హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) పట్ల అగౌరవ ప్రవర్తన-2

మంగళ, 12/27/2022 - 10:38

హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) ఇంటికి వచ్చి వారి పట్ల అగౌరవంగా ప్రవర్తంచిన వారి గురించి అహ్లె సున్నత్ గ్రంథాలలో ఆధారాలు...

హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) పట్ల అగౌరవ ప్రవర్తన-2

ఇబ్నె ఖుతైబహ్ ఈ సంఘటన తో పాటు మనసును ఇంకా కష్టపెట్టే విషయాలను రిచించారు, అతడు ఇలా అనెను:
ఉమర్ ఒక గుంపుతో కలిసి ఫాతెమా ఇంటికి వచ్చారు, ఇంటి తలుపును తట్టారు, ఫాతెమా వారి అరుపులు విని గట్టిగా ఇలా అన్నారు: “ఓ దైవప్రవక్త(స.అ) మీ తరువాత మా పై ఇబ్నె ఖత్తాబ్ మరియు అబూ ఖహాఫహ్ తరపు నుండి ఈ కష్టాలేమిటి” ఉమర్ తో పాటు వచ్చిన వాళ్లు ఫాతెమా మాటలు మరియు రోధన విని తిరిగి వెళ్లిపోయారు, కాని ఉమర్ మిగిలిన కొందరితో కలిసి అలీ ము ఇంటి నుండి బయటకు తీసుకొచ్చారు, వారిని అబూబక్ర్ వద్దకు తీసుకొని వెళ్లారు, వారితో బైఅత్ చేయమని కోరారు, అప్పుడు అలీ ఇలా అన్నారు: ఒకవేళ బైఅత్ చేయకపోతే ఏమౌతుంది? వాళ్లు ఇలా అన్నారు: ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేని ఆ అల్లాహ్ సాక్షిగా నీ తల నరుకుతాం.[1]

4. తబరీ మరియు అతడి తారీఖ్
మొహమ్మద్ ఇబ్నె జురైరె తబరీ (మరణం310హి) తన తారీఖ్ గ్రంథంలో ఇలా రచించెను..
ఉమర్ ఇబ్నె ఖత్తాబ్, అలీ ఇంటికి వచ్చారు, అప్పుడు అక్కడ ముహాజిరీనుల గుంపు కూడా ఉంది. అతడు వారితో(ఇంట్లో ఉన్నవారితో) ఇలా అన్నాడు: అల్లాహ్ సాక్షిగా బైఅత్ చేయడానికి బయటకు రాకపోతే ఇంటిని నిప్పంటిస్తాను.. జుబైర్ ఇంటి నుండి కత్తి పట్టుకొని బయటకు వచ్చారు, అనుకోకుండా అతడి కాళు జారి కత్తి చేయి నుండి ఇందపడింది, అప్పుడు వారందరు అతడి పై పడి అతడి నుండి కత్తి తీసేసుకున్నారు.[2]

5. ఇబ్నె అబ్దు రబ్బిహ్ మరియు అల్ అఖ్దుల్ ఫరీద్
షహాబుద్దీన్ అహ్మద్(మరణం 463హి), ఇతను ఇబ్ను అబీ రబ్బిహ్ ఉందులుసీ అని ప్రఖ్యాతి చెందారు. వారి గ్రంథం పేరు “అల్ అఖ్దుల్ ఫరీద్” ఇతను తన గ్రంథంలో సఖీఫహ్ చరిత్రను క్రమంలో ఎవరు అబూబక్ర్ యొక్క బైఅత్ ను నిరాకరించారు అన్న విషయం సందర్భంగా ఇలా రచించెను:
అలీ, అబ్బాస్ మరియు జుబైర్ ఫాతెమా ఇంట్లో కూర్చోని ఉండగా అబూబక్ర్, ఉమర్ ను వారిని ఫాతెమా ఇంటి నుండి బయటకు తీయమని పంపారు. అతడితో ఇలా అన్నారు: ఒకవేళ వాళ్లు బయటకు రాకపోతే వాళ్లతో యుద్ధం చేయి! అప్పుడు ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ నిప్పును తనతో పాటు తీసుకొని ఫాతెమా ఇంటి వైపుకు నిప్పంటించడానికి బయలు దేరారు. అక్కడ ఫాతెమాకు ఎదురు పడ్డారు. దైవప్రవక్త(స.అ) కుమార్తె ఇలా అన్నారు.. ఇబ్నె ఖత్తాబ్ మా ఇంటిని కాల్చడానికి వచ్చావా! అతడు ఇలా అన్నాడు: “ఔను, ఉమ్మత్ స్వీకరించిన దానిని మీరు కూడా స్వీకరించకపోతే”[3]

రిఫరెన్స్
4. అబ్దుల్లాహ్ ఇబ్నె ముస్లిం ఇబ్నె ఖుతైబహ్ దైనవీ, అల్ ఇమామతు వస్సియాసహ్, పేజీ13, మక్తబతు తిజారియహ్ కుబ్రా, మిస్ర్.

ثمّ قام عمر فمشى معه جماعة حتى أتوا فاطمة فدقّوا الباب فلمّا سمعت أصواتهم نادت بأعلى صوتها یا أبتاه رسول اللّه ماذا لقینا بعدک من ابن الخطاب، و ابن أبی قحافة فلما سمع القوم صوتها و بکائها انصرفوا. و بقی عمر و معه قوم فأخرجوا علیاً فمضوا به إلى أبی بکر فقالوا له بایع، فقال: إن أنا لم أفعل فمه؟ فقالوا: إذاً و اللّه الّذى لا إله إلاّ هو نضرب عنقک

2. మొహమ్మద్ ఇబ్నె జురైరె తబరీ, తారీఖ్, భాగం2, పేజీ443, బీరూత్.

أتى عمر بن الخطاب منزل علی و فیه طلحة و الزبیر و رجال من المهاجرین، فقال و اللّه لاحرقن علیکم أو لتخرجنّ إلى البیعة، فخرج علیه الزّبیر مصلتاً بالسیف فعثر فسقط السیف من یده، فوثبوا علیه فأخذوه

3. ఇబ్ను అబీ రబ్బిహ్ ఉందులుసీ, అల్ అఖ్దుల్ ఫరీదహ్, భాగం3, పేజీ93.

فأمّا علی و العباس و الزبیر فقعدوا فی بیت فاطمة حتى بعثت إلیهم أبوبکر، عمر بن الخطاب لیُخرجهم من بیت فاطمة و قال له: إن أبوا فقاتِلهم، فاقبل بقبس من نار أن یُضرم علیهم الدار، فلقیته فاطمة فقال: یا ابن الخطاب أجئت لتحرق دارنا؟! قال: نعم، أو تدخلوا فیما دخلت فیه الأُمّة

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8