జుమర్ సూరహ్

శని, 01/27/2018 - 15:15

.

జుమర్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 39వ సూరా ఇది. “జుమర్” “జుమ్రహ్” యొక్క బహువచనం, అనగా ప్రళయదినం. ఈ సురాకు సంబంధించిన ఆయత్ ఈ సూరాలోని 71వ ఆయత్. ఈ సూరాలో “జుమర్” అను పదం 2 సార్లు మరియు పూర్తి ఖుర్ఆన్ లో 2 సార్లు వచ్చింది. ఈ సూరాలో 75 ఆయత్‍లు, 1175 పదాలు మరియు 4871 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరాలో “అల్లాహ్” పదం 59 సార్లు వచ్చింది. ఈ సూరా మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “సబా” సూరహ్ మరియు దీని తరువాత “మోమిన్” సూరహ్ అవతరించబడ్డాయి. దీని పేరు “జుమర్” అని పెట్టడానికి కారణం పూర్తి ఖుర్ఆన్ లో ..జుమర్.. అన్న పదం 2 సార్లు వచ్చింది ఆ రెండు సార్లు కూడా ఈ సూరహ్ లోనే ఉండడం. ఈ సూరహ్ ను “జుమర్” కాకుండా “గురఫ్” మరియు “సూరతుల్ అరబ్” అని కూడా అంటారు. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించెను “ఎవరైతే జుమర్ సూరహ్ ను పఠిస్తారో, అల్లాహ్ అతనికి ఇహపరలోకాల ప్రతిష్టతను ప్రసాదిస్తాడు. ధనం మరియు వంశం లేకుండానే ప్రతిష్టనిగా నిర్ధారించబడతాడు, అతనిని చూసేవారు గర్విస్తారు. అతని పై నరకాగ్ని హరామ్ గా నిర్ధారించబడుతుంది”[మజ్మవుల్ బయాన్, భాగం8, పేజీ381].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం8, పేజీ381.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 19 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13