స్వర్గం యొక్క పేర్లు దివ్యఖురాన్ లో

శుక్ర, 01/26/2018 - 10:20

దివ్యఖురాన్ లో ప్రస్థావించబడిన స్వర్గపు పేర్లు.

స్వర్గం యొక్క పేర్లు దివ్యఖురాన్ లో

ఖురాన్ లో స్వర్గమునకు గల చాలా పేర్లను ప్రస్థావించడం జరిగింది వాటిలో కొన్నింటిని మరియు వాటి ప్రాముఖ్యతలను ఇక్కడ ప్రస్థావిస్తున్నాము:
1. దారుస్సలాం(శాంతి నిలయం):
وَاللَّهُ يَدْعُو إِلَىٰ دَارِ السَّلَامِ وَيَهْدِي مَن يَشَاءُ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ
అల్లాహ్‌ మిమ్మల్ని   శాంతి   నిలయం   వైపుకు   పిలుస్తున్నాడు.   ఇంకా,   తాను   కోరిన      వారికి      ఆయన      రుజుమార్గంపై   నడిచే   సద్బుద్ధిని   ప్రసాదిస్తాడు(యూనుస్/25).
2. దారుల్ ఇర్స్ (వార్సత్వంగా లభించే నివస స్థానం):
تِلْكَ ٱلْجَنَّةُ ٱلَّتِى نُورِثُ مِنْ عِبَادِنَا مَن كَانَ تَقِيا
మేము   మా   దాసులలో   భయభక్తులు   కలిగి   ఉండేవారిని   వారసులుగా   చేసే   స్వర్గం   ఇదే(మర్యం/63).
ఆ అల్లాహ్ స్వర్గాన్ని తన దాసులకు(విస్వాసులు) వారసత్వంగా ఇస్తున్నాడు,ఒక మాటలో చెప్పలంటే స్వర్గానికి నిజమైన వారసులు విస్వాసులే అని చెప్పవచ్చు.
3. దారుర్ రిజా (కోరుకునేది లభించే ప్రదేశం):
تَرَى ٱلظَّٰلِمِينَ مُشْفِقِينَ مِمَّا كَسَبُوا۟ وَهُوَ وَاقِعٌۢ بِهِمْ ۗ وَٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّٰلِحَٰتِ فِى رَوْضَاتِ ٱلْجَنَّاتِ ۖ لَهُم مَّا يَشَآءُونَ عِندَ رَبِّهِمْ ۚ ذَٰلِكَ هُوَ ٱلْفَضْلُ ٱلْكَبِيرُ
ఈ దుర్మార్గులు తాము చేసుకున్న దానిపై భయపడటం నువ్వు చూస్తావు. అది (ఆ పాపం) వారిపై పడి తీరుతుంది. మరెవరయితే విశ్వసించి, సత్కార్యాలు చేశారో వారు స్వర్గవనాలలో ఉంటారు. వారు కోరినదల్లా వారికి వారి ప్రభువు వద్ద లభిస్తుంది. అదే అసలు గొప్ప అనుగ్రహం[షూరా/22].
4. దారుల్ మఖాం(నిత్యం ఉండే ప్రదేశం):
وَقَالُوا۟ ٱلْحَمْدُ لِلَّهِ ٱلَّذِىٓ أَذْهَبَ عَنَّا ٱلْحَزَنَ ۖ إِنَّ رَبَّنَا لَغَفُورٌۭ شَكُورٌ٭ٱلَّذِىٓ أَحَلَّنَا دَارَ ٱلْمُقَامَةِ مِن فَضْلِهِۦ لَا يَمَسُّنَا فِيهَا نَصَبٌۭ وَلَا يَمَسُّنَا فِيهَا لُغُوبٌۭ.
వారిలా అంటారు: 'మా నుంచి దుఃఖాన్ని దూరం చేసిన అల్లాహ్‌కు (శతకోటి) కృతజ్ఞతలు. నిశ్చయంగా మా ప్రభువు అమితంగా క్షమించేవాడు, సత్కార స్వభావుడు, "ఆయన తన కృపతో నిత్యం ఉండే నెలవులో మమ్మల్ని దించాడు. అందులో మాకు బాధగానీ, అలసటగానీ ఉండట్లేదు[ఫాతిర్/34,35].
5. ఫౌజుల్ అజీం (అతి పెద్ద సాఫల్యం):
إِنَّ ٱللَّهَ ٱشْتَرَىٰ مِنَ ٱلْمُؤْمِنِينَ أَنفُسَهُمْ وَأَمْوَٰلَهُم بِأَنَّ لَهُمُ ٱلْجَنَّةَ ۚ يُقَٰتِلُونَ فِى سَبِيلِ ٱللَّهِ فَيَقْتُلُونَ وَيُقْتَلُونَ ۖ وَعْدًا عَلَيْهِ حَقًّۭا فِى ٱلتَّوْرَىٰةِ وَٱلْإِنجِيلِ وَٱلْقُرْءَانِ ۚ وَمَنْ أَوْفَىٰ بِعَهْدِهِۦ مِنَ ٱللَّهِ ۚ فَٱسْتَبْشِرُوا۟ بِبَيْعِكُمُ ٱلَّذِى بَايَعْتُم بِهِۦ ۚ وَذَٰلِكَ هُوَ ٱلْفَوْزُ ٱلْعَظِيمُ
నిస్సందేహంగా అల్లాహ్‌ ముస్లింల నుండి, వారి ధన ప్రాణాలను స్వర్గానికి బదులుగా కొన్నాడు. వారు అల్లాహ్‌ మార్గంలో పోరాడుతారు; చంపుతారు, చంపబడతారు. దీనిపై తౌరాతులోనూ, ఇంజీలులోనూ, ఖుర్‌ఆన్‌లోనూ సత్యమైన వాగ్దానం చేయబడింది. వాగ్దానాన్ని నెరవేర్చటంలో అల్లాహ్‌ను   మించిన వాడెవడుంటాడు? కాబట్టి మీరు ఖరారు చేసిన ఈ వర్తకానికిగాను సంబరపడండి. ఘనవిజయం అంటే ఇదే[అత్-తౌబా/111].

 

 

 

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 21