హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) పట్ల అగౌరవ ప్రవర్తన-1

మంగళ, 12/27/2022 - 10:18

హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) ఇంటికి వచ్చి వారి పట్ల అగౌరవంగా ప్రవర్తంచిన వారి గురించి అహ్లె సున్నత్ గ్రంథాలలో ఆధారాలు...

హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) పట్ల అగౌరవ ప్రవర్తన-1

హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) పట్ల అగౌరవ ప్రవర్తన ఒక యదార్థ సంఘటన. దీని గురించి అహ్లె సున్నత్ గ్రంథాలలో రచించబడి ఉంది.

దీని గురించి అహ్లె సున్నత్ గ్రంథాలలో లిఖించబడి ఉంది. వాటిని ఇక్కడ మీ కోసం వివరించబడుతుంది. హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) ఇంటి పట్ల అగౌరవ ప్రవర్తన మరియు ఆమె షహాదత్ అంశాలు చారిత్రాత్మక యదార్థాలు. ఇక్కడ ఆదారాలను కాలం ప్రకారం వివరిస్తున్నాము:

1. ఇబ్నె అబీ షైబహ్ మరియు అల్ ముసన్నఫ్ గ్రంథం
అబూబక్ర్ ఇబ్నె అబీ షైబహ్(159-235హి) అల్ ముసన్నఫ్ గ్రంథ రచయిత రావీయుల సరైన క్రమం ద్వార ఇలా ఉల్లేఖించెను: ప్రజలు అబూబక్ర్ తో బైఅత్ చేసినప్పుడు, అలీ మరియు జుబైర్ ఫాతెమా ఇంట్లో చర్చించుకుంటున్నారు. ఈ విషయం ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ కు తెలిసింది. అతడు ఫాతెమా ఇంటికి వచ్చి ఇలా అన్నాడు: ఓ దైవప్రవక్త కుమార్తె, మాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి నీ తండ్రి, నీ తండ్రి తరువాత నువ్వే, కాని అల్లాహ్ సాక్షిగా(చెబుతున్నాను) ఈ ఇష్టం వీళ్లు నీ ఇంట్లో చేరి (చర్చలు చేస్తే) నేను ఇంటిని నిప్పంటించడానికి అడ్డు పడుతుంది అని భావించదు. ఇలా చెప్పి బయటకు వెళ్లి పోయాడు, అలీ(అ.స) మరియు జుబైర్ బయట నుండి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు దైవప్రవక్త(స.అ) కుమార్తె అలీ(అ.స) మరియు జుబైర్ తో ఇలా అన్నారు: ఉమర్ నా వద్దకు వచ్చి ఒకవేళ మీరు ఏకమైన చర్చలు జరిపితే ఇంటిని తగలబెడతాను అని ప్రమాణం చేసి వెళ్లాడు. అతడు ప్రమాణం చేసి చెప్పింది చేస్తాడు.[1]

2. బిలాజరీ మరియు అన్సాబుల్ అష్రాఫ్
అహ్మద్ ఇబ్నె యహ్యా జాబిరె బగ్దాదీ బిలాజరీ (మరణం 270హి) ప్రముఖ రచయిత మరియు గొప్ప చరిత్రకారుడు, ఈ సంఘటనను తన గ్రంథం అన్సాబుల్ అష్రాఫ్ లో ఈ విధంగా ఉల్లేఖించెను:
అబూబక్ర్, బైఅత్ కోసం అలీ(అ.స) వద్దకు పంపారు, కాని అలీ(అ.స) బైఅత్ చేయడానికి నిరాకరించారు. ఆ తరువాత ఉమర్ నిప్పు తీసుకొని బయలుదేరారు, ఫాతెమా ఇంటి ద్వార ఎదురుగా నిలబడ్డాడు, ఫాతెమా ఇలా అన్నారు: ఓ ఖత్తాబ్ కుమారా! నా ఇంటిని తగలబెట్టడానికి వచ్చినట్లు కనిపిస్తునావు? ఉమర్ “ఔను, ఇది నీ తండ్రి దేనికోసం అయితే ఎన్నుకోబడ్డారో దానికి సహాయ చర్య!!” అని అనెను.[2]

3. ఇబ్నె ఖుతైబహ్ మరియు అల్ ఇమామతు వస్సియాసహ్
ప్రముఖ చరిత్రకారుడు అయిన అబ్దుల్లాహ్ ఇబ్నె ముస్లిం ఇబ్నె ఖుతైబహ్ దైనవీ(212-276హి) ఇతను ..తావీలు ముఖ్తలిఫిల్ హదీస్.. మరియు ..అదబుల్ కాతిబ్.. మొ.. గ్రంథాలు రచించారు. ఇతను తన గ్రంథం ..అల్ ఇమామతు వస్సియాసహ్.. లో ఇలా రచించెను.. 
అబూబక్ర్, తన బైఅత్ ను నిరాకరించి అలీ ఇంట్లో వచ్చి చేరిన వారి కోసం ఉమర్ ను పంపారు, అతడు అలీ(అ.స) ఇంటికి వచ్చి అందరూ బయటకు రావాలి అని పిలిచాడు. వారు బయటికి రాలేదు అప్పుడు ఉమర్ కట్టెలను తీసుకొని రండి అని కోరి ఇలా అన్నాడు.. ఉమర్ ప్రాణాలు ఎవరి చేతుల్లో ఉన్నాయో ఆ అల్లాహ్ సాక్షిగా బయటకు రండి లేదా ఇంటిని తగలబెడతాను. ఒకడు ఉమర్ తో ఇలా అన్నాడు: ఓ అబాహఫ్స్ (ఉమర్ కున్నియత్) ఈ ఇంట్లో దైవప్రవక్త(స.అ) కుమార్తె ఫాతెమా అన్నారు. ఉమర్.. ఉంటే ఉండని!![3]

ఇబ్నె ఖుతైబహ్ ఈ సంఘటన తో పాటు మనసును ఇంకా కష్టపెట్టే విషయాలను రిచించారు, అతడు ఇలా అనెను:
ఉమర్ ఒక గుంపుతో కలిసి ఫాతెమా ఇంటికి వచ్చారు, ఇంటి తలుపును తట్టారు, ఫాతెమా వారి అరుపులు విని గట్టిగా ఇలా అన్నారు: “ఓ దైవప్రవక్త(స.అ) మీ తరువాత మా పై ఇబ్నె ఖత్తాబ్ మరియు అబూ ఖహాఫహ్ తరపు నుండి ఈ కష్టాలేమిటి” ఉమర్ తో పాటు వచ్చిన వాళ్లు ఫాతెమా మాటలు మరియు రోధన విని తిరిగి వెళ్లిపోయారు, కాని ఉమర్ మిగిలిన కొందరితో కలిసి అలీ ము ఇంటి నుండి బయటకు తీసుకొచ్చారు, వారిని అబూబక్ర్ వద్దకు తీసుకొని వెళ్లారు, వారితో బైఅత్ చేయమని కోరారు, అప్పుడు అలీ ఇలా అన్నారు: ఒకవేళ బైఅత్ చేయకపోతే ఏమౌతుంది? వాళ్లు ఇలా అన్నారు: ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేని ఆ అల్లాహ్ సాక్షిగా నీ తల నరుకుతాం.[4]

1. ఇబ్నె అబూ షైబహ్, అల్ ముసన్నఫ్, భాగం8, పేజీ572, కితాబుల్ మగాజీ.

انّه حین بویع لأبی بکر بعد رسول اللّه(صلى الله علیه وآله) کان علی و الزبیر یدخلان على فاطمة بنت رسول اللّه، فیشاورونها و یرتجعون فی أمرهم. فلما بلغ ذلک عمر بن الخطاب خرج حتى دخل على فاطمة، فقال: یا بنت رسول اللّه(صلى الله علیه وآله) و اللّه ما أحد أحبَّ إلینا من أبیک و ما من أحد أحب إلینا بعد أبیک منک، و أیم اللّه ما ذاک بمانعی إن اجتمع هؤلاء النفر عندک أن امرتهم أن یحرق علیهم البیت قال: فلما خرج عمر جاؤوها، فقالت: تعلمون انّ عمر قد جاءَنى، و قد حلف باللّه لئن عدتم لیُحرقنّ علیکم البیت، و أیم اللّه لَیمضین لما حلف علیه

2. అహ్మద్ ఇబ్నె యహ్యా జాబిరె బగ్దాదీ బిలాజరీ, అన్సాబుల్ అష్రాఫ్, భాగం1, పేజీ586, తబఎ దారు మఆరిఫ్, ఖాహరహ్.

انّ أبابکر أرسل إلى علىّ یرید البیعة فلم یبایع، فجاء عمر و معه فتیلة! فتلقته فاطمة على الباب. فقالت فاطمة: یابن الخطاب، أتراک محرقاً علىّ بابى؟ قال: نعم، و ذلک أقوى فیما جاء به أبوک

3. అబ్దుల్లాహ్ ఇబ్నె ముస్లిం ఇబ్నె ఖుతైబహ్ దైనవీ, అల్ ఇమామతు వస్సియాసహ్, పేజీ12, మక్తబతు తిజారియహ్ కుబ్రా, మిస్ర్.

انّ أبابکر رضی اللّه عنه تفقد قوماً تخلّقوا عن بیعته عند علی کرم اللّه وجهه فبعث إلیهم عمر فجاء فناداهم و هم فی دار على، فأبوا أن یخرجوا فدعا بالحطب و قال: والّذی نفس عمر بیده لتخرجن أو لاحرقنها على من فیها، فقیل له: یا أبا حفص انّ فیها فاطمة فقال، و إن

4. అబ్దుల్లాహ్ ఇబ్నె ముస్లిం ఇబ్నె ఖుతైబహ్ దైనవీ, అల్ ఇమామతు వస్సియాసహ్, పేజీ13, మక్తబతు తిజారియహ్ కుబ్రా, మిస్ర్.

ثمّ قام عمر فمشى معه جماعة حتى أتوا فاطمة فدقّوا الباب فلمّا سمعت أصواتهم نادت بأعلى صوتها یا أبتاه رسول اللّه ماذا لقینا بعدک من ابن الخطاب، و ابن أبی قحافة فلما سمع القوم صوتها و بکائها انصرفوا. و بقی عمر و معه قوم فأخرجوا علیاً فمضوا به إلى أبی بکر فقالوا له بایع، فقال: إن أنا لم أفعل فمه؟ فقالوا: إذاً و اللّه الّذى لا إله إلاّ هو نضرب عنقک

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 3