మూసా ముబర్రఖా(ర.అ)

బుధ, 11/16/2022 - 02:33

అహ్లె బైత్(అ.స) వంశానికి చెందిన ప్రముఖ వ్యక్తి మరియు ఉత్తమలు అయిన జనాబె మూసా ముబర్రఖా గురించి సంక్షిప్త వివరణ...

మూసా ముబర్రఖా(ర.అ)

హజ్రత్ మూసా ముబర్రఖా(అ.స), హజ్రత్ ఇమామ్ ముహమ్మద్ తఖీ(అ.స) యొక్క కుమారులు. వారి కున్నియత్ అబూ జాఫర్, వారు హజ్రీ యొక్క 296వ సంవత్సరం రబీవుస్సానీ నెల 22 వ తేదీన జన్మించారు.[1]

ఉమ్దతుత్ తాలిబ్ గ్రంథ రచయిచ వారి గురించి ఇలా అన్నారు.. మూసా ముబర్రఖా(అ.స) ఇమామ్ జవాద్(అ.స) యొక్క కుమారులు, వారి తల్లి ఖుమ్ లో మరణించారు, అక్కడే ఆమెను సమాధి చేశారు. వారి కుమారులు రజవియ్యూన్ అని పిలవబడే వారు, వాళ్లు కూడా ఖుమ్ లోనే ఉండేవారు కాని వాళ్లలో చాలా తక్కువ మంది మాత్రమే ఉండేవారు.

హసన్ బిన్ అలీ ఖుమ్మీ తన గ్రంథం తారీఖెచె ఖుమ్ లో హుసైన్ ఇబ్నె మొహమ్మద్ ఇబ్నె నస్ర్ వ్రాసిన రిజాయియ్యహ్ పుస్తకం నుండి ఇలా లిఖించారు.. రజవీ సాదాత్ నుండి హిజ్రీ యొక్క 256వ సంవత్సరంలో ఖుమ్ కు వలసి వచ్చిన మొట్టమొదటి వ్యక్తి అబూమూసా ఇబ్నె మొహమ్మద్ ఇబ్నె అలీ (అనగా మూసా ఇబ్నె ముబర్రఖా). వారు నిత్యం తన ముఖం పై ముసుగు వేసుకొని ఉండేవారు.

అరేబీయా పెద్దలు వారికి ..నువ్వు పట్టణాన్ని వదిలి వెళ్లిపో.. అని వార్త ఇచ్చినప్పుడు వారు తన ముఖం నుండి ముసుగు తీసేశారు, ఎవ్వరూ వారిని గుర్తు పట్టలేదు. ఆ తరువాత మూసా ముబర్రఖా ఖుమ్ నుండి కాషాన్ పట్టణం వైపుకు వెళ్లిపోయారు. అక్కడ వారిని అహ్మద్ ఇబ్నె అబ్దుల్ అజీజ్ ఇబ్నె దల్పె అజలీ ఆహ్వానించారు. వారికి విలువైన మరియు ఖరీదైన దుస్తులు, మంచి గుర్రాలు కానుకగా ఇచ్చారు. ప్రతీ సంవత్సరం వారికి జీతం రూపంలో వెయ్యి తులాల బంగారం నిర్ణయించారు.

మూసా ముబర్రఖా ఖుమ్ నుండి వెళ్లిన తరువాత అరేబీయు దేశానికి చెందిన ఉన్నతాధికారుల నుండి హుసైన్ ఇబ్నె అలీ ఇబ్నె ఆదమ్ మరియు మరొకరు ఖుమ్ పట్టణానికి చేరుకున్నారు. ఖుమ్ వాసులకు మూసా ముబర్రఖాను వెళ్లగొట్టినందుకు చీవాట్లు పెట్టారు. చివరికి అరేబీయ దేశపు పెద్దలను వారిని ఖుమ్ కు తిరిగి రమ్మని కోరడానికి కాషాన్ కు పంపారు. వారిని క్షమించమని కోరారు, వారిని గౌరవించారు, వారి కోసం ఇంటిని కొన్నారు. 20 వేల దిర్హములు వారికి ఇచ్చారు మరియు వారి కోసం చాలా భూములు కొన్నారు. ఆ తరువాత వారి చెల్లెళ్లు జైనబ్, ఉమ్మె మొహమ్మద్ మరియు మైమూనహ్ లు వారి వద్దకు వచ్చేశారు. వీళ్లు మరణించినప్పుడు వీళ్లను హజ్రత్ మాసూమహ్(స.అ) సమాధి ప్రక్కనే వారిని ఖననం చేశారు.

మూసా ముబర్రఖా(ర.అ) తన జీవిత చివరి క్షణాల వరకు ఖుమ్ లోనే ఉన్నారు. వారు ఖుమ్ లోనే తమ ప్రాణాలు వదిలారు. వారుని తన ఇంట్లోనే సమాధి చేశారు. ఈనాడు వారి సమాధి పుణ్యక్షేత్రంగా మారింది.[2]

షజరయె తయ్యబహ్ ఇలా ఉంది:

మూసా ముబర్రఖా యొక్క సమాధి చెహెల్ అఖ్తరాన్ లో ఉంది. ఆ ప్రదేశం పేరు మూసవీయాన్. అక్కడ రెండు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఒకటి చిన్నది మరొకటి పెద్దది వాటి మధ్య 15 అడుగుల దూరం ఉంటుంది. చిన్న దానిలో రెండు సమాధులు ఉంటాయి వారిలో ఒకటి మూసా ముబర్రఖా మరియు ఇంకొకటి అహ్మద్ ఇబ్నె మొహమ్మద్ ఇబ్నె అహ్మద్ ఇబ్నె మూసా ముబర్రఖా సమాధులు ఉంటాయి.[3]

మూసా ముబర్రఖాకు ఇద్దరు కుమారులు, వారి పేర్లు: మొహమ్మద్ మరియు అహ్మద్[4]

జర్కలీ ఇలా ఉల్లేఖించెను.. మూసా ముబర్రఖా(ర.అ) ఇబ్నె మొహమ్మద్ తఖీ(అ.స) ఇబ్నె ఇమామ్ అలీ రిజా(అ.స) ఇబ్నె మూసా ఇబ్నె జాఫర్(అ.స), షియా వర్గానికి చెందిన ప్రముఖులలో ఒకరు. మూసా ముబర్రఖా సంతానాన్ని రజవియ్యూన్ అని పిలుస్తారు. వారు కూఫాలో నివరించేవారు. హిజ్రీ యొక్క 256వ సంవత్సరంలో ఖుమ్ పట్టణానికి వచ్చారు మరియు అక్కడే వారు మరణించారు.

మీర్జా హుసైన్ నూరూ (మొహద్దిసె నూరీ)[5] గ్రంథం అయిన “అల్ బద్రుల్ ముషఅషఅ ఫీ అహ్వాలి జుర్రియతి మూసల్ ముబర్రఖఅ” లో హజ్రత్ మూసా ముబర్రఖా జీవిత చరిత్ర చాలా వివరంగా ఉంది.[6]

రిఫరెన్స్
1. అమీన్, సయ్యద్ మొహ్సిన్, అఅయానుష్ షియా, భాగం1, పేజీ194.
2. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వారు, భాగం50, పేజీ161.
3. అమీన్, సయ్యద్ మొహ్సిన్, అఅయానుష్ షియా, భాగం1, పేజీ195.
4. అమీన్, సయ్యద్ మొహ్సిన్, అఅయానుష్ షియా, భాగం1, పేజీ195.
5. ముస్తద్రికుల్ వసాయిల్ గ్రంథ రచయిత.
6. జర్కలీ, అల్ అఅలామ్, భాగం7, పేజీ327; అల్ జరీఅహ్, భాగం3, పేజీ68.
   

https://www.islamquest.net/fa/archive/question/fa3154

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
13 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10