ఫుస్సిలత్ సూరహ్

శని, 01/27/2018 - 15:35

.పవిత్ర గ్రంథం ఖుర్ఆన్ యొక్క 41వ సూరహ్ అయిన “ఫుస్సిలత్” సంక్షిప్త వివరణ.

ఫుస్సిలత్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 41వ సూరహ్ ఇది. “ఫుస్సిలత్” అనగ వివరణ. ఈ సురాకు సంబంధించిన ఆయత్ ఈ సూరాలోని 3వ ఆయత్. ఈ సూరాలో “ఫుస్సిలత్” అను పదం 2 సార్లు మరియు పూర్తి ఖుర్ఆన్ లో 3 సార్లు వచ్చింది(రెండు సార్లు ఇదే సూరహ్ లో మరియు ఒక సారి హూద్ సూరహ్ లో వచ్చింది). ఈ సూరాలో 54 ఆయత్‍లు, 794 పదాలు మరియు 3364 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరాలో “అల్లాహ్” పదం 11 సార్లు వచ్చింది. ఈ సూరా మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “గాఫిర్” సూరహ్ మరియు దీని తరువాత “షూరా” సూరహ్ అవతరించబడ్డాయి. దీని పేరు “ఫుస్సిలత్” అని పెట్టడానికి కారణం 3వ ఆయత్ లో ఈ “ఫుస్సిలత్” పదం ఉండడం. ఈ సూరహ్ ను “ఫుస్సిలత్” కాకుండా “సజ్దా” “మసాబీహ్” మరియు “హామ్మీమ్ సజ్దా” అని కూడా అంటారు. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించెను “ఎవరైతే హామ్మీమ్ సజ్దా సూరహ్ ను పఠిస్తారో, అల్లాహ్ ప్రళయదినాన అతనికి కాంతిని ప్రసాదిస్తాడు. అతను ప్రపంచంలో సంతోషపడతాడు. అతను శ్రేష్టుడవుతాడు మరియు జనం చూసి అసూయ చెందుతారు”.[మజ్మవుల్ బయాన్, భాగం9, పేజీ5].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం9, పేజీ5.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 11 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10