గాఫిర్ సూరహ్

శని, 01/27/2018 - 15:21

.ఖుర్ఆన్ యొక్క 40వ సూరహ్ అయిన “గాఫిర్” గురించి సంక్షిప్త వివరణ.

గాఫిర్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 40వ సూరా ఇది. “గాఫిర్” అనగ క్షమించేవాడు. ఈ సురాకు సంబంధించిన ఆయత్ ఈ సూరాలోని 3వ ఆయత్. ఈ సూరాలో “గాఫిర్” అను పదం 1 సారి మరియు పూర్తి ఖుర్ఆన్ లో 1 సారి వచ్చింది(కాకపోతే అఅరాఫ్ సూరహ్ లో ఒకసారి “గాఫిరీన్” అని వచ్చింది). ఈ సూరాలో 85 ఆయత్‍లు, 1225 పదాలు మరియు 5109 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరాలో “అల్లాహ్” పదం 53 సార్లు వచ్చింది. ఈ సూరా మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “జుమర్” సూరహ్ మరియు దీని తరువాత “ఫుస్సిలత్” సూరహ్ అవతరించబడ్డాయి. దీని పేరు “గాఫిర్” అని పెట్టడానికి కారణం పూర్తి ఖుర్ఆన్ లో “గాఫిర్” అన్న పదం ఈ సూరహ్ లోనే ఉండడం. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి ఇమామ్ ముహమ్మద్ బాఖిర్[అ.స] ఇలా ప్రవచించెను “ఎవరైతే మూడు రోజుల పాటు గాఫిర్ సూరహ్ ను పఠిస్తారో, అల్లాహ్ అతను చేసిన మరియు తరువాత చేయబోయే పాపములను క్షమిస్తాడు. అతనిని ధర్మనిష్ట గలవారిగా తీర్చిదిద్దుతాడు. ఈ ప్రపంచంలో ప్రసాదించిన దాని కన్నా ఎక్కువ మంచిని పరలోకంలో ప్రసాదిస్తాడు”.[మజ్మవుల్ బయాన్, భాగం8, పేజీ423].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం8, పేజీ423.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 7