దుర్మార్గులకు సహాయం అందిచండ

ఆది, 01/08/2023 - 16:17

దుర్మార్గులకు సహాయం చేయడం అహ్లెబైత్(అ.స) దృష్టిలో పాపంగా పరిగణించబడినది...

దుర్మార్గులకు సహాయం అందిచండ

ఇమామ్ మూసా కాజిమ్(అ.స) షియా ముస్లిముల 7వ ఇమామ్. వారు సఫర్ మాసం 7వ తేదీ హిజ్రీ యొక్క 128వ సంవత్సరంలో “అబ్వా”లో జన్మించారు. వారి తండ్రి ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) మరియు వారి తల్లి పేరు “హమీదహ్ ముసఫ్ఫహ్”. వారు రజబ్ మాసం, హిజ్రీ యొక్క 183వ సంవత్సరంలో 55 వయసులో హారున్ అల్ రషీద్ ఆదేశానుసారం విషం ద్వార చంపబడ్డారు. వారిని బగ్దాద్(ఇరాఖ్) లో ఉన్న “కాజిమైన్” పట్టణంలో సమాధి చేయబడ్డారు. జ్ఞానపరంగా మరియు అధ్యాత్మిక పరంగా వారి స్థానం తెలియనివారు లేరు.   
ఇరువర్గాలవారు(షియా మరియు సున్నీయులు) వారి గురించి రచించారు.[1]

“సఫ్వాన్”, ఒకేసారి తన అన్ని ఒంటెలను అమ్మేశాడు, అన్న వార్త విని మరి హజ్ ప్రయాణంలో ఖలీఫా డేరాలు, మరియు ఇతర సామాగ్రిని మోసేందుకు మరో ఉపాయం ఏదైనా ఆలోచించాలనుకుని “హారున్ రషీద్” చాలా దగ్ర్బమ చేంది, ఎందుకు అలా అన్నీ ఒకే సారి అమ్మేశాడూ! అది కూడా ఖలీఫాతో ఒప్పందం చేసుకున్న తరువాత, ఇది సాధారణ విషయం కాదు కదా! అని ఆలోచనలో పడ్డాడు. దీనికి బలమైన కారణం ఉండే ఉంటుంది అని గ్రహించి “సఫ్వాన్”ను రమ్మని కబురు చేశారు. సఫ్వాన్ తో ఇలా అన్నాడు: ఒంటెలను అమ్మేశావాని విన్నాను నిజమేనా?. ఔను ప్రభూ!. ఎందుకు?. నేను ముసలోడినయ్యాను, పని చేయలేకపోతున్నాను, పిల్లలు కూడా వాటిని పట్టించుకోవడం లేదు, అందుకని అమ్మేయ్యడమే మంచిదిగా భావించి అమ్మేశాను. నిజం చెప్పు ఎందుకు అమ్మేశావు?. చేప్పాను కదా ప్రభూ!. కాని నువ్వెందుకు అమ్మేశావో నాకు తెలుసు, నిస్సందేహంగా నాతో హజ్ ప్రయాణం కోసం ఒంటెలను అద్దెకిస్తానన్న ఒప్పందం విషయం ముసా ఇబ్నె జాఫర్ కు తెలిసుంటుంది అతను నిన్ను దాని నుండి ఆపి, ఒంటెలను అమ్మేయి అని ఆదేశించి ఉంటారు, ఇదే నీ అకశ్మాత్తు నిర్ణయానికి కారణం.  అప్పుడు కోపంతో బిగ్గరగా ఇలా అన్నాడు: సఫ్వాన్! మన మధ్య మునుపటి మంచి స్నేహమే ఉండకుంటే నీ తల నరకేవాడిని.
సఫ్వాన్, హారూన్ కు ఎంత దగ్గరవాడైనా అతను అహ్లెబైత్(అ.స) అనుచరుడు. సఫ్వాన్ హజ్ ప్రయాణం కోసం హారూన్ తో ఒప్పందం కుదుర్చుకున్న తరువాత ఒకరోజు ఇమామ్ మూసా కాజిమ్(అ.స)ను కలిశారు అప్పుడు ఇమామ్ ఇలా అన్నారు: సఫ్వాన్ నీలో ఉన్న లక్షణాలన్నీ మంచివే ఒక్కటి తప్ప. ఆ ఒక్కటి ఏమిటో చెప్పండి ప్రవక్త కుమారా!?. నీవు నీ ఒంటెలను హారున్ కు అద్దెకిచ్చావు. ఔను యబ్న రసూలిల్లాహ్! నేను ధర్మవిరుద్ధమైన ప్రయాణానికి అద్దెకివ్వడం లేదు, హారూన్ హజ్ కు వెళ్ళాలనుకుంటున్నాడు, హజ్ ప్రయాణం కోసం అద్దెకిచ్చాను. అంతేకాకుండా నేను అతడితో పాటు వెళ్ళడం లేదు, నా పనివాళ్లను పంపిస్తున్నాను. సఫ్వాన్ నేను నిన్ను ఒకటడగాలనుకుంటున్నాను. చెప్పండి యబ్న రసూలిల్లాహ్!. ప్రయాణం ముగిసిన తరువాత నీవు అతడి నుండి అద్దె తీసుకోవడానికే ఒంటేలను అద్దెకిచ్చావు. అతడు తీసుకెళతాడు మరియు నువ్వు డబ్బులొస్తాయి అని ఆశిస్తావు, ఔనాకాదా! ఔను ప్రవక్త కుమారా! అయితే నువ్వు హారూన్ తిరిగి వచ్చి నీవు అద్దెడబ్బులు ఇచ్చేవరకైనా ప్రాణాలతో ఉండాలని కోరుకుంటావా లేదా! ఔను ప్రవక్త కుమారా! ఇమామ్ ఇలా అన్నారు: “ఎవరైతే ఏవిధంగానైనా సరే దుర్మార్గుడు మిగిలి ఉండాలి అని కోరుకుంటాడో వారు కూడా ఆ దుర్మార్గులలో లెక్కబడతారు. మరి ఎవరైతే దుర్మార్గులలో లెక్కించబడతారో వారు నరకానికి వెళతారు” ఈ సంఘటన తరువాత తను చేసే పని తన ప్రాణాలకు హాని కలిగించవచ్చు అని తెలిసి కూడా సఫ్వాన్ ఒకేసారి తన అన్ని ఒంటెలను అమ్మేశాడు.[2].

ఈ రివాయత్ ద్వారా మనం తెలుసుకోవలసినదేమిటంటే., మనం చేసే చర్యలను ముందు పరిశీలించాలి దాని ద్వార దుర్మార్గుడికి సహాయం అందిస్తున్నామా లేదా అని. అలాగే దుర్మార్గుడు బాగుండాలి అని ఆశించకూడదు. ఒకవేళ మేము ఒక వస్తువు మన వద్ద ఉండడం వల్ల తెలిసో తెలియకో అన్యాయంలో పాల్గోంటాము అని అనిపిస్తే మనకు నష్టం వచ్చినా సరే వాటిని విడచేయడమే మేలు...   

అన్యాయానికి గురి అయిన వారికి కలిగే కష్టాన్ని గ్రహించడం చాలా కష్టం అన్యాయానికి గురి అయినవారికే అది తెలుస్తుంది. ఇమామ్ మూసా కాజిమ్(అ.స) ఇలా ఉల్లేఖించారు: అన్యాయం లో ఉన్న బాధ అన్యాయానికి గురి అయిన వారికి మాత్రామే తెలుస్తుంది.[3]

రిఫ్రెన్స్
1. తొహ్ఫుల్ ఉఖూల్, ఇబ్నె షఅబె హర్రానీ, భాగం1, పేజీ411.
2. షేఖ్ అబ్బాసె ఖుమ్మీ, సఫీనతుల్ బిహార్, ఆస్తానె ఖుద్సె రజవీ, మష్హద్, ఇరాన్, 1430.
3. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, భాగం35, పేజీ326, హదీస్78.  

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
11 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 2