సర్దార్ షహీద్ సులైమానీ ఆలోచనలు సూప్రీమ్ నేత అయిన ఆయతుల్లాహ్ ఖామెనయీ(హ.హ) మాటల్లో...

యావత్ షియా వర్గానికి సూప్రీమ్ నేత అయిన ఆయతుల్లాహ్ ఖామెనయీ(హ.హ) సర్దార్ షహీద్ సులైమానీ యొక్క ఆలోచనల గురించి పలు సందర్భాలలో ఇలా వివరించారు:
తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసే అత్యంత ప్రసిద్ధ మరియు శక్తివంతమైన కమాండర్ అయిన వ్యక్తిని అమెరికన్లు హత్య చేశారు. (27/10/1398)
వారు అతనిని యుద్ధభూమిలో ఎదుర్కోలేదు, అమెరికన్ ప్రభుత్వం దొంగతనంగా మరియు పిరికితనంతో అతనిని హత్య చేసింది; ఈ పని అమెరికా అవమానానికి కారణమైంది! (27/10/1398)
మాలో చాలా మంది చంపబడ్డారు కాని మానవాళిలోనే అత్యంత నీఛమైన వాళ్ల చేతుల్లో అనగా అమెరికన్లచేత చంపబడినవారు హాజ్ ఖాసిమ్ తప్ప మరొకరు లేరనుకుంటున్నాను. (13/10/1398)
అతడి జిహాద్ గొప్ప జిహాద్, అల్లాహ్ కూడా అతడి వీరమరణాన్ని అపూర్వమైనదిగా నిర్ధారించెను. (13/10/1398)
అతడు తన పూర్తి జీవితాన్ని అల్లాహ్ మార్గంలో జిహద్ చేస్తూ గడిపాడు. అతని ఇన్ని సంవత్సరాల నిత్య ప్రయత్నం యొక్క ఫలితమే అతడి షహాదత్. (13/10/1398)
షహీద్ సులైమానీ, తన ఉద్యమాలతో మరియు చివరకు అతని బలిదానంతో, ఇస్లామీయ ప్రపంచంలో ప్రతిఘటన యొక్క ఆందోళన మరియు సమీకరణ యొక్క రహస్యం అయ్యింది. (26/09/1399)
షాహిద్ సులైమానీ ప్రతిఘటన యొక్క మృద సామాగ్రీ (సాఫ్ట్‌వేర్) మరియు పోరాట నమూనాను దేశాలకు నేర్పించారు. (26/09/1399)
ప్రపంచవ్యాప్తంగా ఉన్న జియోనిస్ట్ వార్తా సామ్రాజ్యం మా గౌరవప్రదమైన కమాండర్ (సులైమానీ) ను తీవ్రవాదిగా నిందించడానికి ప్రయత్నించింది; సర్వశక్తిమంతుడైన అల్లాహ్ వారు కోరుకున్న దానికి విరుద్ధంగా రంగాన్ని ఏర్పాటు చేశాడు. (27/10/1398)
అతడి మరణంతో అల్లాహ్ కాంక్ష మరియు శక్తి ద్వార అతడి మార్గ ఆచరణ ఆగిపోదు మరియు నిలిచిపోదు. (13/10/1398)
ఈ గొప్ప వీరమరణం (షహాదత్) అల్లాహ్ శక్తి యొక్క సంకేతాలలో ఒకటి. (27/10/1398)
అమరవీరుడు జనరల్ ఖాసీమ్ సులైమానీని ప్రజలు ప్రశంసించారు మరియు ఇది చిత్తశుద్ధి నిదర్సనం. ఆ మనిషిలో గొప్ప చిత్తశుద్ధి ఉండేది. (13/10/1398)
ప్రళయాన్ని సృష్టించాడు. అతడి ఆథ్యాత్మికత, అతడి వీరమరణాన్ని ఇలా గొప్పగా మార్చింది. (18/10/1398)
అతడి వీరమరణం, ఇంకా మన దేశంలో ఇన్ఖిలాబ్ జీవించే ఉంది అన్న విషయాన్ని ప్రపంచానికి తెలియపరచింది. (18/10/1398)
అమర వీరుడు ఖాసిమ్ సులైమానీ రెండు ఉత్తమత్వాలనూ పొందారు., విజయాన్నీ సాధించారు మరియు వీరమరణాన్నీ పొందారు., అంటే అల్లాహ్ రెండు ఉత్తమత్వాలు గౌవనీయులైన ఈ అమర వీరుడికి ప్రసాదించాడు. (29/11/1398)
సులైమానీ ను చంపినవాడు మరియు చంపమని ఆదేశించినవాడు, తప్పకుండా వారి నుండి ప్రతీకారం తీర్చుకోవాలి. (26/09/1399)
అమర వీరుడు సులైమానీ, ప్రాణాలతో ఉన్నప్పుడూ అహంకార ఆధిపత్యాన్ని ఓడించారు, అలాగే షహాదత్ తరువాత కూడా ఓడించారు. (26/09/1399)
నేను మనస్పూర్తిగా అతడ్ని ప్రశంసించేవాడ్ని కాని ఈ రోజు అతడు దేనికైతే కారణమయ్యాడో మరియు దేశం కోసమే కాకుండా యావత్ ప్రపంచం కోసం చేశాడో, వాటన్నింటి పట్ల అతడిని ఉత్తమ రీతిలో గౌరవిస్తున్నాను. (18/10/1398)
హజ్ ఖాసిమ్, షిఫాఅత్ చేయు వారి నుండి. (ఉర్దీ బెహిష్త్, 1384)
హజ్ ఖాసిమ్ తన అభిలాషకు చేరుకున్నారు, అతడు షహాదత్ ను ఇష్టపడేవారు, దాని కోసం కన్నీళ్లు కార్చారు, అమరులైన తన సహచరుల కోసం సంతాపం కలిగి ఉండేవారు. (13/10/1398)
గౌరవనీయులైన సర్దార్ షహీద్ ను ఒక అలోచనా, ఒక మార్గం, ఒక పాఠశాల గా రూపంలో చూడాలి. (27/10/98)
నేను మా గౌరవనీయులైన షహీద్ సులైమానీ ను ఎప్పటికీ మరువనివ్వను. (26/09/1399)
చివరి మాట.. ఎవరు కూడా ఒక్క సారిగా ఇలా మారలేడు. ఈరోజు షహీద్ సులైమానీ ని చూసి నేను కూడా అలా అవ్వాలనీ రేపు మరొకరిని చూసి నేను ఇతడిలా అవ్వాలన అనుకోవడం ద్వార ఎవ్వరూ అతనిలా అవ్వడు. దీని కోసం మనకు మంచిచెడ్డలు తెలిసినప్పటి నుండే వాటి పట్ల జాగ్రత్తలు వహించి. హరామ్ మరియు హలాల్ ను పాటించాలి, అల్లాహ్ చెప్పిన మార్గం పై ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా కేవలం అల్లాహ్ కోసం నడవాలి. ఆయన మార్గం పై నడిచి ఆయన్ని వేడుకుంటే ఆయన తప్పకుండా ప్రసాదింస్తాడు కాని ఆయన మార్గంలో నడిచి ఆయన్నే కోరుకోవడం ఇంత ఉత్తమ అంశం. ఇదే అహ్లె బైత్(అ.స) కూడా మనకు ఉపదేశించారు.
ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క రోజులో అల్లాహ్ కు ఇష్టమైన వారు మరియు లోక ప్రియుడిగా మారడం చాలా కష్టం దాని కోసం అల్లాహ్ మార్గంలో శ్రమించడం చాలా అవసరం.
అల్లాహ్ మనల్ని ఆయన మార్గం లో నడిచే యోగ్యతను ప్రసాదించుగాక!
వ్యాఖ్యానించండి