున్నారు. అందుకని వారు ఆరోపణకు గురి అయి ఉన్నారు. ఎందుకంటే హజ్రత్ అలీ(ర) ఆమె శత్రుత్వం అందరికి తెలిసిందే. చాలా రివాయతులలో ఈ విషయం చెప్పడం జరిగింది. చివరికి సహీ బుఖారీలో కూడా ఇలా ఉల్లేఖించబడి ఉంది: “దైవప్రవక్త(స.అ) అనారోగ్యంతో ఉన్నప్పుడు వారు ఇద్దరి సహాయంతో ఇంటి నుండి బయటకు వచ్చారు వారి కుడి వైపు ఒక వ్యక్తి ఉన్నాడు ఎడమ వైపు ఫుజైల్ ఇబ్నె అబ్బాస్ ఉన్నారు. ప్రవక్త(స.అ) చాలా కష్టంగా మస్జిద్ కు వచ్చి నమాజ్ చదివారు. హజ్రత్ ఆయిషా (దైవప్రవక్త(స.అ) కుడివైపు ఉన్న వ్యక్తి) చెప్పని ఆ వ్యక్తి పేరు గురించి ప్రశ్నించబడినపుడు, రావీ తెలియదు అని అన్నాడు. అప్పుడు ఇబ్నె అబ్బాస్ ఇలా అన్నారు: ఆ వ్యక్తి అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స), అతని పేరు చెప్పడం ఆయిషాకు నచ్చదు”. ఈ హదీస్ అరబీలో:
حَدَّثَنَا إِبْرَاهِيمُ بْنُ مُوسَى قَالَ أَخْبَرَنَا هِشَامُ بْنُ يُوسُفَ عَنْ مَعْمَرٍ عَنِ الزُّهْرِىِّ قَالَ أَخْبَرَنِى عُبَيْدُ اللَّهِ بْنُ عَبْدِ اللَّهِ قَالَ قَالَتْ عَائِشَةُ لَمَّا ثَقُلَ النَّبِىُّ - صلى الله عليه وسلم - وَاشْتَدَّ وَجَعُهُ اسْتَأْذَنَ أَزْوَاجَهُ أَنْ يُمَرَّضَ فِى بَيْتِى فَأَذِنَّ لَهُ، فَخَرَجَ بَيْنَ رَجُلَيْنِ تَخُطُّ رِجْلاَهُ الأَرْضَ، وَكَانَ بَيْنَ الْعَبَّاسِ وَرَجُلٍ آخَرَ. قَالَ عُبَيْدُ اللَّهِ فَذَكَرْتُ ذَلِكَ لاِبْنِ عَبَّاسٍ مَا قَالَتْ عَائِشَةُ فَقَالَ لِى وَهَلْ تَدْرِى مَنِ الرَّجُلُ الَّذِى لَمْ تُسَمِّ عَائِشَةُ قُلْتُ لاَ. قَالَ هُوَ عَلِىُّ بْنُ أَبِى طَالِبٍ
హజ్రత్ అలీ(అ.స) పట్ల ఆమెకు ఉన్న ద్వేషం, వైరం ఎలాంటిదంటే జమల్ యుద్ధానికి వెళ్తుండగా హౌఅబ్ ప్రదేశంలో కుక్కలు మొరుగాయి, దైవప్రవక్త(స.అ) చెప్పిన మాటలు గుర్తుకొచ్చినా సరే హజ్రత్ అలీ పట్ల వైరం వల్ల దైవప్రవక్త(స.అ) చెప్పిన మాటను కూడా లెక్క చేయకుండా ముందుకు వెళ్ళిపోయారు.[2]

3. ఒకవేళ ఈ హదీస్ హజ్రత్ అబూబక్ర్ ఖిలాఫత్ పై ఆధారమై ఉంటే వారెందుకని ఎక్కడా తన ఖిలాఫత్ ను నిరూపించే విషయంలో ఈ హదీస్ ద్వార నిదర్శించలేదు!?
4. ఈ హదీస్ ను ఖిలాఫత్ పై నిదర్శించిన ఇబ్నె హజర్ ఎందుకని గదీర్ హదీస్ లో ఉన్న ఔలా(اولیٰ ( పదాన్ని వలీ మరియు ఇమామ్ అర్ధాలు కావు అని నిరాకరించారు? మరి ఇక్కడ ఔలా పదాన్ని ఇమామ్ మరియు ఖలీఫాగా ఎలా అంగీకరించినట్లు?
5. ఈ హదీస్ లో ఉన్న మరో దోషమేమిటంటే, హదీస్ లో قائل  అని ఉంది. హదీస్ జ్ఞానం కలిగి ఉన్నవారికి తెలుసు హదీస్ లో ఈ పదం(قائل ( ద్వార దైవప్రవక్త(స.అ) చెప్పారు అని మాత్రం నిదర్శించలేము.
6. ఈ హదీసును ఇబ్నె అబిల్ హదీద్ జయీఫ్ హదీస్ గా ప్రకటించారు.
7. చివరిగా అహ్లె సున్నత్ ప్రముఖ ముహద్దిసీనుల గ్రంథాలు కన్జుల్ ఉమ్మాల్ మరియు ఇబ్నె అబీల్ హదీద్ నుండి ఒక రివాయత్ ప్రదర్శించాలనుకుంటున్నాము: ఉబైదుల్లాహ్ ఇబ్నె అమ్ర్ ఉల్లేఖనం: “దైవప్రవక్త చివరి దశ(అనారోగ్యం)లో ఇలా అన్నారు.. నా సోదరుడ్ని పిలవండి. అబూబక్ర్ వచ్చారు, అతడి వైపు నుండి ముఖం తిప్పుకున్నారు. మరలా నా సోదరుడ్ని పిలవండి అని అన్నారు. ఉస్మాన్ వచ్చారు, అతడి వైపు నుండి కూడా ముఖం త్రిప్పుకున్నారు. చివరిలో అలీ(ర)ను కోరారు, అతనిని తన దగ్గరకు తీసుకున్నారు”.[3] 

రిఫరెన్స్
1. సహీ ముస్లిం, భాగం7, పేజీ110.
2. అల్ ఇమామతు వస్సియాసత్, ఇబ్నె ఖుతైబహ్ దైనవీ. షర్హె నెహ్జులు బలాగహ్, ఇబ్నె అబిల్ హదీద్.
3. కన్జుల్ ఉమ్మార్, భాగం6, పేజీ392. ఇబ్నె అబిల్ హదీద్, భాగం2, పేజీ78.

https://www.eshia.ir/feqh/archive/text/rabani/khase/91/048/

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10